Ayodhya Ram Mandir: అయోధ్యలో దీపోత్సవం | Ayodhya Ram Mandir Inauguration Highlights, Live Updates In Telugu - Sakshi
Sakshi News home page

Ayodhya Ram Mandir: అయోధ్యలో దీపోత్సవం

Published Mon, Jan 22 2024 6:59 AM

Ayodhya Ram Mandir Inauguration Highlights Live Updates Telugu - Sakshi

Ram mandir pran pratishtha Live Updates

సాయంత్రం 5.30:.. సోమవారం, జనవరి 22

 • అయోధ్యలో దీపోత్సవం
 • సరయూ నది ఒ‍డ్డున 14 లక్షల దీపాలు వెలిగించిన భక్తులు
 • దీప కాంతులతో వెలిగిపోతున్న సరయూ తీరం
 • దేశ వ్యాప్తంగా ఇంటింటా రామజ్యోతి
 • రామ్‌ కీ పైడీ, కనక్‌ భవన్‌, గుప్తర్‌ ఘాట్‌, సరయూ ఘాట్‌, లతా మంగేష్కర్‌ చౌక్‌, మనిరామ్‌ దాస్‌ చావ్‌నీ దీపాలతో అలంకరణ

 సాయంత్రం 4గం.. సోమవారం, జనవరి 22

 • బాల రాముడి విగ్రహ ప్రతిష్టతో చారిత్రక ఘట్టం పూర్తి
 • రేపటి నుంచి సామాన్య భక్తులకు భగవాన్ రామ్ లల్లా దర్శనం 
 • వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ ద్వారా రామ దర్శనం 
 • మొదటి స్లాట్ ఉదయం 7 నుండి 11:30 వరకు
 • రెండో స్లాట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 
 • ఉదయం 6:30కు ఆలయంలో జాగ్రన్ , శృంగార్ హరతి 
 • హరతికి  ఒక రోజు ముందుగానే బుకింగ్.
 • రాత్రి 7 గంటలకు సాయంత్రం హారతి సమయం
 • ఒకరోజు ముందుగానే బుకింగ్ చేసుకోవాలి
 • రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్
 • ట్రస్ట్ వెబ్‌సైట్‌లో బుకింగ్

3గం:10ని.. సోమవారం, జనవరి 22

 • రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకున్నవారికి ప్రధాని మోదీ సన్మానం
 • పూలు జల్లి కృతజ్ఞతలు తెలిపిన మోదీ.

2గం:12ని.. సోమవారం, జనవరి 22

ఈరోజు మన రాముడు వచ్చేశాడు: ప్రధాని నరేంద్ర మోదీ

 • జై శ్రీరామచంద్రమూర్తి జై అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ
 • రామ భక్తులందరికీ నా ప్రణామాలు
 • ఈరోజు మన రాముడు వచ్చేశాడు
 • ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న మన రాముడు వచ్చేశాడు
 • ఈ క్షణం ఎంతో ప్రత్యేకమైనది
 • ఇది సామాన్యమైన సమయం కాదు
 • రాముడు భారతదేశ ఆత్మ
 • రాముడు భారతదేశానికి ఆధారం
 • ఎక్కడ రాముడు కార్యక్రమం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు
 • ఎంతో చెప్పాలని ఉన్నా.. నా గొంతు గద్గదంగా ఉంది
 • నా శరీరం ఇంకా స్పందించే స్థితిలో లేదు
 • ఎంతో అలౌకిక ఆనందంలో ఉన్నాను
 • అన్ని భాషల్లోనూ రామాయణాన్ని విన్నాను
 • గర్భగుడిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట నా చేతులు మీదుగా జరగడం నా అదృష్టం
 •  జనవరి 22వ తేదీ చరిత్రలో నిలిచిపోతుంది
 • మన రాముడు టెంట్‌లో ఉండే పరిస్థితులు ఇక లేవు
 • మన రాముడు ఇకపై దివ్యమైన మందిరంలో ఉంటారు
 • రాముడి దయవల్ల మనమందరం ఈ క్షణానికి సాక్షులమయ్యాం
 • ఈ నేల, గాలి ప్రతీది దివ్యత్వంతో నిండిపోయింది
 • ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడుతున్న సరికొత్త అధ్యాయం
 • ఇంత ఆలస్యం జరిగినందుకు మమ్మల్ని క్షమించమని శ్రీరాముడిని వేడుకుంటున్నా
 • త్రేతాయుగంలో శ్రీరాముడు కేవలం 14 ఏళ్ల వనవాసానికి వెళ్లాడు
 • కలియుగంలో రాముడు వందలయేళ్లపాటు వనవాసం చేశాడు
 • భారత న్యాయవ్యవస్థకు ఈరోజు నేను నమస్కరిస్తున్నా
 • న్యాయబద్ధంగానే శ్రీరాముడి మందిర నిర్మాణం జరిగింది
 • ఈరోజు దేశ వ్యాప్తంగా దేవాలయాల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి
 • దేశ ప్రజలందరూ ఇవాళ దీపావళి జరుపుకుంటున్నారు
 • ఇంటింటా రాముడి దీపజ్యోతి వెలిగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు
 • ఈ రోజు మనకు శ్రీరాముడి మందిరం దొరికింది
 • బానిస సంకెళ్లను తెంచుకున్న కొత్త రాజ్యం ఆవిర్భించింది
 • ఈ అనుభూతిని ప్రతి రామ భక్తుడు అనుభవిస్తున్నాడు
 • రాముడు వివాదం కాదు.. ఒక సమాధానం
 • రాముడు  వర్తమానమే కాదు.. అనంతం
 • రాముడు అందరివాడు
 • రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారిని అయోధ్యకు ఆహ్వానిస్తున్నా
 • ఇవాళ్టి ఈ చరిత్ర వేలయేళ్లపాటు నిలిచిపోతుంది
 • రాబోయే వెయ్యేళ్ల కోసం నేడు పునాదిరాయి వేస్తున్నాం
 • సేవా, చింతన భక్తిని.. హనుమంతుడి నుంచి ప్రేరణ పొందాలి
 • రాముడు తప్పక వస్తాడన్న శబరి ఎదురుచూపులు ఫలించాయి
 • దేవుడి నుంచి దేశం.. రాముడి నుంచి రాజ్యం ఇది మన నినాదం
 • నేను సామాన్యుడిని, బలహీనుడినని భావిస్తే.. ఉడత నుంచి ప్రేరణ పొందండి

2గం:10ని.. సోమవారం, జనవరి 22
మోదీ గొప్ప తపస్వి: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌

 • ఈ ఆనందం మాటల్లో చెప్పలేనిది.
 • అయోధ్యలో బాలరాముడితోపాటు భారత కీర్తి తిరిగొచ్చింది.
 • మోదీ గొప్ప తపస్వి
 • ప్రధాని మోదీ కఠిన నియమాలు పాటించారు.
 • ఈ కార్యక్రమాన్ని వర్ణించేందుకు మాటలు చాలడం లేదు
 • కష్టకాలలంలో ప్రపంచశాంతికి ఇది దిక్సూచిలాంటింది
 • ఎందరో త్యాగాల ఫలితం ఇవాళ్టి సువర్ణ ఆధ్యాయం

1గం:58ని.. సోమవారం, జనవరి 22
యోగి భావోద్వేగ ప్రసంగం

 • 50ం ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది
 • ఎన్నో తరాలు ఈ క్షణం కోసం నిరీక్షించాయి
 • ఈ అద్భుత ఘట్టాన్ని వర్ణించేందుకు నాకు మాటలు రావడం లేదు
 • దేశంలోని ప్రతీ పట్టణం, గ్రామం అయోధ్యగా మారింది
 • ప్రతీ ఒక్కరూ ఆనంద భాష్పాలతో అయోధ్య వైపు చూశారు
 • కలియుగం నుంచి త్రేతాయుగంలోకి వచ్చామ్మా? అనే భావన నెలకొంది
 • ప్రతీ రామ భక్తుడు సంతృప్తి.. గర్వంతో ఉన్నాడు
 • తన ఆలయం కోసం సాక్షాత్తూ శ్రీరాముడే పోరాడాల్సి వచ్చింది
 • ఆ మహాసంకల్పం మోదీ చేతుల మీదుగా పూర్తయ్యాయింది
 • బాలరాముడి రూపాన్ని చెక్కిన శిల్పి జీవితం ధన్యమైంది
   

1గం:55ని.. సోమవారం, జనవరి 22
మోదీ కఠోర దీక్ష విరమణ

 • అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కోసం నరేంద్ర మోదీ కఠోర ఉపవాసం​
 • ప్రధాని మోదీ 11 రోజుల కఠోర దీక్ష
 • దీక్ష విరమింపజేసిన గోవింద్‌ దేవ్‌ గిరి మహారాజ్‌
 • మోదీకి వెండి ఆలయ నమునా ఇచ్చిన.. బంగారు ఉంగం ఇచ్చిన ట్రస్ట్‌
 • 11 రోజులపాటు మోదీ కఠోర దీక్ష చేశారు:  గోవింద్‌ దేవ్‌ గిరి మహారాజ్‌
 • దేశవ్యాప్తంగా ఆయన అన్ని ఆలయాలు తిరిగారు:  గోవింద్‌ దేవ్‌ గిరి మహారాజ్‌
 • కొబ్బరి నీళ్లు తాగి నేల మీద పడుకున్నారు:  గోవింద్‌ దేవ్‌ గిరి మహారాజ్‌
 • ఇలాంటి సంకల్ప బలం ఉన్న వ్యక్తి దేశ నాయకుడు కావడం గర్వకారణం:  గోవింద్‌ దేవ్‌ గిరి మహారాజ్‌

1గం:33ని.. సోమవారం, జనవరి 22
అయోధ్య రాముడి దర్శన వేళలు ఇవే

 • అయోధ్యలో శాస్త్రోక్తంగా జరిగిన ప్రాణ ప్రతిష్ట మహోత్సవం
 • రేపటి నుంచి సామాన్యుల సందర్శనకు అనుమతి
 • రెండు స్లాట్ల కేటాయింపు 
 • ఉదయం 7 నుంచి 11గం.30ని వరకు.. మధ్యాహ్నాం 2గం. నుంచి 7 గం. వరకు అనుమతి


1గం:28ని.. సోమవారం, జనవరి 22
ఎటు చూసినా భావోద్వేగమే!

 • అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో దేశమంతటా భావోద్వేగ సన్నివేశాలుఔ
 • దేశమంతటా రామ నామ స్మరణం
 • కాషాయ వర్ణంతో మురిసిపోతున్న హిందూ శ్రేణులు
 • ఆలింగనంతో కంటతడిపెట్టిన బీజేపీ నేత ఉమాభారతి, సాధ్వీ రీతాంభరలు 
 • రామ మందిర ఉద్యమంలో కీలకంగా వ్యహరించిన ఈ ఇద్దరూ

1గం:16ని.. సోమవారం, జనవరి 22
రామ్‌ లల్లాకు తొలి హారతి

 • అయోధ్య రామ మందిరంలో కొలువు దీరిన శ్రీరామ చంద్రుడు
 • రమణీయంగా సాగిన ప్రాణప్రతిష్ట క్రతువు
 • కర్తగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ
 • బాలరాముడి అవతారంలో కొలువు దీరిన వైనం
 • పసిడి కిరీటం, పట్టు వస్త్రం సమర్పణ
 • దేశమంతటా రామ భక్తుల సందడి
 • రామ్‌ లల్లాకు తొలి హారతి ఇచ్చిన ప్రధాని మోదీ
 • రామయ్యకు మోదీ సాష్టాంగ నమస్కారం

12గం:54ని.. సోమవారం, జనవరి 22
అయోధ్యలో అపూర్వ ఘట్టం.. తొలి దర్శనం

 • అయోధ్య రామ మందిరంలో జరిగిన ప్రాణ ప్రతిష్ట మహోత్సవం
 • రామ్‌ లల్లా తొలి దర్శనం
 • రామనామస్మరణతో ఉప్పొంగిపోతున్న హిందూ హృదయాలు
 • గణేశ్వర్‌ శాస్త్రి ద్రవిడ్‌ నేతృత్వంలో మహాగంభీరంగా జరిగిన ప్రాణప్రతిష్ట క్రతువు
 • పద్మపీఠంపై ధనుర్ధారియై బాలరాముడి తొలి దర్శనం
 • మెడలో రత్నాల కాసుల మాల
 • స్వర్ణాభరణాలతో బాలరాముడు
 • తలపై వజ్రవైడ్యూరాల్యతో పొదిగిన కిరీటం
 • పాదాల వద్ద స్వర్ణ కమలాలు
 • సకలాభరణాలతో బాలరాముడి నుదుట వజ్రనామం
 • 84 సెకన్ల దివ్య ముహూర్తంలో సాగిన ప్రాణ ప్రతిష్ట క్రతువు
 • ఆ సమయంలో అయోధ్య ఆలయంపై హెలికాఫ్టర్‌లతో పూల వర్షం


12గం:30ని.. సోమవారం, జనవరి 22
అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతం

 • అయోధ్యలో నూతన రామ మందిరంలో కొలువుదీరనున్న బాలరాముడు
 • రామ్‌ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కర్తగా ప్రధాని నరేంద్ర మోదీ
 • జై శ్రీరామ్‌ నామస్మరణతో మారుమోగుతున్న దేశం
 • మరికొద్ది నిమిషాల్లో బాలరాముడికి ప్రాణప్రతిష్ట
12గం:26ని.. సోమవారం, జనవరి 22
గర్భాలయంలోకి ప్రధాని మోదీ

 • ప్రత్యేక పూజల అనంతరం గర్భగుడిలోకి మోదీ
 • గర్భాలయంలో ప్రాణప్రతిష్ట పూజల్లో ప్రధాని మోదీ
 • మోదీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌, గవర్నర్‌ ఆనందీ బెన్‌, ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కూడా
 • వేదమంత్రాల నడుమ కొనసాగుతున్న బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట క్రతువు


12గం:20ని.. సోమవారం, జనవరి 22
ప్రారంభమైన ప్రాణప్రతిష్ట మహోత్సవం


 

 • అయోధ్య రామ మందిరంలోకి ప్రధాని నరేంద్ర మోదీ
 • ప్రత్యేక పూజలు
 • బాలరాముడి కోసం పట్టు పీతాంబరాలు, ఛత్రం, పాదుకలు తీసుకొచ్చిన మోదీ
 • వెంట ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌

 

 

12గం:00ని.. సోమవారం, జనవరి 22
అయోధ్యలో అపురూప క్షణాలు

 • అయోధ్యలో రామయ్య కొలువుదీరే అపురూప క్షణాలు ఆసన్నం
 • మరికాసేపట్లో రామ మందిరంలో రామయ్య విగ్రహాన్ని ప్రతిష్టించనున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ
 • మధ్యాహ్నం 12.20 నుంచి ఒంటి గంట మధ్య అభిజిత్‌ లగ్నంలో ఈ వేడుక 
 • ప్రాణప్రతిష్ఠను 84 సెకన్ల దివ్య ముహూర్తంలో నిర్వహణ
 • మధ్యాహ్నం 12.29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు దివ్యముహూర్తం
 • ముందుగా రామ్‌లల్లా విగ్రహ కళ్లకు ఆచ్ఛాదనగా ఉన్న వస్త్రాన్ని తొలగింపు 
 • బంగారంతో చేసిన చిన్న కడ్డీతో శ్రీరాముడికి కాటుక దిద్దడం 
 • ఆపై రామ్‌లల్లాకు చిన్న అద్దాన్ని చూపిస్తారు
 • ఆ తర్వాత 108 దీపాలతో ‘మహా హారతి’ ఇవ్వడంతో ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగుస్తుంది

11గం:43ని.. సోమవారం, జనవరి 22
ఆలయంపై పుష్పవర్షం..

 • ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఆలయంపై హెలికాప్టర్లతో పుష్పవర్షం
 • 25 రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు రెండు గంటల పాటు మంగళ వాయిద్యాలు మోగిస్తారు 
 • వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు.. కర్తలుగా వ్యవహరిస్తాయి 
 • ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు 7 వేల మంది పాల్గొననున్నారు

11గం:29ని.. సోమవారం, జనవరి 22
సాయంత్రం దాకా మోదీ ఇక్కడే

 • ఉదయం 11 గంటల ప్రాంతంలో రామజన్మభూమికి చేరుకున్న ప్రధాని మోదీ
 • ప్రాణప్రతిష్ఠ క్రతువు పూర్తయిన తర్వాత భక్తులనుద్దేశించి ప్రసంగం
 • ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో అయోధ్యలోని కుబర్‌ తిలాలో ఉన్న శివ మందిర్‌ను సందర్శన 
 • సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఢిల్లీకి పయనం

అయోధ్య ప్రాణప్రతిష్ట.. అంతటా ఇలా.. 
 

11గం:22ని.. సోమవారం, జనవరి 22
కాసేపట్లో ప్రాణప్రతిష్ట

 • అయోధ్యలో ప్రధాని మోదీ
 • దేశమంతటా రామనామస్మరణ
 • సర్వోన్నతంగా నిర్మించిన రామ మందిరం
 • ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం జాబితాలో చోటు
 •  ఐదేళ్ల బాలరాముడి అవతారంలో రామ్‌ లల్లా
 • కాసేపట్లో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం
 • ఇప్పటికే రామజన్మ భూమికి భారీగా భక్తజనం
   

11గం:00ని.. సోమవారం, జనవరి 22
మరో దీపావళిలా.. 

 • దేశ వ్యాప్తంగానే కాదు.. విదేశాలలో అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట వేడుకలు
 • అన్ని ఆలయాల్లో.. ప్రత్యేకించి రామాలయం, హనుమాన్‌ గుడిలలో ప్రత్యేక పూజలు
 • జై శ్రీరామ్‌ నినాదాలతో.. భక్తి శ్రద్ధలతో వివిధ కార్యక్రమాల నిర్వహణ
 • ఆలయాల్లోనే కాదు.. ప్రతీ ఇంటా దీపం
 • రావణుడిపై జయం తర్వాత శ్రీరాముడు రాక సందర్భంగా దీపావళి
 • ఇప్పుడు అయోధ్య మందిర నేపథ్యంలో దీపాలంకరణలతో.. మరో దీపావళిలా దివ్యోత్సవం


10గం:45ని.. సోమవారం, జనవరి 22
భారీగా ప్రముఖులు.. భద్రత

 • కాసేపట్లో అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట
 • పాల్గొననున్న ప్రధాని మోదీ
 • అయోధ్యకు చేరుకున్న అన్ని రంగాల ప్రముఖులు 
 • అన్ని రాష్ట్రాల నుంచి సినీ రంగాల ప్రముఖులు
 • పలువురు రాజకీయ ప్రముఖులు
 • 12 గంటల నుంచి ప్రాణ ప్రతిష్ట క్రతువు ప్రారంభం


10గం:40ని.. సోమవారం, జనవరి 22
తెలంగాణ అంతటా.. ఆధ్యాత్మిక శోభ

 • అయోధ్య రామ మందిర బాలరాముడి ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో తెలంగాణలో కోలాహలం
 • పలు ఆలయాలు సుందరంగా ముస్తాబు
 • అర్ధరాత్రి నుంచి మైక్‌ సెట్లతో హడావిడి
 • రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో శ్రీరామచంద్రుడి పల్లకి ఊరేగింపు లొ పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్


10గం:35ని.. సోమవారం, జనవరి 22
అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ

 • బాలరాముడి ప్రాణప్రతిష్టలో పాల్గొననున్న ప్రధాని మోదీ
 • కాసేపట్లో అయోధ్య రామజన్మభూమికి మోదీ
 • మ.1.15ని. విశిష్ట సభలో ప్రధాని మోదీ ప్రసంగం


ఇదీ చదవండి: అయోధ్యకు వ్యాపారవేత్తల క్యూ..

 • జై శ్రీరామ్‌ నినాదాలతో..  దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం
 • దేశం నలుమూలల నుంచి అయోధ్యకు చేరుకుంటున్న రామ భక్తులు
 • వేలాది మంది సాధువులు
 • దేశం నుంచి అయోధ్యకు వెయ్యి రైళ్లు 
 • ఇప్పటికే అయోధ్యలో హోటళ్లు ఫుల్లు
 • పవిత్రోత్సవం తర్వాత దేదీప్యమానంగా అయోధ్య
 • సాయంత్రం 10 లక్షల దీపాలతో శ్రీరామ జ్యోతి


10గం:10ని.. సోమవారం, జనవరి 22
భక్తితో పురిటి నొప్పులు ఓర్చుకుంటూ..?!

 • దేశమంతా రామమయం
 • అయోధ్యలో నేడు రాముడి విగ్రహ ప్రతిష్ట
 • ఆ శుభముహూర్తం కోసం గర్బిణీల ఎదురు చూపులు
 • పుత్రుడు జన్మిస్తే రాముడు.. ఆడపిల్ల జన్మిస్తే సీత పేరు పెడతారట 
 • మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో పదుల సంఖ్యలో ఆ శుభ గడియ కోసం గర్భిణీలు
 • ఇక్కడే కాదు.. దేశమంతా శుభముహూర్తం కోసం ఎదురు చూపులు 
 • పురిటి నొప్పులు వస్తున్నా.. ఓపిక పడుతున్న గర్బిణీలు

10గం:10ని.. సోమవారం, జనవరి 22
అయోధ్యలో టైట్‌ సెక్యూరిటీ

 • ఏడెంచెల భద్రతా వలయం నడుమ అయోధ్య రామ మందిరం
 • వేల మంది యూపీ పోలీసులు
 • వందల సంఖ్యలో కేంద్ర బలగాల సిబ్బంది
 • ప్రధాని రాక నేపథ్యంలో ప్రత్యేక సిబ్బంది మోహరింపు
 • ప్రతీ ఒక్కరిపై కన్నేసేలా ఏఐ టెక్నాలజీ
 • 10వేలకు పైగా సీసీ కెమెరాలు.. డ్రోన్‌ల నిఘా

10గం:02ని.. సోమవారం, జనవరి 22
బాలరాముడ్ని అద్దంలో చూపిస్తూ.. 

 • కాసేపట్లో అయోధ్యకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ
 • నిన్నంతా రామేశ్వరంలో మోదీ ప్రత్యేక పూజలు
 • అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో కఠిన ఉపవాస.. కఠోర నియమాలు పాటిస్తున్న మోదీ
 • గత 74 ఏళ్లుగా అయోధ్యలో తాత్కాలిక విగ్రహానికి పూజలు
 • ఉత్తరాది నాగర స్టయిలో కొత్త రామ మందిర ఆలయ నిర్మాణం 
 • 392 పిల్లర్లు.. ఆలయానికి 44 తలుపులు
 • నేడు ప్రాణప్రతిష్ట జరుపుకోనున్న బాలరాముడి విగ్రహం
 • ముందుగా దశ దర్శనాలు 
 • తొలుత అద్దంలో బాలరాముడ్ని.. బాలరాముడికే చూపించనున్న ప్రధాని మోదీ
 • 84 సెకన్లపాటు సాగనున్న ప్రాణప్రతిష్ట క్రతువు 

థాయ్‌లాండ్‌లో ఇలా.. 


09గం:49ని.. సోమవారం, జనవరి 22
ఏపీలో ఇలా.. 

 • అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట వేళ.. ఏపీలో ఆధ్యాత్మిక శోభతో ఉట్టి పడుతున్న రామ మందిరాలు, ఆలయాలు
 • ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ
 • నేడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు అన్న సమారాధనలు
 • జిల్లా వ్యాప్తంగా శోభాయాత్రలు చేస్తున్న రామభక్తులు..
 • తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 30 ప్రాంతాల్లో యల్‌.ఇ.డి స్క్రీన్ లు ఏర్పాటు
 • ఏలూరు ధర్మభేరి ప్రాంగణంలో శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం
 • శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని పురవీధుల్లో శ్రీరాముని చిత్రపటం ఊరేగింపు
 • శ్రీరామ నామస్మరణం చేస్తూ పాల్గొన్న భక్తాదులు

09గం:45ని.. సోమవారం, జనవరి 22
అయోధ్య చేరుకున్న  చిరంజీవి, రామ్ చరణ్

 • రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు
 • అయోధ్య చేరుకున్న చిరంజీవి దంపతులు.. తనయుడు రామ్‌ చరణ్‌
 • ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను: చిరంజీవి
 • నా ఆరాధ్య దైవం హనుమంతుడు నన్ను వ్యక్తిగతంగా ఆహ్వానించాడుఅని భావిస్తున్నా: చిరంజీవి
 • అయోధ్యలో రామ మందిరం కోట్లమంది చిరకాల స్వప్నం..  ఎంతో ఉద్వేగభరితంగా ఉంది: రామ్‌చరణ్‌ 
   


08గం:47ని.. సోమవారం, జనవరి 22
అద్వానీ రావట్లేదు

 • బీజేపీ కురువృద్ధుడు లాల్‌ కృష్ణ అద్వానీ అయోధ్య వేడుకకు గైర్హాజరు
 • 96 ఏళ్ల వయసురిత్యా తొలుత దూరంగా ఉండాలని నిర్ణయం
 • ఆ వెంటనే మనుసు మార్చుకుని హాజరవుతానని ప్రకటించిన అద్వానీ
 • తీవ్ర చలి ప్రభావంతోనే హాజరు కావట్లేదని తాజా ప్రకటన
 • అద్వానీకి ఆహ్వానం అందకపోవడంపైనా రాజకీయ విమర్శలు
 • ఆహ్వానం స్వయంగా అందించినట్లు వెల్లడించిన ట్రస్ట్‌ సభ్యులు08గం:47ని.. సోమవారం, జనవరి 22
అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ..  అమృత్‌సర్‌లో శోభాయాత్ర
08గం:35ని.. సోమవారం, జనవరి 22

ప్రముఖ నటుడి ప్రత్యేక పూజలు

 • సీనియర్‌ నటుడు, బీజేపీ నేత అనుపమ్‌ ఖేర్‌ ప్రత్యేక పూజలు
 • హనుమంతుడికి పూజలు చేసిన అనుపమ్‌ ఖేర్‌
 • మరో దీపావళి పండుగలా ఉందంటూ వ్యాఖ్య

08గం:31ని.. సోమవారం, జనవరి 22
అయోధ్యలో ఇవాళ.. 

 • కాసేపట్లో.. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన 16 ఆచారాలు ప్రారంభం
 • దేవకినందన్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీరామ కథా పారాయణం
 • అయోధ్యలో వంద చోట్ల ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంస్కృతిక ఊరేగింపు
 • యూపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1500 మంది జానపద నృత్య కళాకారుల ‍ప్రదర్శన
 • రామకథా పార్కులో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు రాంలీలా ప్రదర్శన
 • సాయంత్రం 6.30 నుండి 7 గంటల వరకు శ్రీరామునికి సరయూ హారతి.
 • రాత్రి 7 నుంచి 7.30 వరకు రామ్ కి పైడిపై ప్రొజెక్షన్ షో.
 • రామకథా పార్కులో రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాటేకర్ సిస్టర్స్ సారధ్యంలో రామకథా గానం.
 • తులసీ ఉద్యానవనంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శర్మ బంధుచే భజన కార్యక్రమం
 • రాత్రి 7.45 నుండి 7.55 వరకు రామ్ కీ పైడి వద్ద బాణసంచా కాల్చి సందడి
 • కన్హయ్య మిట్టల్ సారధ్యంలో రామకథా పార్క్ వద్ద రాత్రి 8 నుండి 9 గంటల వరకు భక్తి సాంస్కృతిక కార్యక్రమం
 • రాత్రి 8 నుంచి 9 గంటల వరకు తులసి ఉద్యానవనంలో రఘువీర పద్మశ్రీ మాలినీ అవస్థి సారధ్యంలో ప్రత్యేక కార్యక్రమం 


08గం:18ని.. సోమవారం, జనవరి 22
ఎటు చూసినా డ్రోన్‌లే

 • మరోవైపు అయోధ్యలో ఏడంచెల భద్రతా వలయం 
 • ప్రధాని సహా వీవీఐపీలు, వీఐపీల రాక నేపథ్యంలో.. ఎస్పీజీ, ఎన్‌ఎస్‌జీ కమాండోల మోహరింపు 
 • వేల మంది యూపీ పోలీసుల మోహరింపు
 • కేంద్ర బలగాల పహారా నడుమ అయోధ్యాపురి
 • డ్రోన్‌ నిఘా నీడలో అయోధ్య 


08గం:00ని.. సోమవారం, జనవరి 22
ప్రాణప్రతిష్ట క్రతువు కొన్ని సెకన్లే..  

 • మేషలగ్నం అభిజిత్‌ ముహూర్తంలో అయోధ్య రాముడికి ప్రాణప్రతిష్ట
 • మధ్యాహ్నాం 12గం.29ని.. నుంచి 12గం.30ని.. మధ్య ప్రాణప్రతిష్ట ముహూర్తం
 • నూతన రామాలయంలో 84 సెకన్ల కాలంలో గర్భగుడిలో బాలరాముడి ప్రాణప్రతిష్ట
 • రామ్‌లల్లా విగ్రహానికి జరగనున్న ప్రాణ ప్రతిష్ట
 • నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట చేయించనున్న వారణాసి అర్చకులు
 • అయోధ్యలో విశిష్ట సభలో 1గం. నుంచి 2గం. మధ్య ప్రధాని మోదీ సహా ప్రముఖుల ప్రసంగాలు 
 • హాజరు కానున్న అన్ని రాష్ట్రాల రామ భక్తులు
 • 7 వేలమందికి ఆహ్వానం.. భారీగా ప్రముఖుల రాక 
 • కట్టుదిట్టమైన భద్రతా వలయంలో అయోధ్య

   
 • అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఓర్చాలో 5100 మట్టి దీపాలను వెలిగించారు

07గం:55ని.. సోమవారం, జనవరి 22
‘రామ’కు వెలుగులు

 • దేశవ్యాప్తంగా రామ నామంతో ఉన్న రైల్వే స్టేషన్లకు ప్రత్యేక ముస్తాబు 
 • రామన్నపేట్‌ (తెలంగాణ). రామచంద్రపురం (ఆంధ్రప్రదేశ్‌). రామగిరి (కర్ణాటక). ఇవన్నీ రాముని పేరుతో ఉన్న రైల్వేస్టేషన్లు.
 • దేశవ్యాప్తంగా ఇలా మొత్తం 343 రైల్వేస్టేషన్లకు హంగులు 
 • ప్రాణప్రతిష్ఠ సందర్భంగా విద్యుత్‌ వెలుగుల్లో మెరిసిపోతున్న స్టేషన్లు 
 • రైల్వే శాఖ నిర్ణయంపై సర్వత్రా హర్షం 
 • రాముని పేరిట ఉన్న రైల్వేస్టేషన్లలో అత్యధికంగా 55 ఏపీలో ఉండటం విశేషం!

07గం:48ని.. సోమవారం, జనవరి 22
500 ఏళ్ల హిందువుల కల నెరవేరుతున్న వేళ.. 

 • మరికొద్ది గంటల్లో అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట 
 •  మ.12 నుంచి ప్రాణ ప్రతిష్ట క్రతువుల్లో  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
 • ప్రాణ ప్రతిష్ట అనంతరం కుబేర్ తిలక్‌లో భగవాన్ శివుని పురాతన మందిరాన్ని సందర్శించనున్న మోదీ
 • ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొననున్న దేశంలోని అన్ని ప్రధాన ఆధ్యాత్మిక, ధార్మిక శాఖల ప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు
 • ప్రాణ ప్రతిష్ట అనంతరం  విశిష్ట సభను ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ
 • శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణంలో పాల్గొన్న కార్మికులతోనూ ప్రధాని మోదీ ముచ్చట్లు  


విదేశాల్లోనూ శ్రీరామం

 • అయోధ్య ప్రాణప్రతిష్ట వేళ..  ప్రపంచవ్యాప్తంగా ఘనంగా వేడుకలు
 • పలు దేశాల ఆలయాల్లో ప్రత్యేక పూజలు
 • 50కి పైగా దేశాల్లో అయోధ్య రామ మందిర బాలరాముడి ప్రాణప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాట్లు
 • అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పలు చోట్ల కార్ల ర్యాలీలు
 • టైమ్స్‌ స్క్వేర్‌ సహా పలు చోట్ల లైవ్‌ టెలికాస్టింగ్‌కు ఏర్పాట్లు 
 • ఫ్రాన్స్‌లో రథయాత్ర.. ఈఫిల్‌ టవర్‌ వద్ద ప్రత్యక్ష ప్రసారం


07గం:35ని.. సోమవారం, జనవరి 22
ఈ ఉదయం రామజన్మభూమి ఇలా.. 


07గం:28ని.. సోమవారం, జనవరి 22
అయోధ్యకు బిగ్‌బీ

 • అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం అయోధ్యకు అమితాబ్‌ బచ్చన్‌
 • రామమందిర వేడుక కోసం భారీగా తరలిన వీవీఐపీలు 

07గం:15ని.. సోమవారం, జనవరి 22
50 వాయిద్యాలతో మంగళ ధ్వని

 • ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మంగళ ధ్వని మధ్య నిర్వహించేందుకు సిద్ధమైన రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు 
 • సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళ ధ్వని కార్యక్రమంలో
 • దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన 50 సంగీత వాయిద్యాలకు ఒకే వేదికపై చోటు  
 • ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఘటం, 
 • కర్ణాటక నుంచి వీణ, 
 • తమిళనాడు నుంచి నాదస్వరం, మృదంగం 
 • మొత్తం 2 గంటల పాటు మంగళ ధ్వని కార్యక్రమం


06గం:55ని.. సోమవారం, జనవరి 22
వైద్య సేవలతో సహా.. 

 • రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం సర్వాంగ సుందరంగా అయోధ్య
 • అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసిన ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం
 • బహుళ అంచెల భద్రత కోసం వేల మంది పోలీసుల మోహరింపు 
 • ప్రతి వీధిలో బారికేడ్ల ఏర్పాటు
 • రసాయన, బయో, రేడియోధార్మిక, అణు దాడులను ఎదుర్కొనేలా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల మోహరించింది
 • భూకంప సహాయక బృందాల నియామకం 
 • ఎటువంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలు 
 • చలికాలం కావడంతో భక్తులకు, ఆహ్వానితులకు ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే చికిత్స అందించేలా బెడ్ల ఏర్పాటు 
 • ఎయిమ్స్‌ నుంచీ ప్రత్యేక వైద్య బృందాలు అయోధ్యలో

ప్రధాని అయోధ్య షెడ్యూల్:

 • 10గం:25ని అయోధ్య విమానాశ్రయానికి చేరిక
 • 10గం:45ని అయోధ్య హెలిప్యాడ్‌కు చేరుకోవడం
 • 10గం:55ని. శ్రీరామ జన్మభూమికి రాక..
 • ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు: రిజర్వ్ 
 • మధ్యాహ్నం 12:05 నుండి 12:55 వరకు: ప్రతిష్ఠాపన కార్యక్రమం..
 • మధ్యాహ్నం 12:55: పూజా స్థలం నుండి బయటకు
 • మధ్యాహ్నం 1:00: బహిరంగ వేదిక వద్దకు చేరిక
 • మధ్యాహ్నం 1:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు.. అయోధ్యలో  పబ్లిక్ ఫంక్షన్‌కు హాజరు
 • విశిష్ట సభను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ.. పలువురు
 • మధ్యాహ్నం 2:10: కుబేర్ తిల దర్శనం

06గం:49ని.. సోమవారం, జనవరి 22
దేదీప్యమానంగా అయోధ్య

 • రాముడి ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో.. సర్వాంగ సుందరంగా అయోధ్య
 • రకరకాల పూలతో.. రంగు రంగుల విద్యుద్దీపాలతో రామమందిర అలంకరణ
 • శ్రీరాముడి చిత్రాలతో పై వంతెనల వీధి దీపాల ఏర్పాటు
 • విల్లంబుల కటౌట్ల ఏర్పాటు
 • సంప్రదాయ రామానంది తిలక్‌ డిజైన్లతో దీపాలు 
 • మంచి ఘడియలు వచ్చాయి (శుభ్‌ ఘడీ ఆయీ), అయోధ్య ధామం తయారైంది (తయ్యార్‌ హై అయోధ్య ధామ్‌), శ్రీరాముడు ఆసీనులవుతారు (విరాజేంగే శ్రీరామ్‌), రాముడు మళ్లీ తిరిగొస్తారు (రామ్‌ ఫిర్‌ లౌటేంగే), అయోధ్యలో రామరాజ్యం వచ్చింది (అయోధ్యమే రామ్‌ రాజ్య) అనే స్లోగన్లు, నినాదాల పోస్టర్లు 
 • రామాయణంలోని పలు ఘట్టాలను పోస్టర్లపై చిత్రీకరణ 
 • రామ్‌ మార్గ్‌, సరయూ నది తీరం, లతా మంగేష్కర్‌ చౌక్‌లలో కటౌట్ల ఏర్పాటు
 • అయోధ్య నగరమంతా రామ్‌ లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు
 • సరయూ తీరంలో ప్రతి రోజూ హారతి ఇచ్చే ఏర్పాట్లు 

06గం:45ని.. సోమవారం, జనవరి 22
పలు చోట్ల సెలవు

 • అయోధ్య ఉత్సవం నేపథ్యంలో.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నేడు సెలవు 
 • ఒడిశాలోనూ సెలవు
 • కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒక పూట సెలవు 
 • బ్యాంకులు, ఇన్సూరెన్సు కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకూ ఒక పూట సెలవు
 • స్టాక్‌ మార్కెట్లు బంద్‌
 • పలు బీజేపీ యేతర రాష్ట్రాల్లోనూ స్కూళ్ల స్వచ్ఛంద సెలవు
   

06గం:42ని.. సోమవారం, జనవరి 22
నలుమూలల నుంచి భారీ కానుకలు

 • అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి కన్నౌజ్‌ నుంచి పరిమళాలు
 • అమరావతి నుంచి 5 క్వింటాళ్ల కుంకుమ,
 • ఢిల్లీ నుంచి నవ ధాన్యాలు,
 • భోపాల్‌ నుంచి పూలు
 • చింధ్వారా నుంచి 4.31 కోట్ల రామ నామాల ప్రతి అయోధ్యకు చేరిక 
 • సీతాదేవి కోసం ప్రత్యేకంగా గాజులు
 • 108 అడుగుల అగర్‌బత్తి,
 • 2,100 కిలోల గంట,
 • 1,100 కిలోల దీపం,
 • బంగారు పాదరక్షలు,
 • 10 అడుగుల ఎత్తైన తాళం,
 • ఒకేసారి 8 దేశాల సమయాలను సూచించే గడియారం రామ మందిరానికి బహుమతులు
 • నేపాల్‌లోని సీతాదేవి జన్మ స్థలి నుంచి 3,000 బహుమతులు

06గం:40ని.. సోమవారం, జనవరి 22
భారీగా వాహనాల పార్కింగ్‌ ఏర్పాట్లు

 • అయోధ్య ఈవెంట్‌ కోసం 22,825 వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యం
 • అయోధ్యలో ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా పోలీసుల ఏర్పాట్లు
 • 51 ప్రాంతాల్లో వాహనాలు నిలిపేందుకు ఏర్పాట్లు పూర్తి 
 • డ్రోన్‌లతో గస్తీ నిర్వహణ

06గం:34ని.. సోమవారం, జనవరి 22
ఏడు వేల మంది అతిథులు

 • మతాలకతీతకంగా అయోధ్య వేల మంది
 • గడ్డకట్టే చలిలోనూ దేశం నలుమూలల నుంచి పాదయాత్ర, సైకిళ్లపై, వాహనాలపై అయోధ్యకు చేరిక
 • రామ మందిర ప్రారంభోత్సవానికి 7,000 మంది అతిథులకు ఆహ్వానం 
 • ఆహ్వానితుల్లో 506 మంది అత్యంత ప్రముఖులు
 • రామ జన్మభూమి కోసం పోరాటం చేసిన వాళ్లకు ప్రత్యేక ఆహ్వానం 
 • సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులకూ ఆహ్వానం.. ఇప్పటికే చాలామంది అయోధ్యకు చేరిక 
 • ప్రతిపక్ష నేతలనూ ఆహ్వానించినా.. గైర్హాజరుకే మొగ్గు 
   

06గం:28ని.. సోమవారం, జనవరి 22
రామ మందిర విశేషాలు.. 

 • రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న విగ్రహం ఎత్తు 51 అంగుళాలు.
 • ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన అరుణ్‌ యోగిరాజ్‌
 • శుక్రవారం కళ్లకు వస్త్రంతో ఉన్న విగ్రహం బాహ్య ప్రపంచానికి దర్శనం
 • ఆలయంలోకి తూర్పు ద్వారం నుంచి ప్రవేశించి దక్షిణ ద్వారం గుండా బయటకు రావాల్సి ఉంటుంది 
 • మూడు అంతస్థుల్లో ఆలయ నిర్మాణం
 • ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి భక్తులు తూర్పువైపు నుంచి 32 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది.
 • ఆలయాన్ని సంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు ఉంటుంది. 161 అడుగుల ఎత్తు
 • ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తు..  మొత్తం 392 స్తంభాలు, 44 గేట్లు

06గం:22ని.. సోమవారం, జనవరి 22
ముహూర్తం ఎప్పుడంటే.. 

 • అభిజిల్లగ్నంలో బాలరాముడిని ప్రతిష్టించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
 • మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1 గంటకు ముగింపు 
 • ప్రాణ ప్రతిష్ఠకు వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా
 • పూజాది కార్యక్రమాలు 16వ తేదీన ప్రారంభం.. ఆదివారంతో ముగింపు 

06గం:15ని.. సోమవారం, జనవరి 22
అంతా రామమయం

 • రామ నామ స్మరణతో మారుమోగుతున్న భారత్‌
 • దేశ, విదేశాల్లోని ఆలయాల్లో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు
 • ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకను వీక్షణ
 • పవిత్రోత్సవం అనంతరం దేదీప్యోమానంగా అయోధ్య
 • వాషింగ్టన్‌ డీసీ, పారిస్‌ నుంచి సిడ్నీదాకా అనేక ఆలయాల్లో ఓ పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ.
 • దాదాపు 60 దేశాల్లో అయోధ్య ప్రాణప్రతిష్ట వేడుక కార్యక్రమాలు

06గం:12ని.. సోమవారం, జనవరి 22
అల అయోధ్యాపురములో.. 

 • అపురూప మందిరం నేడే ఆవిష్కృతం
 • ఉత్తర ప్రదేశ్‌ అయోధ్య నగరంలో కొలువుదీరనున్న రామయ్య
 • మధ్యాహ్నం 12.20 నుంచి 1 గంట మధ్య ముహూర్తం
 • సర్వాంగ సుందరంగా నగరం ముస్తాబు
 • ప్రాణ ప్రతిష్ఠ చేయనున్న ప్రధాని
 • ఇప్పటికే చేరుకున్న ప్రముఖులు
 • భారీ భద్రతా ఏర్పాట్లు
 • రామ నామ స్మరణతో మార్మోగుతున్న ఊరూవాడా


06:00.. సోమవారం, జనవరి 22
తెలుగు రాష్ట్రాల నుంచి.. 

 • అయోధ్య రాముడికి తెలుగు రాష్ట్రాల నుంచి కానుకలు
 • తిరుమల శ్రీవారి తరఫున లక్ష లడ్డూలు
 • సిరిసిల్ల నుంచి సీతమమ్మకు చీర కానుక
 • హైదరాబాద్‌ నుంచి 1265 కేజీల లడ్డూ
 • హైదరాబాద్‌ నుంచి అయోధ్య రామయ్యకు ఎనిమిదడుగుల ముత్యాల గజమాల.. అందించనున్న  చినజీయర్‌స్వామి 

Advertisement
 
Advertisement