జీవనశైలి సరిగా లేకపోవడం, అసమతుల్య ఆహారం, శరీరంలో తగినంత నీరు లేకపోవడం, పని ఒత్తిడి వంటి ఎన్నో కారణాలు మైగ్రేన్‌కు దారి తీస్తాయి. ఈ తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి డాక్టర్ ఇచ్చే మందులతో పాటు కొన్ని రకాల పండ్లు తినడం వల్ల ఈ సమస్య నుంచి వేగంగా బయటపడొచ్చు. అవేంటో తెలుసుకుందాం..
మైగ్రేన్ బాధితులు తినవలసిన పండ్లు ఇవే
పుచ్చకాయ: మైగ్రేన్ బాధితులకు పుచ్చకాయ చాలా ప్రయోజనకరం. అందుకే మైగ్రేన్ బాధితులకు వైద్యులు పుచ్చకాయను సిఫార్సు చేస్తుంటారు. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, దీన్ని తినడం వల్ల తలనొప్పిని తగ్గించడంలో, కండరాలను సడలించడంలో సహాయ పడుతుంది. నీటితో పాటు, పుచ్చకాయలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి నొప్పిని తగ్గించడంలో సహాయ పడతాయి.
చదవండి: 17 ఏళ్ల తరువాత ఇండియాకు ఎన్‌ఆర్‌ఐ జంట, వీడియో వైరల్
అరటిపండు: అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిని తినడం వల్ల శరీరానికి తగినంత పోషకాలు లభిస్తాయి. అనారోగ్యంతో పోరాడే శరీర సామర్థ్యం పెరుగుతుంది. అరటిపండ్లలోని పొటాషియం, మెగ్నీషియం తలనొప్పి నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి.
యాపిల్: యాపిల్ లోని యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, పెక్టిన్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లు మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.
అవకాడో: అవకాడో తినడం కూడా మైగ్రేన్ బాధితులకు చాలా మంచిది. ఇది తలనొప్పి, మైగ్రేన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అవకాడోలో మంచి మొత్తంలో రిబోఫ్లేవిన్, నియాసిన్, ఫోలేట్, పొటాషియం, లుటీన్, బీటా కెరోటిన్ వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి తలనొప్పిని తగ్గించడంలో సహాయ పడతాయి. ఈ పండ్లతో పాటు మైగ్రేన్ బాధితులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం కూడా చాలా ముఖ్యం. అలాగే యోగా, ధ్యానం, వ్యాయామం కూడా మైగ్రేన్ సమస్యను వేగంగా తగ్గిస్తాయి.
చదవండి: రాయల్ వెడ్డింగ్ : గర్ల్‌ఫ్రెండ్‌తో జూ. ట్రంప్ స్టెప్పులు


