బెంగళూరు రేవ్‌ పార్టీ కేసు.. పోలీస్‌ డాగ్స్‌కు అరుదైన గౌరవం | Bengaluru Rave Party Sniffers facilitated By DCP Dayananda | Sakshi
Sakshi News home page

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసు.. పోలీస్‌ డాగ్స్‌కు అరుదైన గౌరవం

Jun 8 2024 8:39 PM | Updated on Jun 8 2024 8:39 PM

Bengaluru Rave Party Sniffers facilitated By DCP Dayananda

బెంగళూరు: సినీ ప్రముఖులు పాల్గొని సంచలనం సృష్టించిన రేవ్‌ పార్టీ కేసులో ఇవాళ ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. డ్రగ్స్‌ను పట్టించిన స్నిఫర్‌ డాగ్స్‌పై ప్రశంసలు గుప్పించిన బెంగళూరు సీపీ దయానంద.. వాటికి సన్మానం చేశారు.

హెబ్బాగోడిలో ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్‌ హౌస్‌లో మే 19వ తేదీన బర్త్‌ డే పార్టీ ముసుగులో రేవ్‌ పార్టీ జరుగుతుందన్న సమాచారం అందుకుని ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు దాడులు చేశారు. అయితే రేవ్‌ పార్టీని భగ్నం చేసిన వెంటనే K9 స్నిఫర్‌ డాగ్స్‌ను రంగంలోకి దించారు.

ఐదు స్నిఫర్‌ డాగ్స్‌  ఆ ప్రాంతంలో వాసన చూసి.. చివరకు చెట్ల పొదల్లో  దాచిన డ్రగ్స్‌ను కనిపెట్టాయి. దీంతో ఆ ఐదు డాగ్స్‌ను నగర సీపీ దయానంద పరేడ్‌ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారిప్పుడు.

 

Advertisement
 
Advertisement
Advertisement