
నగదు ప్రోత్సాహకాలు ప్రకటించిన నితీశ్ ప్రభుత్వం
తేజస్వీ యాదవ్ వైపే యువత మొగ్గంటూ తేల్చిన సర్వేలు
దీంతో అప్రమత్తమైన నితీశ్ కుమార్
ఛత్ర యువ సంసద్’ కార్యక్రమాలతో జనంలోకి తేజస్వీ
సాక్షి, న్యూఢిల్లీ: మరో మూడు, నాలుగు నెలల్లో జరుగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్లు అత్యంత కీలకంగా మారారు. దీంతో, వానిపి ఆకట్టుకునేందుకు అధికార జేడీయూతో పాటు ప్రతిపక్ష ఆర్‌జేడీ, కాంగ్రెస్‌లు పోటీ పడుతున్నాయి. ఎన్నికల తాయిలాలతో వారికి గాలం వేసేందుకు తాపత్రయపడుతున్నాయి.
కోటిన్నర మందికి పైగా ఉన్న యువ ఓటర్లు ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నట్లు కొన్ని సర్వేలు తేల్చాయి. ఈ నేపథ్యంలో అలెర్ట్ అయిన ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ప్రభుత్వం యువతకు ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలు ప్రకటించింది. వారిని తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది.
యువతపై హామీల వాన
బిహార్‌లో ఉన్న 243 నియోజకవర్గాలు, 8 కోట్ల ఓటర్లలో యువత పాత్ర చాలా కీలకంగా ఉంది. కొత్తగా నమోదైన ఓటర్లే 18 లక్షల వరకు ఉన్నారు. 18–35 ఏళ్ల వయస్సున్న యువ ఓటర్ల సంఖ్య మొత్తం 1.60 కోట్ల వరకు ఉంది. ఇటీవల యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకొని నిర్వహించిన సర్వేలో 18–29 ఏళ్ల వయస్సు వారిలో 44.6 శాతం మంది ఎన్డీయేకు ఓటు వేయడానికి ఇష్టపడుతున్నారని, 39.5 శాతం మంది మహాఘట్‌బంధన్‌కు ఓటు వేయడానికి ఇష్టపడుతున్నారని చెప్పారు.
ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ వైపు కేవలం 0.76 శాతం మంది మాత్రమే అనుకూలంగా చెప్పారు. అయితే ముఖ్యమంత్రి అభ్యరి్థగా తేజస్వీ యాదవ్ తన పోటీదారుల కంటే బలమైన ఆధిక్యంలో ఉన్నారు. సుమారు 42 శాతం మంది బిహార్ తదుపరి ముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్‌ను ఇష్టపడుతున్నట్లు తేల్చారు. కేవలం 27.7 శాతం మంది మాత్రమే ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్‌కు అనుకూలంగా ఓటు వేశారు.
ఈ సర్వే ఫలితాలను దృష్టిలో పెట్టుకొనే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యువతకు నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు. ’ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ యోజన’పథకం కింద, 12వ తరగతి అర్హత సాధించిన విద్యార్థులకు రూ.4.000, ఐటీఐ లేక డిప్లొమా ఉన్నవారికి రూ.5,000, ఇంటర్న్‌షిప్‌లు తీసుకుంటున్న గ్రాడ్యుయేట్లు లేక పోస్ట్ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.6,000 అందిస్తామని ప్రకటించారు.
దీంతో పాటే 2025–26 నుంచి 2030–31 వరకు రాష్ట్రంలోని లక్ష మంది యువతకు వివిధ సంస్థలలో ఇంటర్న్‌షిప్‌లు అందిస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకే ఏటా రూ.685 కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి అదనంగా యువతకు అధునాతన నైపుణ్యాలు, మెరుగైన ఉపాధి, నాయకత్వ అభివృద్ధి, బలమైన నెట్‌వర్కింగ్, కెరీర్ మెరుగుదలకు కొత్త అవకాశాలను అందించేందుకు అనేక పథకాలను ప్రకటించారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి రాష్ట్రంలోని వితంతువులు, వృద్ధాప్య పింఛన్‌ను రూ.400 నుంచి రూ.1,100కు పెంచారు. దీనిని ఎదుర్కొని యువతను తనవైపు తిప్పికునే లక్ష్యంతో ఆర్‌జేడీ నేత తేజస్వీయాదÐవ్ ‘ఛత్ర యువ సంసద్’కార్యక్రమాలతో యువత మధ్యకు వెళుతున్నారు. తాము అధికారంలోకి వస్తే యువజన కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని, పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని, విద్యాపరంగా వెనుకబడ్డ విద్యార్థులకు ఇంటి నుంచి ట్యూటర్లను అందిస్తామని, పరీక్షా కేంద్రాలకు ఉచిత రవాణాను అందిస్తామని ప్రకటించారు.
సైన్స్, గణితం, ఇంగ్లిష్‌లలో వెనుకబడ్డ ఉన్న విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు వెళ్లి వారికి అదనపు సమయం కేటాయిస్తామన్నారు. బిహార్ విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు మరోసారి ఉన్నత స్థానాలకు చేరుకునే విధంగా విద్యా వ్యవస్థను మెరుగు పరుస్తామని హామీ ఇస్తున్నారు. ఇలా రెండు పార్టీల కీలక ¯óతలు యువతను ఆకట్టుకునే ఏర్పాట్లలో ఉండగా, కాంగ్రెస్, బీజేపీలు సైతం యువ ఓటర్లకు గాలం వేసేందుకు తన ప్రయత్నాలను మొదలుపెట్టాయి.