
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బీహార్‌లో ముకామ- ముంగర్ మధ్య 82 కిలోమీటర్ల హైవే నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
బక్సర్ బగ్లాపూర్ కారిడార్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్మించనున్న 84 కిలోమీటర్ల జాతీయ రహదారికి రూ.4447 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. దీంతో పాటు బీహార్‌లోని భాగల్పూర్ డంకా రాంపూర్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 177 కిలోమీటర్ల రైల్వే డబ్లింగ్ పనులకు రూ.3,169 కోట్ల రూపాయల్ని కేంద్రం ఖర్చు చేయనుంది.