రూ.62,500 కోట్లతో 156 ప్రచండ్‌ హెలికాప్టర్లు | Cabinet approves Rs 62,000-crore deal to buy 156 combat helicopters | Sakshi
Sakshi News home page

రూ.62,500 కోట్లతో 156 ప్రచండ్‌ హెలికాప్టర్లు

Mar 29 2025 4:51 AM | Updated on Mar 29 2025 4:51 AM

Cabinet approves Rs 62,000-crore deal to buy 156 combat helicopters

హెచ్‌ఏఎల్‌ నుంచి కొనుగోలుకు సీసీఎస్‌ ఆమోదం

న్యూఢిల్లీ: రూ.62,500 కోట్లతో 156 ప్రచండ్‌ హెలికాప్టర్ల కొనుగోలుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతపై కేబినెట్‌ కమిటీ(సీసీఎస్‌) శుక్రవారం ఆమోద ముద్రవేసింది. ఈ తేలికపాటి కాంబాట్‌ హెలికాప్టర్లను హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) నుంచి కొనుగోలు చేయనున్నారు. దేశంలో సైనిక సామర్థ్యాన్ని పెంచడంలో ఇదొక ముందడుగు అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. 

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్‌ చేసి, అభివృద్ధి చేసిన యుద్ధ హెలికాప్టర్లు ఇవే కావడం విశేషం. ప్రచండ్‌ హెలికాప్టర్లు 5 వేల మీటర్ల ఎత్తు వరకు ప్రయాణింగలవు. సీసీఎస్‌ ఆమోదం తెలపడంతో హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన రెండు ఒప్పందాలపై రక్షణ శాఖ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇందులో 66 హెలికాప్టర్లను భారత వాయుసేనకు, మరో 90 హెలికాప్టర్లను భారత నావికాదళానికి హెచ్‌ఏఎల్‌ సరఫరా చేయాల్సి ఉంటుంది. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు ఇదొక గొప్ప ప్రోత్సాహకమని, ఈ రెండు ఒప్పందాల వల్ల 8,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement