breaking news
bluetooth speaker
-
‘బ్లూటూత్’ స్పీకర్లతో జాగ్రత్త!
న్యూఢిల్లీ: మీరు బ్లూటూత్ ఆధారిత స్పీకర్లు, ఇయర్‌బడ్‌లు ఉపయోగిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. బ్రాండ్ ఏదైనా కానీ.. బ్లూటూత్ ఆధారిత స్పీకర్లు ముప్పు కలిగిస్తాయని ఇండియన్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. ‘‘హ్యాకర్లు ఆడియో పరికరాలను నియంత్రణలోకి తీసుకోవడానికి, సంభాషణలపై నిఘా పెట్టడానికి, కాల్‌ను హైజాక్ చేసి పరికరాన్ని రిమోట్‌గా నియంత్రించడానికి బ్లూటూత్ కారణమవుతుంది. ఐరోహా సిస్టమ్స్ చిప్ ఉన్న బ్లూటూత్ హెడ్ఫోన్లు, స్పీకర్లు, కార్ ఇన్ఫోటైన్మెంట్ సిçస్టమ్ వినియోగదారులకు ఈ ప్రమాదం ఎక్కువ. బ్లూటూత్ ఇయర్‌బడ్, సోనీ, బోస్, సెన్హైజర్, బోట్ వంటి పెద్ద బ్రాండ్ల స్పీకర్లను వాడుతున్నా ప్రమాదమే. బ్లూటూత్‌తో దాడి చేసి ఫోన్ మెమరీని చదివే, మైక్రోఫోన్ ద్వారా వినే, కాల్ డేటా, కాంటాక్ట్‌లను దొంగిలించే అవకాశముంది. హానికరమైన ఆదేశాలు కూడా ఇవ్వొచ్చు. హ్యాకర్ బ్లూటూత్‌కు కనెక్ట్ అయి మీతకు తెలియకుండానే డివైజ్ మీద పూర్తి నియంత్రణ తీసుకోవచ్చు. వీటినుంచి బయటపడాలంటే బ్లూటూత్ పరికరాలకు ఫర్మ్‌వేర్‌ను అప్డేట్ చేయండి. డివైజ్ తయారీదారు విడుదల చేసిన వెంటనే అప్డేట్స్ను ఇన్స్టాల్ చేయండి. బహిరంగ ప్రదేశాల్లో పరికరాలను బ్లూటూత్‌కు జత చేయకుండా ఉండండి’’ అని సూచించింది. -
వర్షం వచ్చిందంటే ఈ గాడ్జెట్స్ ఉండాల్సిందే..
వానొచ్చిదంటే ఎన్నో సరదాలను తెస్తుంది. వాటితో పాటు ఎన్నో సమస్యలను కూడా! అయితే, వాన తెచ్చే తిప్పల్లో అన్నీ కాకపోయినా కొన్నింటికి చెక్ పెట్టే స్మార్ట్ సొల్యూషన్సే ఈ గాడ్జెట్స్!వాటర్‌ప్రూఫ్ బ్లూటూత్ స్పీకర్వాన పడుతుంటే చాలామంది చాయ్‌లో బిస్కట్ ముంచేస్తారు. కాని, అంతకంటే ఎక్కువమంది వానలో మంచి మ్యూజిక్‌తో మూడ్‌ని మిక్స్ చేసి ఎంజాయ్ చేస్తుంటారు. అలాగని, వర్షంలో స్పీకర్ పెడితే అప్పుడు అది సింకింగ్ షిప్ అయిపోతుంది. ఇందుకోసమే ఓ అద్భుతమైన ఆవిష్కరణ వచ్చేసింది. వాటర్‌ప్రూఫ్ బ్లూటూత్ స్పీకర్. దీనిని బయటపెట్టి మ్యూజిక్ ప్లే చేస్తే రెయిన్ డాన్స్ పార్టీని క్రియేట్ చేయొచ్చు. ధర వివిధ బ్రాండ్స్, డిజైన్స్ బట్టి ఉంటుంది. ఆన్లైన్లో లభ్యం.ఇది వర్షం చూసి పారిపోయే కెమెరా కాదు..వర్షం వచ్చిన వెంటనే కాఫీ చేతిలో పట్టుకొని, ఓపెన్ టెర్రస్ మీద సరదాగా ఓ సెల్ఫీ తీసుకోవాలనిపించిందా? కాని, ఫోన్ జారిపోతుందేమోననే భయంతో, కేవలం కాఫీనే ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడు అవన్నీ పాత కథలు! ఎందుకంటే ఇప్పుడు మీ చేతిలోకి వచ్చింది ‘ఇస్టా 360’. ఈ చిన్న గాడ్జెట్ తీసే ఫొటోలు, వీడియోలు హాలీవుడ్ లెవెల్లో ఉంటాయి. అన్ని యాంగిల్స్ల్లోనూ అద్భుతంగా తీయగల ఈ చిన్న కెమెరా ఉంటే ఇక పెద్ద పెద్ద కెమెరాలతో పని ఉండదు. పైగా ఇది వర్షం చూసి పారిపోయే కెమెరా కాదు. ఇది తానే నీళ్లలోకి దూకేస్తుంది. అంటే పది మీటర్ల లోతు వరకు వాటర్ ప్రూఫ్ అన్నమాట. చక్కగా షర్ట్‌కి అంటించి పెట్టుకొని వాడుకోవచ్చు. పైగా కెమెరాను ఎక్కడైనా మర్చిపోతే, మీ ఫోన్ మాత్రం ‘ఏయ్, ఇక్కడ ఉంది కెమెరా’ అని ఇందులోని అలర్ట్ సిస్టమ్ చెప్తుంది. ధర. 599 డాలర్లు (రూ. 51,003). వాన జాడ చెప్పే గొడుగు..‘వాన వస్తుందా లేదా? గొడుగు తీసుకెళ్దామా? వద్దా?’ అని ఇలా మీలో మీరు ప్రశ్నలు వేసుకునే ముందు ఒక్కసారి ఈ ‘డ్యావెక్ అలర్ట్ గొడుగు’ను అడిగి చూడండి. వాతావరణం ఎలా ఉండబోతుందో ఈ గొడుగే చెప్తుంది. పైగా దీనిని ఫోన్‌కు కనెక్ట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇందులోని అలెర్ట్ సిస్టమ్ ఎప్పుడైనా గొడుగును తీసుకెళ్లడం మర్చిపోయారో, వెంటనే, టింగ్ అని ఫోన్‌కి మెసేజ్ వస్తుంది ‘నన్ను మర్చిపోయావ్ బాస్’ అని గొడుగు మీకు గుర్తుచేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది గొడుగు కాదు. బ్రహ్మానందం లెవల్ కామెడీ ప్లస్ స్మార్ట్‌నెస్‌ను కలిపిన వస్తువు. పైగా ఇది సాధారణ గొడుగులా కాకుండా చాలా బలంగా ఉంటుంది. ఈదురు గాలులకు కూడా కదలదు. ఇక దీని స్టయిల్లో చూసుకుంటే, పెద్ద పెద్ద డిజైనర్ గొడుగులు కూడా దీనితో పోటీ పడలేవు. ధర 69 డాలర్లు (రూ. 5,870). -
ప్రియురాలి కోసం.. ప్రియమైన రాగం!
ఇదేమిటి..? కొవ్వొత్తి వెలుగులు పంచే వినూత్న లాంతరు అనుకుంటున్నారా? కాదు. సంగీతం వినిపించే సరికొత్త బ్లూటూత్ స్పీకరు! గాజు, పింగాణీ పదార్థంతో తయారు చేసిన ఈ ‘పెల్టీ’ స్పీకరులో ఓ కొవ్వొత్తిని ఉంచి వెలిగిస్తే.. ఆ వేడిని గ్రహించి పాడటానికి సిద్ధమైపోతుంది. తర్వాత స్మార్ట్‌ఫోన్‌లో మ్యూజిక్ ప్లేచేస్తే ఇది బ్లూటూత్ ద్వారా అనుసంధానమై పాటలను వినిపిస్తుంది. కొవ్వొత్తి అయిపోయేదాకా పాడుతూనే ఉంటుంది. ఉష్ణోగ్రతల్లో మార్పులను ఎలక్ట్రిక్ వోల్టేజీగా మార్చుకునేందుకు వీలయ్యే ‘పెల్టియర్ ఎఫెక్ట్’ అనే సూత్రం ఆధారంగా ఇది పనిచేస్తుంది. స్పీకర్ ఆపేయాలంటే జస్ట్ ఉఫ్‌మని ఊదితే చాలు. ఇటలీలోని మిలన్కు చెందిన గియాన్లుకా గాంబా అనే అతను తన కాబోయే భార్య కోసం దీనిని రూపొందించాడు. మంచి సంగీతం కూడా వినిపిస్తే మూడ్ మరింత బాగుంటుందని భావించాడు. అందుకే డిఫరెంట్‌గా ఆలోచించి దీనిని ఆవిష్కరించాడు. కొంచెం నాణ్యమైన కొవ్వొత్తి అయితే దీనిలో ఐదుగంటలు వెలుగుతుందట. దీని ధర సుమారు రూ.11 వేలు!