
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించడంతో అటు రాజకీయ నేతలు, ఇటు పార్టీలలో ఉత్సాహం రెట్టింపయ్యింది. ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 6,11 తేదీలలో ఓటింగ్ జరగనుంది. ఫలితాలు నవంబర్ 14న వెల్లడికానున్నాయి. ఎన్నికల తేదీల ప్రకటన దరిమిలా అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ), ప్రతిపక్ష మహా కూటమి మధ్య ‘ఎవరికెన్ని?’ నినాదాల యుద్ధం ఊపందుకుంది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ‘25 నుంచి 30.. మా ఇద్దరు సోదరులు.. నరేంద్ర మోదీ, నితీష్‌లకు’ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. దీనికి ప్రతిస్పందనగా, మహా కూటమి (ఆర్జేడీ) నేత లాలూ ప్రసాద్ యాదవ్ రంగంలోకి దిగి, తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ ఖాతాలో ‘ఆరు- పదకొండు, ఎన్‌డీఏకి ‘నౌ దో గ్యారహ్’ అని పేర్కొన్నారు. (ఈ హిందీ సామెతకు ఓటమి అని అర్థం). విజయ్ కుమార్ సిన్హా -లాలూ యాదవ్ మధ్య నినాద యుద్ధానికి ముందు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) ‘25 నుండి 30.. మళ్లీ నితీష్’ అనే నినాదాన్ని వినిపించారు. ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ సీఎం అవుతారనే సందేశాన్ని జేడీయూ ఇంతకుముందే వినిపించింది.
छह और ग्यारह
NDA
नौ दो ग्यारह!— Lalu Prasad Yadav (@laluprasadrjd) October 7, 2025
ఎన్నికల కమిషన్ బృందంతో జరిగిన సమావేశంలో జేడీయూ, బీజేపీలతో పాటు పలు రాజకీయ పార్టీలు ఛత్ పూజ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని అభ్యర్థించాయి. సూర్య ఆరాధన ఉత్పవంగా పేరొందిన ఛత్ వ్రతం అక్టోబర్ 25 నుండి 28 వరకు జరగనుంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న ఎన్నికల కమిషన్ నవంబర్‌లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. మొదటి దశలో బీహార్‌లోని 16 జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6న పోలింగ్ జరగనుంది. మిగిలిన స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది.
किसानों को रुलाने वाली 20 सालों की निर्दयी एनडीए सरकार को बदलने का वक्त आ गया है। #LaluYadav #Bihar #RJD #बिहार pic.twitter.com/LPTH7MUiIc
— Lalu Prasad Yadav (@laluprasadrjd) September 26, 2025