కండక్టర్‌కు కత్తిపోట్లు..బస్సులో ప్రయాణికుడి బీభత్సం | Bengaluru Bus Conductor Gets Stabbed By Passenger | Sakshi
Sakshi News home page

కండక్టర్‌కు కత్తిపోట్లు..బస్సులో ప్రయాణికుడి బీభత్సం

Oct 2 2024 1:11 PM | Updated on Oct 2 2024 1:43 PM

Bengaluru Bus Conductor Gets Stabbed By Passenger

బెంగళూరు: నగరంలోని ఆర్టీసీ బస్సులో ఓ యువకుడు ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తున్నాడు. ఇది గమనించిన బస్సు కండక్టర్‌ అతడిని పైకి రమ్మన్నాడు. దీంతో చిర్రెత్తిపోయిన ఆ యువకుడు కండక్టర్‌పై కత్తితో దాడి చేశాడు. ఇంతటితో ఆగకుండా తోటి ప్రయాణికులను బస్సు దిగాలని బెదిరించాడు. బస్సు అద్దాలను సుత్తితో ధ్వంసం చేసి నానా బీభత్సం సృష్టించాడు. 

కత్తి దాడిలో కండక్టర్‌ యోగేష్‌(45)కు గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.  కత్తిదాడికి పాల్పడ్డ యువకుడిని జార్ఖండ్‌కు చెందిన హరీశ్‌సిన్హా(28)గా గుర్తించారు. ఇతడు కాల్‌సెంటర్‌లో పనిచేస్తూ గత నెలలో ఉద్యోగం కోల్పోయాడు. మంగళవారం(అక్టోబర్‌1) జరిగిన ఈ ఘటనకు సంబంధించి హరీశ్‌సిన్హాపై వైట్‌ఫీల్డ్‌ ఏరియా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. 

 ఇదీ చదవండి: పుణెలో కుప్పకూలిన హెలికాప్టర్‌..ముగ్గురు మృతి 

Advertisement
 
Advertisement
Advertisement