breaking news
Indian cyberspace
-
‘బ్లూటూత్’ స్పీకర్లతో జాగ్రత్త!
న్యూఢిల్లీ: మీరు బ్లూటూత్ ఆధారిత స్పీకర్లు, ఇయర్‌బడ్‌లు ఉపయోగిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. బ్రాండ్ ఏదైనా కానీ.. బ్లూటూత్ ఆధారిత స్పీకర్లు ముప్పు కలిగిస్తాయని ఇండియన్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. ‘‘హ్యాకర్లు ఆడియో పరికరాలను నియంత్రణలోకి తీసుకోవడానికి, సంభాషణలపై నిఘా పెట్టడానికి, కాల్‌ను హైజాక్ చేసి పరికరాన్ని రిమోట్‌గా నియంత్రించడానికి బ్లూటూత్ కారణమవుతుంది. ఐరోహా సిస్టమ్స్ చిప్ ఉన్న బ్లూటూత్ హెడ్ఫోన్లు, స్పీకర్లు, కార్ ఇన్ఫోటైన్మెంట్ సిçస్టమ్ వినియోగదారులకు ఈ ప్రమాదం ఎక్కువ. బ్లూటూత్ ఇయర్‌బడ్, సోనీ, బోస్, సెన్హైజర్, బోట్ వంటి పెద్ద బ్రాండ్ల స్పీకర్లను వాడుతున్నా ప్రమాదమే. బ్లూటూత్‌తో దాడి చేసి ఫోన్ మెమరీని చదివే, మైక్రోఫోన్ ద్వారా వినే, కాల్ డేటా, కాంటాక్ట్‌లను దొంగిలించే అవకాశముంది. హానికరమైన ఆదేశాలు కూడా ఇవ్వొచ్చు. హ్యాకర్ బ్లూటూత్‌కు కనెక్ట్ అయి మీతకు తెలియకుండానే డివైజ్ మీద పూర్తి నియంత్రణ తీసుకోవచ్చు. వీటినుంచి బయటపడాలంటే బ్లూటూత్ పరికరాలకు ఫర్మ్‌వేర్‌ను అప్డేట్ చేయండి. డివైజ్ తయారీదారు విడుదల చేసిన వెంటనే అప్డేట్స్ను ఇన్స్టాల్ చేయండి. బహిరంగ ప్రదేశాల్లో పరికరాలను బ్లూటూత్‌కు జత చేయకుండా ఉండండి’’ అని సూచించింది. -
ప్రియాంక.. మోస్ట్ డేంజరస్ గురూ!
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా చాలా డేంజరస్ అట. అదేంటి.. చక్కగా నటిస్తోంది కదా అనుకుంటున్నారా.. మామూలుగా కాదండీ, ఇంటర్నెట్లో మాత్రమే ఈమె ప్రమాదకారిగా ఉందట. ఇంతకుముందు ఆలియాభట్ ఈ విషయంలో అగ్రస్థానంలో ఉండగా, ఆమెను తోసిరాజని ప్రియాంక ఇప్పుడు ప్రమాదకారిగా మారిపోయింది. ఈ విషయాన్ని ఇంటెల్ సంస్థ స్వయంగా ప్రకటించింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. ప్రియాంకా చోప్రా అనే పేరుతో సెర్చ్ చేస్తే.. అత్యంత ప్రమాదకరమైన వెబ్ సైట్ల లింకులు వస్తున్నాయి. పొరపాటున వాటిని ఓపెన్ చేశారో, ఇక మీ కంప్యూటర్ వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. మీ ఈమెయిల్ ఐడీ పాస్‌వర్డుల దగ్గర్నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డుల వరకు అన్నీ వాళ్లకు అర నిమిషంలో తెలిసిపోయే అవకాశం ఉంటుంది. ఈ జాబితాలో ఇంకా చాలామంది ప్రముఖులే ఉన్నారు. శ్రద్ధా కపూర్, కపిల్ శర్మ.. ఇలాంటి వాళ్ల పేర్లతో కూడా ఇంటర్నెట్ మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. టీవీ షో ప్రీమియర్లు, అవార్డు షోలు, సినిమా ఆడియో విడుదల, సెలబ్రిటీల బ్రేకప్‌లు.. ఇలాంటి విషయాల ఆధారంగా సైబర్ నేరగాళ్లు తమ చేతివాటం చూపిస్తున్నారు. టోరెంట్, హెచ్డీ డౌన్లోడ్, ఫ్రీ ఎంపీ4 లాంటి పదాలను ఈ సెలబ్రిటీల పేర్లకు జతచేసి.. నిజంగా అందులో ఏవైనా డౌన్లోడ్లు ఉన్నాయేమోనని భ్రమపడేలా చేసి ఆకర్షించడం, ఆపై వాటిలో ప్రమాదకరమైన లింకులు పెట్టడం వీళ్లకు అలవాటుగా మారింది. ఇంతకుముందు కూడా జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కంగనా రనౌత్, హృతిక్ రోషన్, దీపికా పడుకొన్, ఇమ్రాన్ హష్మి, సన్నీ లియోన్, ఆలియాభట్, ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ లాంటి సెలబ్రిటీల పేర్లతో ప్రమాదకరమైన లింకులు పెట్టిన ఘటనలున్నాయి. -
సైబర్ స్పేస్‌లోకి ప్రమాదకర వైరస్!
న్యూఢిల్లీ: భారత సైబర్‌స్పేస్‌లో 'బయోజీ' అనే ప్రమాదకర వైరస్ వ్యాప్తి చెందుతోందని సైబర్ దాడుల నిరోధక సంస్థ సెర్ట్-ఇన్ (కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా) హెచ్చరించింది. ఈ వైరస్ వినియోగదారుల కంప్యూటర్లలోకి చొరబడి వారి సమాచారాన్ని మార్చివేసి, తస్కరిస్తుందని తెలిపింది. ట్రోజన్ రకానికి చెందిన ఈ వైరస్ ఐదు మారు రూపాల్లో కంప్యూటర్లలోకి ప్రవేశించి రిమోట్ పద్ధతిలో పనిచేస్తుందని, వేరే చోట ఉన్న వ్యక్తులు దీని ద్వారా కంప్యూటర్లలోకి సమాచారాన్ని ఎక్కించడం లేదా తస్కరించడం, ఫైళ్లను డిలీట్ చేయడం, మార్చివేయడం వంటివి చేసేందుకు వీలవుతుందని పేర్కొంది. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు బయోజీ(బీఐవోఏజడ్ఐహెచ్), ఇతర సారూప్య పేర్లతో కూడిన ఈ-మెయిల్స్, లింకులను ఓపెన్ చేయరాదని ఇంటర్నెట్ వినియోదారులకు సెర్ట్-ఇన్ సూచన చేసింది. గుర్తుతెలియని వెబ్సైట్లలోకి లాగిన్ కాకుండా ఉండటం, ఆటోరన్/ఆటో ప్లే ఆప్షన్లను డిజేబుల్ చేసుకోవడం, యాంటీ వైరస్ సాప్ట్వేర్లను అప్డేట్ చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.