ప్రియురాలి కోసం.. ప్రియమైన రాగం! | Fire Powered Bluetooth Speaker Unveiled Called Pelty | Sakshi
Sakshi News home page

ప్రియురాలి కోసం.. ప్రియమైన రాగం!

Jun 29 2014 10:41 AM | Updated on Sep 2 2017 9:34 AM

ప్రియురాలి కోసం.. ప్రియమైన రాగం!

ప్రియురాలి కోసం.. ప్రియమైన రాగం!

ఇదేమిటి..? కొవ్వొత్తి వెలుగులు పంచే వినూత్న లాంతరు అనుకుంటున్నారా? కాదు.

ఇదేమిటి..? కొవ్వొత్తి వెలుగులు పంచే  వినూత్న లాంతరు అనుకుంటున్నారా? కాదు. సంగీతం వినిపించే సరికొత్త బ్లూటూత్ స్పీకరు! గాజు, పింగాణీ పదార్థంతో తయారు చేసిన ఈ ‘పెల్టీ’ స్పీకరులో ఓ కొవ్వొత్తిని ఉంచి వెలిగిస్తే.. ఆ వేడిని గ్రహించి పాడటానికి సిద్ధమైపోతుంది. తర్వాత స్మార్ట్‌ఫోన్‌లో మ్యూజిక్ ప్లేచేస్తే ఇది బ్లూటూత్ ద్వారా అనుసంధానమై పాటలను వినిపిస్తుంది. కొవ్వొత్తి అయిపోయేదాకా పాడుతూనే ఉంటుంది. ఉష్ణోగ్రతల్లో మార్పులను ఎలక్ట్రిక్ వోల్టేజీగా మార్చుకునేందుకు వీలయ్యే ‘పెల్టియర్ ఎఫెక్ట్’ అనే సూత్రం ఆధారంగా ఇది పనిచేస్తుంది. స్పీకర్ ఆపేయాలంటే జస్ట్ ఉఫ్‌మని ఊదితే చాలు.

 

ఇటలీలోని మిలన్‌కు చెందిన గియాన్లుకా గాంబా అనే అతను తన కాబోయే భార్య కోసం దీనిని రూపొందించాడు. మంచి సంగీతం కూడా వినిపిస్తే మూడ్ మరింత బాగుంటుందని భావించాడు. అందుకే డిఫరెంట్‌గా ఆలోచించి దీనిని ఆవిష్కరించాడు. కొంచెం నాణ్యమైన కొవ్వొత్తి అయితే దీనిలో ఐదుగంటలు వెలుగుతుందట. దీని ధర సుమారు రూ.11 వేలు!

Advertisement
 
Advertisement
Advertisement