10, 12వ తరగతుల మార్కుషీట్లలో ఇక ‘ఫెయిల్’ఉండదు
బిహార్ విద్యా వ్యవస్థలో కీలక మార్పు
పట్నా: పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణులైతే ‘పాస్’, ఉత్తీర్ణులు ఆకకపోతే ‘ఫెయిల్’ అని మార్కుషీట్లలో ముద్రిస్తుంటారు. ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్లీ హాజరవుతుంటారు. మార్కుషీట్ల విషయంలో బిహార్‌లో కీలక మార్పునకు నాంది పలికారు. 10, 12వ తరగతుల విద్యార్థుల మార్కుషీట్లలో ఇకపై ‘ఫెయిల్’అనేదే ఉండదు.
ఉత్తీర్ణులు కాకపోతే.. ఫెయిల్ అని కాకుండా ‘నైపుణ్య శిక్షణకు అర్హులు’ అని ముద్రిస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు శనివారం ప్రకటించారు. ‘బిహార్ బోర్డ్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అండ్ ఎగ్జామినేషన్’అందించే వృత్తివిద్యా శిక్షణా కార్యక్రమాలను విద్యార్థులు అభ్యసించేలా చేయడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశమని తెలిపారు.


