
భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరిక
న్యూఢిల్లీ: మీరు బ్లూటూత్ ఆధారిత స్పీకర్లు, ఇయర్‌బడ్లు ఉపయోగిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. బ్రాండ్ ఏదైనా కానీ.. బ్లూటూత్ ఆధారిత స్పీకర్లు ముప్పు కలిగిస్తాయని ఇండియన్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. ‘‘హ్యాకర్లు ఆడియో పరికరాలను నియంత్రణలోకి తీసుకోవడానికి, సంభాషణలపై నిఘా పెట్టడానికి, కాల్‌ను హైజాక్ చేసి పరికరాన్ని రిమోట్‌గా నియంత్రించడానికి బ్లూటూత్ కారణమవుతుంది. ఐరోహా సిస్టమ్స్ చిప్ ఉన్న బ్లూటూత్ హెడ్‌ఫోన్లు, స్పీకర్లు, కార్ ఇన్ఫోటైన్‌మెంట్ సిçస్టమ్ వినియోగదారులకు ఈ ప్రమాదం ఎక్కువ.
బ్లూటూత్ ఇయర్‌బడ్, సోనీ, బోస్, సెన్‌హైజర్, బోట్ వంటి పెద్ద బ్రాండ్ల స్పీకర్లను వాడుతున్నా ప్రమాదమే. బ్లూటూత్‌తో దాడి చేసి ఫోన్ మెమరీని చదివే, మైక్రోఫోన్ ద్వారా వినే, కాల్ డేటా, కాంటాక్ట్‌లను దొంగిలించే అవకాశముంది. హానికరమైన ఆదేశాలు కూడా ఇవ్వొచ్చు. హ్యాకర్ బ్లూటూత్‌కు కనెక్ట్ అయి మీతకు తెలియకుండానే డివైజ్ మీద పూర్తి నియంత్రణ తీసుకోవచ్చు. వీటినుంచి బయటపడాలంటే బ్లూటూత్ పరికరాలకు ఫర్మ్‌వేర్‌ను అప్‌డేట్ చేయండి. డివైజ్ తయారీదారు విడుదల చేసిన వెంటనే అప్‌డేట్స్‌ను ఇన్‌స్టాల్ చేయండి. బహిరంగ ప్రదేశాల్లో పరికరాలను బ్లూటూత్‌కు జత చేయకుండా ఉండండి’’ అని సూచించింది.