రైల్వే ట్రాక్‌పై బస్సు బోల్తా | Sakshi
Sakshi News home page

రైల్వే ట్రాక్‌పై బస్సు బోల్తా

Published Mon, Nov 6 2023 10:40 AM

Bus Falls On Railway Track In Rajasthan - Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. దౌసా జిల్లాలో బస్సు అదుపుతప్పి రైలు పట్టాలపై బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగులు మృతి చెందారు. దాదాపు 24 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. హరిద్వార్‌ నుంచి ఉదయ్‌పూర్‌ వైపు 30 మందితో ప్రయాణిస్తున్న బస్సు అర్ధరాత్రి సమయంలో ప్రమాదానికి గురైంది.

'ప్రమాదానికి గురైన వెంటనే 24 మందిని ఆస్పత్రికి తరలించాం. నలుగురు ఘటనాస్థలంలోనే మరణించారు. క్షతగాత్రులకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.' అని జిల్లా అదనపు కలెక్టర్‌ రాజ్‌కుమార్ కాస్వా తెలిపారు.

ప్రమాదం జరిగిన సమయంలో రైలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన అధికారులు.. ట్రాక్‌పై నుంచి బోల్తా కొట్టిన బస్సును తొలగించారు. ప్రమాదంపై సీఎం అశోక్ గహ్లోత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల పట్ల సంతాపం తెలిపారు. సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు.   

ఇదీ చదవండి: కర్ణాటకలో కలకలం.. మహిళా అధికారి దారుణ హత్య

Advertisement
 
Advertisement