
150 కిలోమీటర్లు నడిచిన బాల కారి్మకుడు
గురుగ్రామ్: ప్రాథమిక విద్య హక్కుగా ఉన్నా... అది ఆచరణకు నోచుకోవడం లేదు. బాల కార్మిక నిర్మూలనకు ప్రభుత్వాలెన్ని పథకాలు పెడుతున్నా.. అమలులో విఫలమవుతూనే ఉందని మళ్లీ మళ్లీ రుజువవుతూనే ఉంది. తాజాగా బీహార్‌కు చెందిన ఓ బాలుడు.. ఆ వెట్టి నుంచి తప్పించుకోవడానికి 150 కిలోమీటర్లు నడిచాడు. చివరకు తన చేయి కూడా పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. 15 ఏళ్ల బాలుడు హర్యానా, జింద్ జిల్లాలోని ఒక పాడి పరిశ్రమలో కార్మికుగా పనిచేస్తున్నాడు.
అతని స్వస్థలం బీహార్‌లోని కిషన్‌గంజ్ జిలా. నెలకు రూ.10,000 వేతనం ఇస్తామన్న హామీతో అతడిని పనిలోకి తీసుకెళ్లారు. డైరీ ఫామ్‌లో అతన్ని మోటరైజ్డ్ ఫీడర్ చాపర్ ఆపరేటర్‌గా పెట్టారు. ఆ ఫామ్ దగ్గరే ఓ గదిలో నివాసం. వేతనం మాట అటుంచితే.. సరైన ఆహారం కూడా పెట్టలేదు. చాపర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్ను సమయంలో అతని చేతికి గాయమైంది. ఆ తరువాత అపాస్మరక స్థితిలోకి వెళ్లిపోయాడు. మెలకువ వచ్చేసరికి అతను డిస్పెన్సరీలో ఉన్నాడు. ప్రాథమిక చికిత్స చేసిన డిస్పెన్సరీ సిబ్బంది బాలుడిని వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. మళ్లీ ఫామ్‌కు వెళ్లడం ఇష్టం లేని బాలుడు బీహార్‌కు నడక మొదలు పెట్టాడు.
దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం మొండిగా వెళ్లాలి. దాదాపు 150 కిలోమీటర్లు నడిచిన తరువాత నుహ్‌జిల్లాలోని టౌరు సమీపంలో అతన్ని ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు చూశారు. భోజనం పెట్టి, పోలీసులకు అప్పగించారు. వివరాలు అడిగి తెలుసుకున్న పోలీసులు.. చేతి గాయానికి చికిత్స కోసం నుహ్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. అతని సోదరుడు, ఇతర బంధువులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కుటుంబం హుటాహుటిన వచి్చన బాలుడిని తీసుకెళ్లి ఆస్పత్రిలో చేరి్పంచారు. గాయం తీవ్రమవ్వడంతో మోచేతి వరకు చేయిని తొలగించాల్సి వచి్చంది.