
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయఅధ్యక్షుడు జేపీ నడ్డాకు కేంద్ర మంత్రి పదవి ఖరారైంది. నడ్డాను కేబినెట్‌లోకి తీసుకోవాలని నరేంద్ర మోదీ నిర్ణయించారు. మోదీతో పాటు నడ్డా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఖాళీ అవనుంది.
ఈ పదవిని బీజేపీ అగ్రనేత, మాజీ కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌కు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కేబినెట్ మంత్రి పదవి ఖరారావడంతో ప్రమాణస్వీకారానికి ముందు ప్రధాని నివాసంలో జరిగిన కాబోయే మంత్రుల చాయ్ భేటీకి నడ్డా హాజరయ్యారు.
ఎన్సీపీకి నో చాన్స్
కేంద్ర కేబినెట్ పదవుల్లో ఎన్సీపీకి షాక్ తగిలింది. కేంద్ర కేబినెట్‌లో అజిత్ పవార్ వర్గానికి చాన్స్ దక్కలేదు. ఎన్సీపీ నేతప్రపూల్ పటేల్‌కు కేంద్ర సహాయమంత్రి పదవిని ఆఫర్ చేయగా, ఆయన దాన్ని తిరస్కరించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేబినెట్ మంత్రిగా పని చేసిన తనకు సహాయ మంత్రి ఆఫర్ చేయడాన్ని తప్పుపట్టారు. ఇది తనను అవమానించడమేనన్నారు.