breaking news
Ram mandir in Ayodhya
-
శతాబ్దాల నాటి గాయాలు మానాయి
అయోధ్య: ఐదు వందల సంవత్సరాల రామమందిర సాధనా సమరంలో భారతీయులకు తగిలిన గాయాలు నేడు ఆలయ నిర్మాణంతో మానిపోయాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మంగళవారం భవ్యరామ మందిర ప్రధాన శిఖరంపై ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించిన సందర్భంగా శ్రీరామ జన్మభూమి ఆలయ కాంప్లెక్స్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వేలాది మంది భక్తులనుద్దేశిస్తూ ప్రధాని ప్రసంగించారు. జైశ్రీరాం నినాదంతో తన ప్రసంగాన్ని ఆరంభించారు ‘‘ నేడు భారత్‌సహా యావత్ ప్రపంచం రామస్మరణ చేస్తోంది. ఆలయ నిర్మాణం సంపూర్ణమవడంతో భారతీయుల శతాబ్దాల నాటి గాయాలు నేటితో మానిపోయాయి. భక్తుల వందల ఏళ్ల బాధాగ్ని చల్లారింది. ఇప్పుడు ప్రతి ఒక్క రామభక్తుడి మదిలో అనిర్వచనీయ ఆనందం ఉప్పొంగుతోంది.ధ్వజారోహణం నిజంగా అపూర్వం, అనిర్వచనీయ ఆధ్యాత్మిక ఘటన. కాషాయ జెండాలో సూర్యవంశ కీర్తి దాగిఉంది. కోవిద వృక్షం రామరాజ్య వైభవాన్ని చాటుతోంది. ఇది కేవలం మతసంబంధ జెండా కాదు. భారతీయ నాగరికతా జెండా. ఇది భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమ జెండా అసత్యాలపై సత్యం విజయం శాశ్వతమని సగర్వంగా అంతెత్తున నిలిచి చాటిచెప్పే జెండా ఇది. ఆలయ నిర్మాణానికి అవిశ్రాంత కృషిచేసి తమ వంతు సాయమందించిన ప్రతి ఒక్క రామభక్తునికి నా మనస్ఫూరక కృతజ్ఞతలు. ఆనాడు శ్రీరాముడు అయోధ్యను యువరాజుగా వదిలివెళ్లాడు. తిరిగొచ్చేటప్పుడు మర్యాద పురుషోత్తమునిగా ఎదిగి వచ్చాడు.వశిష్టుడు వంటి రుషుల జ్ఞానసంపద, గురువుల మార్గనిర్దేశనం, నిశదరాజు వంటి స్నేహితుల సాంగత్యం, శబరి అవ్యాజమైన భక్తి, హనుమంతుని అచంచల భక్తి ఇలా అందరూ ఆ దశరథ తనయుడిని సర్వగుణసంపన్నుడిగా తీర్చిదిద్దారు. భారత్ అభివృద్ధి చెందిన భారత్‌గా ఎదగాలంటే సమాజంలోనూ ఇలాంటి సమష్టి కృషి అవసరం. ప్రస్తుత తరాలకే కాదు భావితరాల అవసరాలు తీర్చేలా భారత్ పునర్నిర్మాణం జరగాలి. ఈరోజు గురించి మాత్రమే ఆలోచిస్తే భవిష్యత్ తరాలకు అన్యాయం చేసినట్లే. 2047నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా ఎదిగే క్రమంలో రాముడు సైతం మనకు అండగా నిలబడ్డాడని అనిపిస్తోంది. రాముడు కేవలం ఒక వ్యక్తి కాదు. క్రమశిక్షణ, దార్శనికత, విలువలు మూర్తీభవించిన శక్తి’’ అని మోదీ అన్నారు.మార్పు తరుణం ఆసన్నమైంది...‘‘ఆధునిక నాగరిక సమాజంలో భారత్ ఇకపై తనదైన గుర్తింపును సాధించాల్సిన తరుణం ఆసన్నమైంది. బానస మనస్తత్వాన్ని భారత్ వదిలించుకోవాలి. 190 ఏళ్ల క్రితం మనలో మెకాలే ఒక బానిస మనస్తత్వ విషబీజాలను విజయవంతంగా నాటి విస్తృతపరిచాడు. భారతీయ సమాజ విలువల్ని కూకటివేళ్లతో పెకలించే కుట్ర అది. మనం బ్రిటిషర్ల నుంచి స్వాతంత్య్రమైతే సాధించాంగానీ బానిసత్వపు ఆలోచనల నుంచి స్వాతంత్య్రం సాధించలేకపోయాం. ఇకనైనా వచ్చే పదేళ్లలోపు ఈ మానసిక బానిసత్వపు బంధనాలను తెంచుకుందాం.విదేశాల తరహాలో ప్రజాస్వామ్యం కోసం భారత్ పోరాడిందన్న వలసపాలకుల వాదనల్లో నిజం లేదు. ప్రజాస్వామ్యం అనేది వేల సంవత్సరాల క్రితమే భారతీయ డీఎన్ఏలో నిక్షిప్తమై ఉంది. తమిళనాడులోని 1,000 సంవత్సరాల క్రితంనాటి ఉత్తర మేరూర్ గ్రామ శాసనంలో ప్రజాస్వామ్య ప్రస్తావన ఉంది. వలసపాలకులు మన జాతీయ గుర్తులను సైతం ప్రభావితంచేశారు. పరాయి పాలనకు చరమగీతం పాడుతూ ఇటీవలే నేవీ చిహ్నాన్ని సైతం రీడిజైన్ చేశాం. ఇది డిజైన్ మార్పు మాత్రమేకాదు ఆలోచనా మార్పు’’ అని మోదీ అన్నారు.అభివృద్ధి ధర్మాన్ని ప్రబోధిస్తోంది...‘‘త్రేతాయుగంలోనే అయోధ్య మానవాళికి నైతిక విలువల్ని ప్రసాదించింది. ఇప్పుడు 21వ శతాబ్దంలో అంతర్జాతీయ విమానాశ్రయం, అధునాతన రైల్వేస్టేషన్, అనుసంధానతతో అదే అయోధ్య మనకు అభివృద్ధి ధర్మాన్ని ప్రబోధిస్తోంది. నేడు అయోధ్య ప్రాచీనత, ఆధునికతల కలబోతగా కొత్త కళను సంతరించుకుంది. భవిష్యత్తులోనూ పురాతన, నూతనత్వాల సంగమ స్థిలిగా భాసిల్లుతుంది. ఇక్కడి సరయూ జలాల్లో అమృతంతోపాటు అభివృద్ది కలిసి ప్రవహిస్తాయి. ప్రాణప్రతిష్ట పనులు ఆరంభమైన నాటి నుంచి ఇప్పటిదాకా అయోధ్యను 45 కోట్లమంది దేశ, విదేశీ భక్తులు సందర్శించారు. ఇది ఆర్థిక రూపాంతరీకరణకు నిదర్శనం’’ అని మోదీ అన్నారు.వాళ్ల ఆత్మలకు శాంతి: భాగవత్అయోధ్య రామాలయం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వాళ్ల ఆత్మలు ఇప్పుడు శాంతిస్తాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. ‘‘అవిశ్రాంత పోరాటం, అలుపెరగని కృషి, లెక్కలేని త్యాగాలకు నేడు సార్థకత చేకూరింది. ఈ రోజు మనకెంతో ప్రత్యేకం. అశోక్ సింఘాల్, మహంత్ రామచంద్ర దాస్, దాల్మియా, వేలాది మంది రుషులు, లక్షలాది కుటుంబాలు, విద్యార్థులు, ఎంతో మంది భక్తుల త్యాగాలకు ఫలితం లభించింది. ఈ మధుర ఘట్టాన్ని చూడాలని పరితపించిన వాళ్ల కల నెరవేరింది. జెండాను మాత్రమే కాదు మరెన్నో ప్రాథమిక విలువలను మరింత ఎత్తులో నిలబెట్టాం. వ్యక్తులు, కుటుంబం మొదలు దేశం, ప్రపంచం దాకా ఈ విలువలే అందరికీ దిశానిర్దేశంచేస్తాయి. అందరి సంక్షేమాన్ని కాంక్షించడమే ధర్మం. కాషాయ రంగు ధర్మానికి గుర్తు. అందుకే ఇది ధర్మధ్వజం అయింది’’ అని అన్నారు.కొత్త అధ్యాయానికి ఆరంభం: యోగి‘‘ధర్మధ్వజారోహణతో ధర్మమనేది కాంతి ఇకపై నేల నలుచెరుగులా వ్యాపించనుంది. ఇది కొత్తఅధ్యాయానికి అంకురార్పణ’’ అని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి అన్నారు. -
UNGA: పాకిస్తాన్‌కు రుచిరా కంబోజ్ కౌంటర్
ఐక్యరాజ్య సమతిలో పాకిస్తాన్ రాయబారిపై భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కంబోజ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ ఒక పగలగొట్టబడిన రికార్డు అని ఆమె ఎద్దేవా చేశారు. శుక్రవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ రాయబారి మునీర్ అక్రమ్ చేసిన వ్యాఖ్యలపై రుచిరా కంబోజ్ ఘాటుగా స్పందించారు. ‘ఇస్లామోఫోబియాను ఎదుర్కొవటానికి చర్యలు’పై తీర్మాన్నాని ప్రవేశపెట్టే సందర్భంలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ భారత దేశానికి సంబంధించిన రామ మందిర్ నిర్మాణం, సీఏఏ అమలు అంశాలను ప్రస్తావించారు. మునీర్ అక్రమ్ చేసిన వ్యాఖ్యలపై రుచిరా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘మా దేశం (భారత్)కు సంబంధించిన విషయాలపై పాకిస్తాన్ చాలా పరిమితమైన, తప్పుదోవ పట్టించే అభిప్రాయాలు కలిగి ఉండటం దురదృష్టకరం. ప్రపంచం మొత్తం ఒకవైపు అభివృద్ది మార్గంలో దూసుకువెళ్తుంటే పాక్ తీవ్ర విషాదంతో కూడిన స్తబ్దతను కనబరుస్తోంది. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ఒక పగలగొట్టబడిన రికార్డు’ అని రుచిరా మండిపడ్డారు. ఇక పాకిస్తాన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా 115 దేశాలు ఓటు వేయాగా.. ఎవరు వ్యతిరేకంగా ఓటు వేయలేదు. కానీ, 44 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఇండియాతోపాటు బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఉక్రెయిన్, యూకే ఓటింగ్‌లో పాల్గొనలేదు. -
ప్రాణ ప్రతిష్టలో ఉపయోగించిన టన్నుల కొద్ది పువ్వులను ఏం చేస్తున్నారో తెలుసా!
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే అందుకోసం అయోధ్య ఎంతో సుందరంగా ముస్తాబయ్యింది. ముఖ్యంగా పూలతో చేసిన అలంకరణ చూస్తే రెండు కళ్లు చాలవు అన్నంత మనోహరంగా ఉంది. భవ్య రామాలయ ప్రారంభోత్సవం కోసం టన్నుల కొద్ది పుష్పలను వివిధ రాష్ట్రాలను తెప్పించి మరీ ఉపయోగించారు. అయితే ప్రాణ ప్రతిష్ట మహోత్సవం పూర్తైన తర్వాత ఆ పూలు వృధాగా అయ్యే పోకూడదని అయోధ్య మున్సిపాలిటీ అధికారులు నిర్ణయించారు. అందుకోసం వారు ఏంచేస్తున్నారో తెలుసా! బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుక కోసం ఉత్తరప్రదేశ్ నుంచి సుమారు పది టన్నుల పూజలు తెప్పించారు. ముఖ్యంగా బాలరాముడి గర్భలయాన్ని అలకరించేందుకే చెన్నై నుంచి ఏకంగా 20 రకాల పూలను మూడువేల కిలోలు తెప్పించారు. ఈ భవ్య రామాలయాన్ని క్రిస్తానియం, గెర్బెరా, ఆర్కడ్లు, ప్రోమేథియం, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ తదితర పూలతో ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. అలాగే బెంగళూరు, పూణే, లక్నో, ఢిల్లీ వంటి ఇతర నగరాల నుంచి కూడా ఈ కత్రువు కోసం పలు రకాల పూలను తెప్పించారు. ఈ ప్రాణప్రతిష్ట క్రతవు ముగిసిన తదనంతరం అయోధ్య ధామ్‌లో అన్ని దేవాలయాలల్లోని సుమారు 9 మెట్రిక్ టన్నుల పుష్పల వ్యర్థాలు వచ్చాయి. అయితే వీటన్నింటిని ఈ రీసైకిల్ చేయాలని భావిస్తున్నారు అధికారులు. ఈ పుష్పాలను రీసైకిల్ చేసి అగరుబత్తీలను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రతను కాపాడుకునేలా ఇలా వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్. అందులో భాగంగానే అయోధ్యధామ్‌లోని అన్ని దేవాలయాల్లో వినియోగించిన పువ్వలన్నింటిని ఇలా ప్రాసెంసింగ్ చేసి ధూప్ స్టిక్‌లు ఉత్పత్తి చేసే ఓ ప్రాజెక్టును కూడా ప్రారంభించింది అయోధ్య మున్సిపల్ కార్పోరేషన్. ఇక అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట క్రతువు కూడా ముగిసింది. ఇక ఆ తతంగంలో వినియోగించిన పువ్వలన్నింటితో కలిపి ఆ ప్రక్రియ కాస్త కంగా 2.3 మెట్రిక టన్నులకు పెరిగింది. ప్రసతుతం మున్సిపాలటీ సిబ్బంది ఆ పువ్వలన్నింటిని ప్రాసెస్ చేస్ ధూప్ కర్రలను తయారు చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు మున్సిపాలిటీ అధికారులు వెల్లడించారు. View this post on Instagram A post shared by PHOOL (@phool.co) (చదవండి: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట: అసలేంటీ ప్రాణ ప్రతిష్ట? ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?) -
‘బీజేపీ స్త్రీ వ్యతిరేక పార్టీ.. సీతామాత గురించి మాట్లాడదు’
కోల్‌కతా: అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ట నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ స్త్రీ వ్యతిరేక పార్టీ మండిపడ్డారు. సోమవారం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. బీజేపీ పార్టీ ఎప్పుడు రాముడి గురించే మాట్లాడుతుందని.. సీత గురించి ఎక్కడా ప్రస్తావించదని తెలిపారు. దీంతో బీజేపీ పార్టీ ఓ స్త్రీ వ్యతిరేక పార్టీ అని అర్థం చేసుకోవచ్చని దుయ్యబట్టారు. అయోధ్య రామ మందిరంలోని రాముడి ప్రాణప్రతిష్ట జరిగిన రోజే మమతా బీజేపీపై మాటల దాడి చేశారు. ‘బీజేపీ వాళ్లు రాముడి గురించే మాట్లాడుతారు. సీతాదేవి గురించి ఎందుకు మాట్లాడరు? వనవాసం సమయంలో కూడా సీతాదేవి రాముడి వెంటే ఉంది. కానీ, బీజేపీ వాళ్లు సీతా దేవి గురించి ఏమాత్రం ప్రస్తావించరు. దీంతో వాళ్లు ఎంతటి స్త్రీ వ్యతిరేకులో తెలుసుకోవచ్చు. తాను దుర్గా మాతను పూజిస్తాను. ఇలాంటి వాళ్లు(బీజేపీ) భక్తి, మతం గురించి ఉపన్యాసాలు ఇవ్వటం సరికాదు’ అని మమతా బెనర్జీ మండిపడ్డారు. తాను ఎన్నికల కోసం మతాన్ని రాజకీయం చేయటాన్ని నమ్మనని తెలిపారు. మత రాజకీయలు ఎప్పుడు చేయనని అన్నారు. అలా చేయటానికి చాలా వ్యతిరేకినని చెప్పారు. రాముడిపై భక్తి, విశ్వాసం కలిగి ఉండటంపై తానను ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. కానీ, ప్రజల ఆహార అలవాట్లపై జోక్యం చేయటాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తానని అన్నారు. ఇక.. మమతా బెనర్జీ అయోధ్య బాల రాముడి ప్రాణప్రతిష్టకు హాజరు కాలేదన్న విషయం తెలిసిందే. చదవండి: కొత్త పథకాన్ని ప్రకటించిన మోదీ -
రామ్ లల్లా గురించి ప్రధాని మోదీ
-
రాముడు తప్పక వస్తాడన్న శబరి ఎదురుచూపులు ఫలించాయి: మోదీ
-
నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచిన టెలికాం కంపెనీలు.. ఎందుకంటే..
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కాసేపట్లో జరగబోతుంది. రామ మందిర ప్రారంభ వేడుకల్లో కార్పొరేట్ సంస్థలు సందడిగా పాల్గొంటున్నాయి. దాదాపు 7000 మంది అతిథులు కార్యక్రమానికి హాజరుకానున్నారు. దేశంలోని కోట్లమంది ఈ క్రతువును పరోక్షంగా టీవీలు, సామాజిక మాధ్యమాలు, ఇతర మీడియాల్లో వీక్షించే అవకాశం ఉంది. దాంతో ఇప్పటికే టెలికాం సంస్థలు అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ప్రతిష్టాపన పూర్తయిన తర్వాత రోజూ మూడు నుంచి ఐదు లక్షల మంది సందర్శకులు అయోధ్యను సందర్శించే అవకాశం ఉందని అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో దేశీయ టెలికాం సంస్థలైన వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ అయోధ్యలో తమ నెట్వర్క్ సామర్థ్యాన్ని మెరుగుపరిచాయి. రామమందిర ప్రతిష్ఠాపన నేపథ్యంలో అయోధ్యలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో నెట్వర్క్ మౌలిక సదుపాయాలు, సామర్థ్యాన్ని పెంచినట్లు తెలిపాయి. దీంతో వినియోగదారులు స్పష్టమైన వాయిస్ కాల్స్, హై-స్పీడ్ డేటా, వీడియో స్ట్రీమింగ్ వంటి సదుపాయాల్ని పొందొచ్చని చెప్పాయి. ఇదీ చదవండి: అయోధ్యలో హూటల్ రూం ధర ఎంతంటే..? అయోధ్య రైల్వే స్టేషన్, రామమందిర ప్రాంగణం, విమానాశ్రయం, ప్రధాన ప్రాంతాలు, నగరంలోని హోటళ్లతో సహా అన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో తమ నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచినట్లు వెల్లడించాయి. లఖ్‌నవూకు అనుసంధానించే హైవేలతో సహా నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో పటిష్ట సిగ్నలింగ్ కోసం స్పెక్ట్రమ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచినట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. అదనపు నెట్వర్క్ సైట్లు, అంతరాయం లేని నెట్వర్క్ అందించటం కోసం ఆప్టిక్ ఫైబర్ కేబుల్‌ను ఏర్పాటు చేసినట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. -
Ayodhya Ram Mandir: అయోధ్యలో దీపోత్సవం
Ram mandir pran pratishtha Live Updates సాయంత్రం 5.30:.. సోమవారం, జనవరి 22 అయోధ్యలో దీపోత్సవం సరయూ నది ఒడ్డున 14 లక్షల దీపాలు వెలిగించిన భక్తులు దీప కాంతులతో వెలిగిపోతున్న సరయూ తీరం దేశ వ్యాప్తంగా ఇంటింటా రామజ్యోతి రామ్ కీ పైడీ, కనక్ భవన్, గుప్తర్ ఘాట్, సరయూ ఘాట్, లతా మంగేష్కర్ చౌక్, మనిరామ్ దాస్ చావ్నీ దీపాలతో అలంకరణ रामज्योति! #RamJyoti pic.twitter.com/DTxg2QquTT — Narendra Modi (@narendramodi) January 22, 2024 సాయంత్రం 4గం.. సోమవారం, జనవరి 22 బాల రాముడి విగ్రహ ప్రతిష్టతో చారిత్రక ఘట్టం పూర్తి రేపటి నుంచి సామాన్య భక్తులకు భగవాన్ రామ్ లల్లా దర్శనం వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ ద్వారా రామ దర్శనం మొదటి స్లాట్ ఉదయం 7 నుండి 11:30 వరకు రెండో స్లాట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఉదయం 6:30కు ఆలయంలో జాగ్రన్ , శృంగార్ హరతి హరతికి ఒక రోజు ముందుగానే బుకింగ్. రాత్రి 7 గంటలకు సాయంత్రం హారతి సమయం ఒకరోజు ముందుగానే బుకింగ్ చేసుకోవాలి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రస్ట్ వెబ్సైట్లో బుకింగ్ 3గం:10ని.. సోమవారం, జనవరి 22 రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకున్నవారికి ప్రధాని మోదీ సన్మానం పూలు జల్లి కృతజ్ఞతలు తెలిపిన మోదీ. 2గం:12ని.. సోమవారం, జనవరి 22 ఈరోజు మన రాముడు వచ్చేశాడు: ప్రధాని నరేంద్ర మోదీ జై శ్రీరామచంద్రమూర్తి జై అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ రామ భక్తులందరికీ నా ప్రణామాలు ఈరోజు మన రాముడు వచ్చేశాడు ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న మన రాముడు వచ్చేశాడు ఈ క్షణం ఎంతో ప్రత్యేకమైనది ఇది సామాన్యమైన సమయం కాదు రాముడు భారతదేశ ఆత్మ రాముడు భారతదేశానికి ఆధారం ఎక్కడ రాముడు కార్యక్రమం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు ఎంతో చెప్పాలని ఉన్నా.. నా గొంతు గద్గదంగా ఉంది నా శరీరం ఇంకా స్పందించే స్థితిలో లేదు ఎంతో అలౌకిక ఆనందంలో ఉన్నాను అన్ని భాషల్లోనూ రామాయణాన్ని విన్నాను గర్భగుడిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట నా చేతులు మీదుగా జరగడం నా అదృష్టం జనవరి 22వ తేదీ చరిత్రలో నిలిచిపోతుంది మన రాముడు టెంట్లో ఉండే పరిస్థితులు ఇక లేవు మన రాముడు ఇకపై దివ్యమైన మందిరంలో ఉంటారు రాముడి దయవల్ల మనమందరం ఈ క్షణానికి సాక్షులమయ్యాం ఈ నేల, గాలి ప్రతీది దివ్యత్వంతో నిండిపోయింది ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడుతున్న సరికొత్త అధ్యాయం ఇంత ఆలస్యం జరిగినందుకు మమ్మల్ని క్షమించమని శ్రీరాముడిని వేడుకుంటున్నా త్రేతాయుగంలో శ్రీరాముడు కేవలం 14 ఏళ్ల వనవాసానికి వెళ్లాడు కలియుగంలో రాముడు వందలయేళ్లపాటు వనవాసం చేశాడు భారత న్యాయవ్యవస్థకు ఈరోజు నేను నమస్కరిస్తున్నా న్యాయబద్ధంగానే శ్రీరాముడి మందిర నిర్మాణం జరిగింది ఈరోజు దేశ వ్యాప్తంగా దేవాలయాల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి దేశ ప్రజలందరూ ఇవాళ దీపావళి జరుపుకుంటున్నారు ఇంటింటా రాముడి దీపజ్యోతి వెలిగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఈ రోజు మనకు శ్రీరాముడి మందిరం దొరికింది బానిస సంకెళ్లను తెంచుకున్న కొత్త రాజ్యం ఆవిర్భించింది ఈ అనుభూతిని ప్రతి రామ భక్తుడు అనుభవిస్తున్నాడు రాముడు వివాదం కాదు.. ఒక సమాధానం రాముడు వర్తమానమే కాదు.. అనంతం రాముడు అందరివాడు రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారిని అయోధ్యకు ఆహ్వానిస్తున్నా ఇవాళ్టి ఈ చరిత్ర వేలయేళ్లపాటు నిలిచిపోతుంది రాబోయే వెయ్యేళ్ల కోసం నేడు పునాదిరాయి వేస్తున్నాం సేవా, చింతన భక్తిని.. హనుమంతుడి నుంచి ప్రేరణ పొందాలి రాముడు తప్పక వస్తాడన్న శబరి ఎదురుచూపులు ఫలించాయి దేవుడి నుంచి దేశం.. రాముడి నుంచి రాజ్యం ఇది మన నినాదం నేను సామాన్యుడిని, బలహీనుడినని భావిస్తే.. ఉడత నుంచి ప్రేరణ పొందండి 2గం:10ని.. సోమవారం, జనవరి 22 మోదీ గొప్ప తపస్వి: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ ఆనందం మాటల్లో చెప్పలేనిది. అయోధ్యలో బాలరాముడితోపాటు భారత కీర్తి తిరిగొచ్చింది. మోదీ గొప్ప తపస్వి ప్రధాని మోదీ కఠిన నియమాలు పాటించారు. ఈ కార్యక్రమాన్ని వర్ణించేందుకు మాటలు చాలడం లేదు కష్టకాలలంలో ప్రపంచశాంతికి ఇది దిక్సూచిలాంటింది ఎందరో త్యాగాల ఫలితం ఇవాళ్టి సువర్ణ ఆధ్యాయం 1గం:58ని.. సోమవారం, జనవరి 22 యోగి భావోద్వేగ ప్రసంగం 50ం ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది ఎన్నో తరాలు ఈ క్షణం కోసం నిరీక్షించాయి ఈ అద్భుత ఘట్టాన్ని వర్ణించేందుకు నాకు మాటలు రావడం లేదు దేశంలోని ప్రతీ పట్టణం, గ్రామం అయోధ్యగా మారింది ప్రతీ ఒక్కరూ ఆనంద భాష్పాలతో అయోధ్య వైపు చూశారు కలియుగం నుంచి త్రేతాయుగంలోకి వచ్చామ్మా? అనే భావన నెలకొంది ప్రతీ రామ భక్తుడు సంతృప్తి.. గర్వంతో ఉన్నాడు తన ఆలయం కోసం సాక్షాత్తూ శ్రీరాముడే పోరాడాల్సి వచ్చింది ఆ మహాసంకల్పం మోదీ చేతుల మీదుగా పూర్తయ్యాయింది బాలరాముడి రూపాన్ని చెక్కిన శిల్పి జీవితం ధన్యమైంది #WATCH | Uttar Pradesh CM Yogi Adityanath says, "The entire country has become 'Rammay'. It seems that we have entered Treta Yug..."#RamMandirPranPrathistha pic.twitter.com/6Sd7lJrOy8 — ANI (@ANI) January 22, 2024 1గం:55ని.. సోమవారం, జనవరి 22 మోదీ కఠోర దీక్ష విరమణ అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కోసం నరేంద్ర మోదీ కఠోర ఉపవాసం ప్రధాని మోదీ 11 రోజుల కఠోర దీక్ష దీక్ష విరమింపజేసిన గోవింద్ దేవ్ గిరి మహారాజ్ మోదీకి వెండి ఆలయ నమునా ఇచ్చిన.. బంగారు ఉంగం ఇచ్చిన ట్రస్ట్ 11 రోజులపాటు మోదీ కఠోర దీక్ష చేశారు: గోవింద్ దేవ్ గిరి మహారాజ్ దేశవ్యాప్తంగా ఆయన అన్ని ఆలయాలు తిరిగారు: గోవింద్ దేవ్ గిరి మహారాజ్ కొబ్బరి నీళ్లు తాగి నేల మీద పడుకున్నారు: గోవింద్ దేవ్ గిరి మహారాజ్ ఇలాంటి సంకల్ప బలం ఉన్న వ్యక్తి దేశ నాయకుడు కావడం గర్వకారణం: గోవింద్ దేవ్ గిరి మహారాజ్ #WATCH | PM Narendra Modi breaks his fast after the ‘Pran Pratishtha’ ceremony at the Shri Ram Janmaboomi Temple in Ayodhya. #RamMandirPranPrathistha pic.twitter.com/Zng1IHJ2FJ — ANI (@ANI) January 22, 2024 1గం:33ని.. సోమవారం, జనవరి 22 అయోధ్య రాముడి దర్శన వేళలు ఇవే అయోధ్యలో శాస్త్రోక్తంగా జరిగిన ప్రాణ ప్రతిష్ట మహోత్సవం రేపటి నుంచి సామాన్యుల సందర్శనకు అనుమతి రెండు స్లాట్ల కేటాయింపు ఉదయం 7 నుంచి 11గం.30ని వరకు.. మధ్యాహ్నాం 2గం. నుంచి 7 గం. వరకు అనుమతి 1గం:28ని.. సోమవారం, జనవరి 22 ఎటు చూసినా భావోద్వేగమే! అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో దేశమంతటా భావోద్వేగ సన్నివేశాలుఔ దేశమంతటా రామ నామ స్మరణం కాషాయ వర్ణంతో మురిసిపోతున్న హిందూ శ్రేణులు ఆలింగనంతో కంటతడిపెట్టిన బీజేపీ నేత ఉమాభారతి, సాధ్వీ రీతాంభరలు రామ మందిర ఉద్యమంలో కీలకంగా వ్యహరించిన ఈ ఇద్దరూ 1గం:16ని.. సోమవారం, జనవరి 22 రామ్ లల్లాకు తొలి హారతి అయోధ్య రామ మందిరంలో కొలువు దీరిన శ్రీరామ చంద్రుడు రమణీయంగా సాగిన ప్రాణప్రతిష్ట క్రతువు కర్తగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ బాలరాముడి అవతారంలో కొలువు దీరిన వైనం పసిడి కిరీటం, పట్టు వస్త్రం సమర్పణ దేశమంతటా రామ భక్తుల సందడి రామ్ లల్లాకు తొలి హారతి ఇచ్చిన ప్రధాని మోదీ రామయ్యకు మోదీ సాష్టాంగ నమస్కారం #WATCH | PM Modi performs 'Dandavat Pranam' at the Shri Ram Janmaboomi Temple in Ayodhya. #RamMandirPranPrathistha pic.twitter.com/kAw0eNjXRb — ANI (@ANI) January 22, 2024 12గం:54ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యలో అపూర్వ ఘట్టం.. తొలి దర్శనం అయోధ్య రామ మందిరంలో జరిగిన ప్రాణ ప్రతిష్ట మహోత్సవం రామ్ లల్లా తొలి దర్శనం రామనామస్మరణతో ఉప్పొంగిపోతున్న హిందూ హృదయాలు గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నేతృత్వంలో మహాగంభీరంగా జరిగిన ప్రాణప్రతిష్ట క్రతువు పద్మపీఠంపై ధనుర్ధారియై బాలరాముడి తొలి దర్శనం మెడలో రత్నాల కాసుల మాల స్వర్ణాభరణాలతో బాలరాముడు తలపై వజ్రవైడ్యూరాల్యతో పొదిగిన కిరీటం పాదాల వద్ద స్వర్ణ కమలాలు సకలాభరణాలతో బాలరాముడి నుదుట వజ్రనామం 84 సెకన్ల దివ్య ముహూర్తంలో సాగిన ప్రాణ ప్రతిష్ట క్రతువు ఆ సమయంలో అయోధ్య ఆలయంపై హెలికాఫ్టర్లతో పూల వర్షం Prime Minister Narendra Modi performs 'aarti' of Ram Lalla idol at the Shri Ram Janmaboomi Temple in Ayodhya.#RamMandirPranPrathistha pic.twitter.com/EDjYa3yw7V — ANI (@ANI) January 22, 2024 12గం:30ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతం అయోధ్యలో నూతన రామ మందిరంలో కొలువుదీరనున్న బాలరాముడు రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కర్తగా ప్రధాని నరేంద్ర మోదీ జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగుతున్న దేశం మరికొద్ది నిమిషాల్లో బాలరాముడికి ప్రాణప్రతిష్ట 12గం:26ని.. సోమవారం, జనవరి 22 గర్భాలయంలోకి ప్రధాని మోదీ ప్రత్యేక పూజల అనంతరం గర్భగుడిలోకి మోదీ గర్భాలయంలో ప్రాణప్రతిష్ట పూజల్లో ప్రధాని మోదీ మోదీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, గవర్నర్ ఆనందీ బెన్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా వేదమంత్రాల నడుమ కొనసాగుతున్న బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట క్రతువు 12గం:20ని.. సోమవారం, జనవరి 22 ప్రారంభమైన ప్రాణప్రతిష్ట మహోత్సవం అయోధ్య రామ మందిరంలోకి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు బాలరాముడి కోసం పట్టు పీతాంబరాలు, ఛత్రం, పాదుకలు తీసుకొచ్చిన మోదీ వెంట ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ #WATCH | Prime Minister Narendra Modi arrives at Shri Ram Janmaboomi Temple in Ayodhya to participate in the Ram Temple Pran Pratishtha ceremony pic.twitter.com/XkLf1aV1hh — ANI (@ANI) January 22, 2024 12గం:00ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యలో అపురూప క్షణాలు అయోధ్యలో రామయ్య కొలువుదీరే అపురూప క్షణాలు ఆసన్నం మరికాసేపట్లో రామ మందిరంలో రామయ్య విగ్రహాన్ని ప్రతిష్టించనున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మధ్యాహ్నం 12.20 నుంచి ఒంటి గంట మధ్య అభిజిత్ లగ్నంలో ఈ వేడుక ప్రాణప్రతిష్ఠను 84 సెకన్ల దివ్య ముహూర్తంలో నిర్వహణ మధ్యాహ్నం 12.29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు దివ్యముహూర్తం ముందుగా రామ్‌లల్లా విగ్రహ కళ్లకు ఆచ్ఛాదనగా ఉన్న వస్త్రాన్ని తొలగింపు బంగారంతో చేసిన చిన్న కడ్డీతో శ్రీరాముడికి కాటుక దిద్దడం ఆపై రామ్‌లల్లాకు చిన్న అద్దాన్ని చూపిస్తారు ఆ తర్వాత 108 దీపాలతో ‘మహా హారతి’ ఇవ్వడంతో ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగుస్తుంది 11గం:43ని.. సోమవారం, జనవరి 22 ఆలయంపై పుష్పవర్షం.. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఆలయంపై హెలికాప్టర్లతో పుష్పవర్షం 25 రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు రెండు గంటల పాటు మంగళ వాయిద్యాలు మోగిస్తారు వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు.. కర్తలుగా వ్యవహరిస్తాయి ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు 7 వేల మంది పాల్గొననున్నారు వారిద్దరు రామలక్ష్మణుల్లా రామమందిరాన్ని నిర్మించారు: సినీ నటుడు సుమన్ సినీనటుడు సుమన్ అయోధ్య రామ మందిరానికి చేరుకున్నారు ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు అభినందనలు: సుమన్ వారిద్దరు రామలక్ష్మణుల మాదిరిగా కష్టపడి రామాలయాన్ని నిర్మించారు రామాలయ నిర్మాణానికి భగవంతుడు వారికి సహకరించారు శ్రీరాముడు మతానికి అతీతుడు: ఆనంద్ మహీంద్రా శ్రీరాముడు మతానికి అతీతుడు: ఆనంద్ మహీంద్రా మన విశ్వాసాలు ఏవైనా.. గౌరవం, బలమైన విలువలతో జీవించడానికి అంకితమైన మహావ్యక్తి రాముడు అనే భావనకు ఆకర్షితులవుతాం ఆయన బాణాలు చెడు, అన్యాయాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి ‘రామరాజ్యం’ అనే ఆదర్శ పాలన భావన నేడు అన్ని సమాజాల ఆకాంక్ష ఇప్పుడు ‘రామ్’ అనే పదం యావత్ ప్రపంచానికి చెందింది: ఆనంద్ మహీంద్రా 11గం:29ని.. సోమవారం, జనవరి 22 సాయంత్రం దాకా మోదీ ఇక్కడే ఉదయం 11 గంటల ప్రాంతంలో రామజన్మభూమికి చేరుకున్న ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ఠ క్రతువు పూర్తయిన తర్వాత భక్తులనుద్దేశించి ప్రసంగం ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో అయోధ్యలోని కుబర్ తిలాలో ఉన్న శివ మందిర్‌ను సందర్శన సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఢిల్లీకి పయనం అయోధ్య ప్రాణప్రతిష్ట.. అంతటా ఇలా.. New York Celebrates Arrival of "Shree Ram"#RamMandirPranPrathistha #RamMandirAyodhya #AyodhyaRamMandir #AyodhyaSriRamTemple #AyodhyaJanmBhoomi #RamMandirInauguration pic.twitter.com/5kJGjUEMEr — One World News (@Oneworldnews_) January 22, 2024 At Eiffel tower Paris. 🥳 Jai Shri Ram 🚩#JaiShriRam #RamLallaVirajman #RamMandirPranPratishta #AyodhaRamMandir #Ayodhya #AyodhyaRamMandir pic.twitter.com/mOZVCBZJF1 — Secular Chad (@SachabhartiyaRW) January 22, 2024 New York Celebrates Arrival of "Shree Ram"#RamMandirPranPrathistha #RamMandirAyodhya #AyodhyaRamMandir #AyodhyaSriRamTemple #AyodhyaJanmBhoomi #RamMandirInauguration pic.twitter.com/5kJGjUEMEr — One World News (@Oneworldnews_) January 22, 2024 San Francisco 🇺🇸 turned into Ayodhya 🇮🇳 for a night to celebrate the RamMandir Inauguration 🚩 Jai Shree Ram 🙏#RamMandirPranPrathistha pic.twitter.com/M3eQQMFym1 — SaNaTaNi ~ 𝕏𝐎𝐍𝐄 🚩 (@xonesanatani) January 22, 2024 श्री राम के दर्शन करने पहुंचे भारतीय क्रिकेटर।।।#जयश्रीराम #अयोध्या #JaiSriRam #AyodhyaRamMandir pic.twitter.com/DedGNBdMs6 — Hriday Singh (@hridaysingh16) January 22, 2024 11గం:22ని.. సోమవారం, జనవరి 22 కాసేపట్లో ప్రాణప్రతిష్ట అయోధ్యలో ప్రధాని మోదీ దేశమంతటా రామనామస్మరణ సర్వోన్నతంగా నిర్మించిన రామ మందిరం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం జాబితాలో చోటు ఐదేళ్ల బాలరాముడి అవతారంలో రామ్ లల్లా కాసేపట్లో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఇప్పటికే రామజన్మ భూమికి భారీగా భక్తజనం 11గం:00ని.. సోమవారం, జనవరి 22 మరో దీపావళిలా.. దేశ వ్యాప్తంగానే కాదు.. విదేశాలలో అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట వేడుకలు అన్ని ఆలయాల్లో.. ప్రత్యేకించి రామాలయం, హనుమాన్ గుడిలలో ప్రత్యేక పూజలు జై శ్రీరామ్ నినాదాలతో.. భక్తి శ్రద్ధలతో వివిధ కార్యక్రమాల నిర్వహణ ఆలయాల్లోనే కాదు.. ప్రతీ ఇంటా దీపం రావణుడిపై జయం తర్వాత శ్రీరాముడు రాక సందర్భంగా దీపావళి ఇప్పుడు అయోధ్య మందిర నేపథ్యంలో దీపాలంకరణలతో.. మరో దీపావళిలా దివ్యోత్సవం 10గం:45ని.. సోమవారం, జనవరి 22 భారీగా ప్రముఖులు.. భద్రత కాసేపట్లో అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట పాల్గొననున్న ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకున్న అన్ని రంగాల ప్రముఖులు అన్ని రాష్ట్రాల నుంచి సినీ రంగాల ప్రముఖులు పలువురు రాజకీయ ప్రముఖులు 12 గంటల నుంచి ప్రాణ ప్రతిష్ట క్రతువు ప్రారంభం 10గం:40ని.. సోమవారం, జనవరి 22 తెలంగాణ అంతటా.. ఆధ్యాత్మిక శోభ అయోధ్య రామ మందిర బాలరాముడి ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో తెలంగాణలో కోలాహలం పలు ఆలయాలు సుందరంగా ముస్తాబు అర్ధరాత్రి నుంచి మైక్ సెట్లతో హడావిడి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో శ్రీరామచంద్రుడి పల్లకి ఊరేగింపు లొ పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ 10గం:35ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ బాలరాముడి ప్రాణప్రతిష్టలో పాల్గొననున్న ప్రధాని మోదీ కాసేపట్లో అయోధ్య రామజన్మభూమికి మోదీ మ.1.15ని. విశిష్ట సభలో ప్రధాని మోదీ ప్రసంగం ఇదీ చదవండి: అయోధ్యకు వ్యాపారవేత్తల క్యూ.. జై శ్రీరామ్ నినాదాలతో.. దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం దేశం నలుమూలల నుంచి అయోధ్యకు చేరుకుంటున్న రామ భక్తులు వేలాది మంది సాధువులు దేశం నుంచి అయోధ్యకు వెయ్యి రైళ్లు ఇప్పటికే అయోధ్యలో హోటళ్లు ఫుల్లు పవిత్రోత్సవం తర్వాత దేదీప్యమానంగా అయోధ్య సాయంత్రం 10 లక్షల దీపాలతో శ్రీరామ జ్యోతి 10గం:10ని.. సోమవారం, జనవరి 22 భక్తితో పురిటి నొప్పులు ఓర్చుకుంటూ..?! దేశమంతా రామమయం అయోధ్యలో నేడు రాముడి విగ్రహ ప్రతిష్ట ఆ శుభముహూర్తం కోసం గర్బిణీల ఎదురు చూపులు పుత్రుడు జన్మిస్తే రాముడు.. ఆడపిల్ల జన్మిస్తే సీత పేరు పెడతారట మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో పదుల సంఖ్యలో ఆ శుభ గడియ కోసం గర్భిణీలు ఇక్కడే కాదు.. దేశమంతా శుభముహూర్తం కోసం ఎదురు చూపులు పురిటి నొప్పులు వస్తున్నా.. ఓపిక పడుతున్న గర్బిణీలు 10గం:10ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యలో టైట్ సెక్యూరిటీ ఏడెంచెల భద్రతా వలయం నడుమ అయోధ్య రామ మందిరం వేల మంది యూపీ పోలీసులు వందల సంఖ్యలో కేంద్ర బలగాల సిబ్బంది ప్రధాని రాక నేపథ్యంలో ప్రత్యేక సిబ్బంది మోహరింపు ప్రతీ ఒక్కరిపై కన్నేసేలా ఏఐ టెక్నాలజీ 10వేలకు పైగా సీసీ కెమెరాలు.. డ్రోన్ల నిఘా 10గం:02ని.. సోమవారం, జనవరి 22 బాలరాముడ్ని అద్దంలో చూపిస్తూ.. కాసేపట్లో అయోధ్యకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిన్నంతా రామేశ్వరంలో మోదీ ప్రత్యేక పూజలు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో కఠిన ఉపవాస.. కఠోర నియమాలు పాటిస్తున్న మోదీ గత 74 ఏళ్లుగా అయోధ్యలో తాత్కాలిక విగ్రహానికి పూజలు ఉత్తరాది నాగర స్టయిలో కొత్త రామ మందిర ఆలయ నిర్మాణం 392 పిల్లర్లు.. ఆలయానికి 44 తలుపులు నేడు ప్రాణప్రతిష్ట జరుపుకోనున్న బాలరాముడి విగ్రహం ముందుగా దశ దర్శనాలు తొలుత అద్దంలో బాలరాముడ్ని.. బాలరాముడికే చూపించనున్న ప్రధాని మోదీ 84 సెకన్లపాటు సాగనున్న ప్రాణప్రతిష్ట క్రతువు థాయ్‌లాండ్‌లో ఇలా.. Thailand pic.twitter.com/ZqaIxPW8gh — Megh Updates 🚨™ (@MeghUpdates) January 21, 2024 09గం:49ని.. సోమవారం, జనవరి 22 ఏపీలో ఇలా.. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట వేళ.. ఏపీలో ఆధ్యాత్మిక శోభతో ఉట్టి పడుతున్న రామ మందిరాలు, ఆలయాలు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ నేడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు అన్న సమారాధనలు జిల్లా వ్యాప్తంగా శోభాయాత్రలు చేస్తున్న రామభక్తులు.. తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 30 ప్రాంతాల్లో యల్.ఇ.డి స్క్రీన్ లు ఏర్పాటు ఏలూరు ధర్మభేరి ప్రాంగణంలో శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని పురవీధుల్లో శ్రీరాముని చిత్రపటం ఊరేగింపు శ్రీరామ నామస్మరణం చేస్తూ పాల్గొన్న భక్తాదులు 09గం:45ని.. సోమవారం, జనవరి 22 అయోధ్య చేరుకున్న చిరంజీవి, రామ్ చరణ్ రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు అయోధ్య చేరుకున్న చిరంజీవి దంపతులు.. తనయుడు రామ్ చరణ్ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను: చిరంజీవి నా ఆరాధ్య దైవం హనుమంతుడు నన్ను వ్యక్తిగతంగా ఆహ్వానించాడుఅని భావిస్తున్నా: చిరంజీవి అయోధ్యలో రామ మందిరం కోట్లమంది చిరకాల స్వప్నం.. ఎంతో ఉద్వేగభరితంగా ఉంది: రామ్‌చరణ్ #WATCH | Uttar Pradesh: Telegu superstars Chiranjeevi and Ram Charan arrive in Ayodhya. Ayodhya Ram Temple Pran Pratishtha ceremony is taking place today. pic.twitter.com/wT0gvlLPiS — ANI (@ANI) January 22, 2024 #WATCH | Telangana | Actor Chiranjeevi leaves from Hyderabad for Ayodhya in Uttar Pradesh as Ayodhya Ram Temple pranpratishtha ceremony to take place today. He says, "That is really great. Overwhelming. We feel it's a rare opportunity. I feel Lord Hanuman who is my deity, has… pic.twitter.com/FjKoA7BBkQ — ANI (@ANI) January 22, 2024 08గం:47ని.. సోమవారం, జనవరి 22 అద్వానీ రావట్లేదు బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ అయోధ్య వేడుకకు గైర్హాజరు 96 ఏళ్ల వయసురిత్యా తొలుత దూరంగా ఉండాలని నిర్ణయం ఆ వెంటనే మనుసు మార్చుకుని హాజరవుతానని ప్రకటించిన అద్వానీ తీవ్ర చలి ప్రభావంతోనే హాజరు కావట్లేదని తాజా ప్రకటన అద్వానీకి ఆహ్వానం అందకపోవడంపైనా రాజకీయ విమర్శలు ఆహ్వానం స్వయంగా అందించినట్లు వెల్లడించిన ట్రస్ట్ సభ్యులు 08గం:47ని.. సోమవారం, జనవరి 22 అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. అమృత్‌సర్‌లో శోభాయాత్ర #WATCH | Punjab: 'Shobha yatra' being taken out in Amritsar, ahead of Pran Pratishtha ceremony of the Ram Temple in Ayodhya today. pic.twitter.com/6EfSbJhNDQ — ANI (@ANI) January 22, 2024 08గం:35ని.. సోమవారం, జనవరి 22 ప్రముఖ నటుడి ప్రత్యేక పూజలు సీనియర్ నటుడు, బీజేపీ నేత అనుపమ్ ఖేర్ ప్రత్యేక పూజలు హనుమంతుడికి పూజలు చేసిన అనుపమ్ ఖేర్ మరో దీపావళి పండుగలా ఉందంటూ వ్యాఖ్య #WATCH | Ayodhya | Actor Anupam Kher says, "Before going to Lord Ram, it is very important to have the darshan of Lord Hanuman...The atmosphere in Ayodhya is so graceful. There is slogan of Jai Sri Ram in the air everywhere...Diwali has come again, this is the real Diwali." pic.twitter.com/GCskErgi1Z — ANI (@ANI) January 22, 2024 08గం:31ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యలో ఇవాళ.. కాసేపట్లో.. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన 16 ఆచారాలు ప్రారంభం దేవకినందన్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీరామ కథా పారాయణం అయోధ్యలో వంద చోట్ల ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంస్కృతిక ఊరేగింపు యూపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1500 మంది జానపద నృత్య కళాకారుల ప్రదర్శన రామకథా పార్కులో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు రాంలీలా ప్రదర్శన సాయంత్రం 6.30 నుండి 7 గంటల వరకు శ్రీరామునికి సరయూ హారతి. రాత్రి 7 నుంచి 7.30 వరకు రామ్ కి పైడిపై ప్రొజెక్షన్ షో. రామకథా పార్కులో రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాటేకర్ సిస్టర్స్ సారధ్యంలో రామకథా గానం. తులసీ ఉద్యానవనంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శర్మ బంధుచే భజన కార్యక్రమం రాత్రి 7.45 నుండి 7.55 వరకు రామ్ కీ పైడి వద్ద బాణసంచా కాల్చి సందడి కన్హయ్య మిట్టల్ సారధ్యంలో రామకథా పార్క్ వద్ద రాత్రి 8 నుండి 9 గంటల వరకు భక్తి సాంస్కృతిక కార్యక్రమం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు తులసి ఉద్యానవనంలో రఘువీర పద్మశ్రీ మాలినీ అవస్థి సారధ్యంలో ప్రత్యేక కార్యక్రమం 08గం:18ని.. సోమవారం, జనవరి 22 ఎటు చూసినా డ్రోన్లే మరోవైపు అయోధ్యలో ఏడంచెల భద్రతా వలయం ప్రధాని సహా వీవీఐపీలు, వీఐపీల రాక నేపథ్యంలో.. ఎస్పీజీ, ఎన్ఎస్జీ కమాండోల మోహరింపు వేల మంది యూపీ పోలీసుల మోహరింపు కేంద్ర బలగాల పహారా నడుమ అయోధ్యాపురి డ్రోన్ నిఘా నీడలో అయోధ్య 08గం:00ని.. సోమవారం, జనవరి 22 ప్రాణప్రతిష్ట క్రతువు కొన్ని సెకన్లే.. మేషలగ్నం అభిజిత్ ముహూర్తంలో అయోధ్య రాముడికి ప్రాణప్రతిష్ట మధ్యాహ్నాం 12గం.29ని.. నుంచి 12గం.30ని.. మధ్య ప్రాణప్రతిష్ట ముహూర్తం నూతన రామాలయంలో 84 సెకన్ల కాలంలో గర్భగుడిలో బాలరాముడి ప్రాణప్రతిష్ట రామ్‌లల్లా విగ్రహానికి జరగనున్న ప్రాణ ప్రతిష్ట నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట చేయించనున్న వారణాసి అర్చకులు అయోధ్యలో విశిష్ట సభలో 1గం. నుంచి 2గం. మధ్య ప్రధాని మోదీ సహా ప్రముఖుల ప్రసంగాలు హాజరు కానున్న అన్ని రాష్ట్రాల రామ భక్తులు 7 వేలమందికి ఆహ్వానం.. భారీగా ప్రముఖుల రాక కట్టుదిట్టమైన భద్రతా వలయంలో అయోధ్య అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఓర్చాలో 5100 మట్టి దీపాలను వెలిగించారు 07గం:55ని.. సోమవారం, జనవరి 22 ‘రామ’కు వెలుగులు దేశవ్యాప్తంగా రామ నామంతో ఉన్న రైల్వే స్టేషన్లకు ప్రత్యేక ముస్తాబు రామన్నపేట్ (తెలంగాణ). రామచంద్రపురం (ఆంధ్రప్రదేశ్). రామగిరి (కర్ణాటక). ఇవన్నీ రాముని పేరుతో ఉన్న రైల్వేస్టేషన్లు. దేశవ్యాప్తంగా ఇలా మొత్తం 343 రైల్వేస్టేషన్లకు హంగులు ప్రాణప్రతిష్ఠ సందర్భంగా విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్న స్టేషన్లు రైల్వే శాఖ నిర్ణయంపై సర్వత్రా హర్షం రాముని పేరిట ఉన్న రైల్వేస్టేషన్లలో అత్యధికంగా 55 ఏపీలో ఉండటం విశేషం! 07గం:48ని.. సోమవారం, జనవరి 22 500 ఏళ్ల హిందువుల కల నెరవేరుతున్న వేళ.. మరికొద్ది గంటల్లో అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మ.12 నుంచి ప్రాణ ప్రతిష్ట క్రతువుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ట అనంతరం కుబేర్ తిలక్‌లో భగవాన్ శివుని పురాతన మందిరాన్ని సందర్శించనున్న మోదీ ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొననున్న దేశంలోని అన్ని ప్రధాన ఆధ్యాత్మిక, ధార్మిక శాఖల ప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు ప్రాణ ప్రతిష్ట అనంతరం విశిష్ట సభను ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణంలో పాల్గొన్న కార్మికులతోనూ ప్రధాని మోదీ ముచ్చట్లు విదేశాల్లోనూ శ్రీరామం అయోధ్య ప్రాణప్రతిష్ట వేళ.. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా వేడుకలు పలు దేశాల ఆలయాల్లో ప్రత్యేక పూజలు 50కి పైగా దేశాల్లో అయోధ్య రామ మందిర బాలరాముడి ప్రాణప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాట్లు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పలు చోట్ల కార్ల ర్యాలీలు టైమ్స్ స్క్వేర్ సహా పలు చోట్ల లైవ్ టెలికాస్టింగ్‌కు ఏర్పాట్లు ఫ్రాన్స్‌లో రథయాత్ర.. ఈఫిల్ టవర్ వద్ద ప్రత్యక్ష ప్రసారం US: 'Overseas Friends of Ram Mandir' distributes laddoos at Times Square ahead of Pran Pratishtha Read @ANI Story | https://t.co/tJPnNvaKt2#TimesSquare #PranPratishthaRamMandir #NewYork pic.twitter.com/IWAMSJWAYy — ANI Digital (@ani_digital) January 22, 2024 #WATCH | Indian diaspora in the United States offer prayers at Shree Siddhi Vinayak temple in New Jersey ahead of the Pran Pratishtha ceremony at Ram Temple in Ayodhya. pic.twitter.com/gCt2EZL7qL — ANI (@ANI) January 22, 2024 07గం:35ని.. సోమవారం, జనవరి 22 ఈ ఉదయం రామజన్మభూమి ఇలా.. #WATCH | Ayodhya, Uttar Pradesh: Visuals from Ram Janmabhoomi premises ahead of the Pran Pratishtha ceremony of Ram Temple, today. pic.twitter.com/O1Iuay8Dd7 — ANI (@ANI) January 22, 2024 07గం:28ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యకు బిగ్‌బీ అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం అయోధ్యకు అమితాబ్ బచ్చన్ రామమందిర వేడుక కోసం భారీగా తరలిన వీవీఐపీలు #WATCH | Mumbai: Superstar Amitabh Bachchan leaves for Ayodhya. Pran Pratishtha ceremony of Ayodhya's Ram Temple will take place today. pic.twitter.com/pOecsD92XQ — ANI (@ANI) January 22, 2024 07గం:15ని.. సోమవారం, జనవరి 22 50 వాయిద్యాలతో మంగళ ధ్వని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మంగళ ధ్వని మధ్య నిర్వహించేందుకు సిద్ధమైన రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళ ధ్వని కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన 50 సంగీత వాయిద్యాలకు ఒకే వేదికపై చోటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం, కర్ణాటక నుంచి వీణ, తమిళనాడు నుంచి నాదస్వరం, మృదంగం మొత్తం 2 గంటల పాటు మంగళ ధ్వని కార్యక్రమం 06గం:55ని.. సోమవారం, జనవరి 22 వైద్య సేవలతో సహా.. రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం సర్వాంగ సుందరంగా అయోధ్య అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం బహుళ అంచెల భద్రత కోసం వేల మంది పోలీసుల మోహరింపు ప్రతి వీధిలో బారికేడ్ల ఏర్పాటు రసాయన, బయో, రేడియోధార్మిక, అణు దాడులను ఎదుర్కొనేలా ఎన్డీఆర్ఎఫ్ బృందాల మోహరించింది భూకంప సహాయక బృందాల నియామకం ఎటువంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలు చలికాలం కావడంతో భక్తులకు, ఆహ్వానితులకు ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే చికిత్స అందించేలా బెడ్ల ఏర్పాటు ఎయిమ్స్ నుంచీ ప్రత్యేక వైద్య బృందాలు అయోధ్యలో ప్రధాని అయోధ్య షెడ్యూల్: 10గం:25ని అయోధ్య విమానాశ్రయానికి చేరిక 10గం:45ని అయోధ్య హెలిప్యాడ్‌కు చేరుకోవడం 10గం:55ని. శ్రీరామ జన్మభూమికి రాక.. ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు: రిజర్వ్ మధ్యాహ్నం 12:05 నుండి 12:55 వరకు: ప్రతిష్ఠాపన కార్యక్రమం.. మధ్యాహ్నం 12:55: పూజా స్థలం నుండి బయటకు మధ్యాహ్నం 1:00: బహిరంగ వేదిక వద్దకు చేరిక మధ్యాహ్నం 1:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు.. అయోధ్యలో పబ్లిక్ ఫంక్షన్‌కు హాజరు విశిష్ట సభను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ.. పలువురు మధ్యాహ్నం 2:10: కుబేర్ తిల దర్శనం 06గం:49ని.. సోమవారం, జనవరి 22 దేదీప్యమానంగా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో.. సర్వాంగ సుందరంగా అయోధ్య రకరకాల పూలతో.. రంగు రంగుల విద్యుద్దీపాలతో రామమందిర అలంకరణ శ్రీరాముడి చిత్రాలతో పై వంతెనల వీధి దీపాల ఏర్పాటు విల్లంబుల కటౌట్ల ఏర్పాటు సంప్రదాయ రామానంది తిలక్ డిజైన్లతో దీపాలు మంచి ఘడియలు వచ్చాయి (శుభ్ ఘడీ ఆయీ), అయోధ్య ధామం తయారైంది (తయ్యార్ హై అయోధ్య ధామ్), శ్రీరాముడు ఆసీనులవుతారు (విరాజేంగే శ్రీరామ్), రాముడు మళ్లీ తిరిగొస్తారు (రామ్ ఫిర్ లౌటేంగే), అయోధ్యలో రామరాజ్యం వచ్చింది (అయోధ్యమే రామ్ రాజ్య) అనే స్లోగన్లు, నినాదాల పోస్టర్లు రామాయణంలోని పలు ఘట్టాలను పోస్టర్లపై చిత్రీకరణ రామ్ మార్గ్, సరయూ నది తీరం, లతా మంగేష్కర్ చౌక్‌లలో కటౌట్ల ఏర్పాటు అయోధ్య నగరమంతా రామ్ లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు సరయూ తీరంలో ప్రతి రోజూ హారతి ఇచ్చే ఏర్పాట్లు What a goosebumps view from Mundra (Kutch, Gujarat)... No sanathan will pass without liking this ♥️ Jai shree ram 🛐#JaiShriRam #RamMandirPranPrathistha #ShriRam #AyodhyaRamMandir#RamLallaVirajman#RamMandir #RamLallaVirajman#WorldInAyodhya pic.twitter.com/48WssugiGv pic.twitter.com/DZhGfFXNWf — BRAKING NEWS 🤯 (@Jamesneeesham) January 22, 2024 06గం:45ని.. సోమవారం, జనవరి 22 పలు చోట్ల సెలవు అయోధ్య ఉత్సవం నేపథ్యంలో.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నేడు సెలవు ఒడిశాలోనూ సెలవు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒక పూట సెలవు బ్యాంకులు, ఇన్సూరెన్సు కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకూ ఒక పూట సెలవు స్టాక్ మార్కెట్లు బంద్ పలు బీజేపీ యేతర రాష్ట్రాల్లోనూ స్కూళ్ల స్వచ్ఛంద సెలవు 06గం:42ని.. సోమవారం, జనవరి 22 నలుమూలల నుంచి భారీ కానుకలు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి కన్నౌజ్ నుంచి పరిమళాలు అమరావతి నుంచి 5 క్వింటాళ్ల కుంకుమ, ఢిల్లీ నుంచి నవ ధాన్యాలు, భోపాల్ నుంచి పూలు చింధ్వారా నుంచి 4.31 కోట్ల రామ నామాల ప్రతి అయోధ్యకు చేరిక సీతాదేవి కోసం ప్రత్యేకంగా గాజులు 108 అడుగుల అగర్బత్తి, 2,100 కిలోల గంట, 1,100 కిలోల దీపం, బంగారు పాదరక్షలు, 10 అడుగుల ఎత్తైన తాళం, ఒకేసారి 8 దేశాల సమయాలను సూచించే గడియారం రామ మందిరానికి బహుమతులు నేపాల్‌లోని సీతాదేవి జన్మ స్థలి నుంచి 3,000 బహుమతులు 06గం:40ని.. సోమవారం, జనవరి 22 భారీగా వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు అయోధ్య ఈవెంట్ కోసం 22,825 వాహనాలకు పార్కింగ్ సౌకర్యం అయోధ్యలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసుల ఏర్పాట్లు 51 ప్రాంతాల్లో వాహనాలు నిలిపేందుకు ఏర్పాట్లు పూర్తి డ్రోన్లతో గస్తీ నిర్వహణ 06గం:34ని.. సోమవారం, జనవరి 22 ఏడు వేల మంది అతిథులు మతాలకతీతకంగా అయోధ్య వేల మంది గడ్డకట్టే చలిలోనూ దేశం నలుమూలల నుంచి పాదయాత్ర, సైకిళ్లపై, వాహనాలపై అయోధ్యకు చేరిక రామ మందిర ప్రారంభోత్సవానికి 7,000 మంది అతిథులకు ఆహ్వానం ఆహ్వానితుల్లో 506 మంది అత్యంత ప్రముఖులు రామ జన్మభూమి కోసం పోరాటం చేసిన వాళ్లకు ప్రత్యేక ఆహ్వానం సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులకూ ఆహ్వానం.. ఇప్పటికే చాలామంది అయోధ్యకు చేరిక ప్రతిపక్ష నేతలనూ ఆహ్వానించినా.. గైర్హాజరుకే మొగ్గు 06గం:28ని.. సోమవారం, జనవరి 22 రామ మందిర విశేషాలు.. రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ శుక్రవారం కళ్లకు వస్త్రంతో ఉన్న విగ్రహం బాహ్య ప్రపంచానికి దర్శనం ఆలయంలోకి తూర్పు ద్వారం నుంచి ప్రవేశించి దక్షిణ ద్వారం గుండా బయటకు రావాల్సి ఉంటుంది మూడు అంతస్థుల్లో ఆలయ నిర్మాణం ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి భక్తులు తూర్పువైపు నుంచి 32 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. ఆలయాన్ని సంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు ఉంటుంది. 161 అడుగుల ఎత్తు ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తు.. మొత్తం 392 స్తంభాలు, 44 గేట్లు 06గం:22ని.. సోమవారం, జనవరి 22 ముహూర్తం ఎప్పుడంటే.. అభిజిల్లగ్నంలో బాలరాముడిని ప్రతిష్టించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1 గంటకు ముగింపు ప్రాణ ప్రతిష్ఠకు వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా పూజాది కార్యక్రమాలు 16వ తేదీన ప్రారంభం.. ఆదివారంతో ముగింపు 06గం:15ని.. సోమవారం, జనవరి 22 అంతా రామమయం రామ నామ స్మరణతో మారుమోగుతున్న భారత్ దేశ, విదేశాల్లోని ఆలయాల్లో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకను వీక్షణ పవిత్రోత్సవం అనంతరం దేదీప్యోమానంగా అయోధ్య వాషింగ్టన్ డీసీ, పారిస్ నుంచి సిడ్నీదాకా అనేక ఆలయాల్లో ఓ పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ. దాదాపు 60 దేశాల్లో అయోధ్య ప్రాణప్రతిష్ట వేడుక కార్యక్రమాలు 06గం:12ని.. సోమవారం, జనవరి 22 అల అయోధ్యాపురములో.. అపురూప మందిరం నేడే ఆవిష్కృతం ఉత్తర ప్రదేశ్ అయోధ్య నగరంలో కొలువుదీరనున్న రామయ్య మధ్యాహ్నం 12.20 నుంచి 1 గంట మధ్య ముహూర్తం సర్వాంగ సుందరంగా నగరం ముస్తాబు ప్రాణ ప్రతిష్ఠ చేయనున్న ప్రధాని ఇప్పటికే చేరుకున్న ప్రముఖులు భారీ భద్రతా ఏర్పాట్లు రామ నామ స్మరణతో మార్మోగుతున్న ఊరూవాడా 06:00.. సోమవారం, జనవరి 22 తెలుగు రాష్ట్రాల నుంచి.. అయోధ్య రాముడికి తెలుగు రాష్ట్రాల నుంచి కానుకలు తిరుమల శ్రీవారి తరఫున లక్ష లడ్డూలు సిరిసిల్ల నుంచి సీతమమ్మకు చీర కానుక హైదరాబాద్ నుంచి 1265 కేజీల లడ్డూ హైదరాబాద్ నుంచి అయోధ్య రామయ్యకు ఎనిమిదడుగుల ముత్యాల గజమాల.. అందించనున్న చినజీయర్‌స్వామి -
అంతా రామమయం
కడప కల్చరల్: కడప నగరంలో శ్రీరామ శోభాయాత్ర దిగ్విజయంగా సాగింది. అయోధ్య ఐక్యతా వేదిక ఆధ్వర్యంలో 8 గంటలపాటు కొనసాగిన ఈ యాత్ర రాత్రి 10 గంటలకు ముగింపు వేదిక వద్దకు చేరుకుంది.ఆద్యంతం కళారూపాల ప్రదర్శనలతో అట్టహాసంగా సాగింది. ధార్మిక సంస్థలు అడుగడుగునా మంచినీరు, కూల్‌డ్రింక్స్, అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేశాయి. అయోధ్య ఆలయంలో సోమవారం శ్రీ బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టించనున్న సందర్భంగా ఆదివారం కడప నగరంలో శ్రీరామ శోభాయాత్ర పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ తదితర ధార్మిక సంఘాలతోపాటు పలు దేవాలయాల నిర్వాహక కమిటీ సభ్యులు, భక్తులు, భజన బృందాలు, అర్చక సంస్థలు, హిందూ సంఘాల ప్రతినిధులు దాదాపు 30 వేల మంది ర్యాలీలో పాల్గొన్నారు. ► ఉదయం 7.30 గంటలకు చిన్నచౌకులోని శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి శ్రీరామ శోభాయాత్ర ప్రారంభమైంది. నగర మేయర్ సురేష్‌బాబు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్లు భక్తులతో నిండిపోయాయి.18 అడుగుల భారీ శ్రీరాముని విగ్రహాన్ని ప్రత్యేక రథంలో ఏర్పాటు చేశారు. ర్యాలీలో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాహుబలి హనుమంతుడు, దేవతామూర్తుల వేషధారణలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. డీజే సౌండ్ సిస్టమ్‌తో భక్తిగీతాలకు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు నృత్యాలు చేయడం విశేషం. బాలరాముని చిత్రం ఆశారేఖ ఫౌండేషన్ చైర్మన్ నెమలిదిన్నె నాగవేణి బృందం స్థానిక హరిత టూరిజం హోటల్ ప్రాంగణంలో రూపొందించిన బాలరాముని రంగుల చిత్రం యాత్రలో పాల్గొన్న భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వైవీయూలో చిత్రకళను అభ్యసించిన విద్యార్థి కల్యాణ్ ఈ చిత్రాన్ని గంటసేపట్లో తీర్చిదిద్దారు. నేటి కార్యక్రమాలు సోమవారం హౌసింగ్‌బోర్డు రామాలయం వద్ద ఉదయం 6 గంటలకు శ్రీరామ హోమం, శ్రీరామలక్ష్మణ సీతా ఆంజనేయుల విగ్రహాలకు అభిషేకాలు నిర్వహిస్తారు. అయోధ్యలో జరిగే రామప్రతిష్టను ఆలయంలో స్క్రీన్ ఏర్పాటు చేసి లైవ్‌లో భక్తులు చూసే అవకాశం కల్పిస్తున్నారు. అదేరోజు సాయంత్రం పాలకొండపై శ్రీరామ అఖండ దివ్యజ్యోతిని వెలిగించనున్నారు. -
బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానం అందిన క్రికెటర్లు వీరే..
రేపు (జనవరి 22) అయోధ్యలో జరిగే బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెట్‌కు సంబంధించి కూడా పలువురు దిగ్గజాలకు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందిన వారిలో దిగ్గజ క్రికెటర్, భారతరత్న అవార్డు గ్రహీత సచిన్ టెండుల్కర్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, ఎంఎస్ ధోని, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ ఉన్నారు. వీరితో పాటు టీమిండియా మాజీ ఆటగాళ్లు, ఎంపీలు హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అయోధ్యను సందర్శించనున్నారు. భారత మహిళల క్రికెట్‌కు సంబంధించి మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌లకు ఆహ్వానం అందింది. ఆహ్వానం అందిన వారిలో దాదాపుగా అందరూ కుటుంబసమేతంగా అయోధ్యకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత భారత జట్టు సభ్యులైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్నప్పటికీ.. జనవరి 22న ప్రాక్టీస్‌ను పక్కకు పెట్టి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భాగం కానున్నట్లు తెలుస్తుంది. వీరు మరికొంతమంది క్రికెట్ ప్రముఖులతో కలిసి ప్రత్యేక విమానంలో అయోధ్యకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఇందు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని సమాచారం. కాగా, భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు చెందిన చాలా మంది ప్రముఖులు రేపు బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరుగనుంది. ఈ కార్యక్రమం కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రామ నామ జపంతో అయోధ్య నగరం మారుమోగిపోతోంది. -
Ayodhya Ram Mandir: పుణ్యంతోపాటు పన్ను ఆదా! ఎలాగంటే..
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జనవరి 22న వైభవంగా జరగబోతోంది. ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఎంతోగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్యాక్స్ పేయర్స్ పుణ్యంతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను ఆదా చేసుకునే మార్గం ఇక్కడ ఉంది. పన్ను చెల్లింపుదారులు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా రామమందిరానికి నగదు విరాళం అందించవచ్చు. 2020 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ అయోధ్యలో రామమందిర నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. ఈ ట్రస్ట్‌లో 15 మంది ట్రస్టీలు ఉన్నారు. ట్రస్ట్ వెబ్సైట్ ప్రకారం.. ఆలయ పునరుద్ధరణ, మరమ్మతుల నిమిత్తం ఇచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర (PAN:AAZTS6197B)ను చారిత్రక ప్రాముఖ్యత, పూజా స్థలంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిందని, మందిర పునర్నిర్మాణం/మరమ్మతు కోసం ఇచ్చే విరాళాలు ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 80G (2)(b) కింద పన్ను మినహాయింపునకు అర్హమైనవని వెబ్సైట్ పేర్కొంది. -
Hema Malini As Sita Pics: అయోధ్యలో ‘సీత’గా ఆకట్టుకున్న హేమా మాలిని
-
సెలవు ఇవ్వండి.. సీజేఐకి లేఖ
లక్నో: అయోధ్యలోని రామమందిర ప్రతిష్ఠాపన వేడుకను వీక్షించేందుకు జనవరి 22న కోర్టులకు సెలవు ఇవ్వాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ చారిత్రక సందర్భాన్ని గుర్తించడానికి తగిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నట్లు బార్ కౌన్సిల్ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా లేఖలో పేర్కొన్నారు. ఈ అభ్యర్థనను అత్యంత సానుభూతితో పరిగణించాలని సీజేఐని కోరారు. "అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేడుకలు, దేశవ్యాప్తంగా జరిగే ఇతర సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనడానికి కోర్టు సిబ్బందికి సెలవు రోజు అవసరం అవుతోంది." అని బార్ కౌన్సిల్ ఛైర్మన్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా అన్నారు. తక్షణ విచారణ అవసరమయ్యే అంశాన్ని ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా సర్దుబాటు చేయవచ్చు లేదా తదుపరి రోజుకు రీషెడ్యూల్ చేయవచ్చని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సాధువులు, ప్రముఖులతో సహా 7,000 మందికి పైగా ప్రజలు ఈ వేడుకలకు హాజరవనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వివిధ దేశాల నుండి దాదాపు 100 మంది ప్రతినిధులు పాల్గొంటారు. ఇదీ చదవండి: Ayodhya Ram Mandir: అయోధ్యలో కలశ పూజ -
అయోద్యలో రామమందిర ప్రారంభానికి ముందు.. హైకోర్టులో పిటిషన్
చారిత్రక నగరం అయోధ్యలోని భవ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సమయం సమీపిస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనవరి 22న జరిగే రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ అలహాబాద్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన భోలా దాస్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి శంకరాచార్యులు లేవనెత్తిన అభ్యంతరాలను తన పిటిషన్లో ప్రస్తావించారు. ప్రస్తుతం పుష్క మాసం నడుస్తుందని.. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ మాసంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించరాదని తెలిపారు. శ్రీరాముని ఆలయం ఇంకా నిర్మాణ దశలోనే ఉందని.. నిర్మాణంలో ఉన్న ఆలయంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టించడం సనాతన సంప్రదాయానికి విరుద్ధమని పేర్కొన్నారు. అంతేగాక రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసం అధికార బీజేపీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఆరోపించారు. చదవండి: ఆయోధ్యలో మోదీ.. ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి? ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 22న అయోధ్యలో శ్రీ రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహ ప్రతిష్ఠాపన చేయనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం పాల్గొంటున్నారు. ప్రాణ ప్రతిష్ఠపై శంకరాచార్యులు అభ్యంతరం తెలిపారు. ఆలయం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది.. అసంపూర్తిగా ఉన్న ఆలయంలో ఎలాంటి దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు’ అని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు అయోధ్య రామమందిరంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 22న జరిగే ఈ మహా వేడుకకు దేశ విదేశాల నుంచి వేలాది మంది విశిష్ట అతిథులు హాజరు కాబోతున్నారు. బాలరాముడి ప్రతిష్టాపనకు సంబంధించిన సంప్రదాయ క్రతువులు మంగళవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ప్రాణప్రతిష్ట దాకా నిరంతరాయంగా కొనసాగుతాయని అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. -
రామ మందిర అనుష్ఠాన కార్యక్రమం ప్రారంభం.. మోదీ భావోద్వేగం
లక్నో: అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ముందు ప్రత్యేక అనుష్ఠాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. నేటి నుంచి 11 రోజులపాటు జరిగే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ చారిత్రక శుభకరమైన సందర్భం తన హయాంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. రామాలయ కార్యక్రమానికి ప్రజలందరి ఆశీస్సులను కోరారు. "రామ మందిరం ప్రాణ ప్రతిష్ట'కు ఇంకా 11 రోజులు మాత్రమే మిగిలి ఉంది. సంప్రోక్షణ సమయంలో భారతదేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించేందుకే దేవుడు నన్ను సృష్టించాడు. దీనిని దృష్టిలో ఉంచుకుని నేను ఈ రోజు నుండి 11 రోజుల పాటు ప్రత్యేక పూజను ప్రారంభిస్తున్నాను." అని ప్రధాని మోదీ చెప్పారు. 'ఎప్పటి నుంచో ఎదురుచూసిన ఈ సమయంలో మనోభావాలను వ్యక్తీకరించడం కష్టంగా ఉంది. నేను భావోద్వేగానికి లోనయ్యాను. నా జీవితంలో మొదటిసారిగా నేను అలాంటి భావాలను తెలుసుకుంటున్నాను" అని ప్రధాని మోదీ చెప్పారు. అటు.. 'ప్రాణ్ ప్రతిష్ట' వేడుకకు సంబంధించిన గ్రంథాలలో వివరించిన కఠినమైన మార్గదర్శకాలను ప్రధాని మోదీ అనుసరిస్తారని అధికారులు తెలిపారు. అయోధ్యలో జనవరి 22న రామాలయ ప్రారంభోత్సవం జరుగుతుంది. అందుకు 11 రోజుల నుంచే ప్రత్యేకమైన కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభమవుతాయి. ఇదీ చదవండి: రామ మందిర ప్రతిష్టాపన.. ఆ మూడు రాష్ట్రాల్లో 'డ్రై డే' -
ఉద్ధవ్ థాక్రేపై అయోధ్య రామమందిర ప్రధాన పూజారి ఫైర్
లక్నో: అయోధ్యలో జనవరి 22న జరిగే ఆలయ ప్రతిష్ఠాపన వేడుకలకు ఆహ్వానం అందలేదన్న శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రేపై శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ మండిపడ్డారు. ఆలయ మహా సంప్రోక్షణకు శ్రీరాముని భక్తులకు మాత్రమే ఆహ్వానాలు అందజేశామని తెలిపారు. రాముని పేరు చెప్పుకుని ప్రతిపక్షాలే రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. రామున్ని నమ్మినవారే ప్రస్తుతం అధికారంలో ఉన్నారని అన్నారు. "రాముని భక్తులకు మాత్రమే ఆహ్వానాలు అందుతాయి. రాముని పేరు మీద బీజేపీ రాజకీయం చేస్తున్నారని చెప్పడం పూర్తిగా తప్పు. మన ప్రధానిని ప్రతిచోటా గౌరవిస్తారు. ఆయన తన హయాంలో ఎనలేని కృషి చేశారు. రాజకీయాలు కాదు.. ఇది ఆయన భక్తి” అని ఆచార్య సత్యేంద్ర దాస్ అన్నారు. రామ మందిర ప్రారంభ వేడుకలను బీజేపీ రాజకీయం చేస్తుందని శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ఇటీవల ఆరోపించారు. తమ పార్టీ ఎన్నికల్లో రాముడిని తమ అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆచార్య సత్యేంద్ర దాస్.. సంజయ్ రౌత్, ఉద్ధవ్ థాక్రేపై విరుచుకుపడ్డారు. రాముని పేరు ఎవరు వాడుకుంటున్నారో? తెలుసుకోవాలని ప్రశ్నించారు. రామ మందిర ప్రతిష్ఠాపనకు తనకు ఆహ్వానం అందకపోవడంపై థాక్రే బీజేపీని విమర్శించారు. మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చవద్దని అన్నారు. ఒకే పార్టీ చుట్టూ తిరగకూడదని చెప్పారు. రామాలయం ప్రారంభోత్సవం పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. మందిర నిర్మాణం కోసం తన తండ్రి బాల్ థాక్రే చేసిన పోరాటాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇటీవల రామాలయ వేడుక ఆహ్వానాన్ని సీపీఐ కార్యదర్శి సీతారాం ఏచూరి తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి.. కార్యకర్తలకు కేజ్రీవాల్ పిలుపు -
రామ మందిర విరాళాల పేరిట నకిలీ క్యూఆర్ కోడ్
లక్నో: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం పేరిట దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. మందిర నిర్మాణానికి భక్తుల నుంచి విరాళాలు వసూలు చేస్తున్నామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో నకిలీ క్యూఆర్ కోడ్లు వెలుగులోకి వచ్చాయి. వీటిని గుర్తించిన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. ఈ కుంభకోణానికి గురికావద్దని ప్రజలను కోరింది. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర అయోధ్య పేరిట ఓ సోషల్ మీడియా పేజ్‌ను దుండగులు క్రియేట్ చేశారు. ఇందులో పోస్టు చేసిన క్యూఆర్ కోడ్‌తో రామ మందిర నిర్మాణం పేరుతో నిధులను అందించమని వినియోగదారులను కోరుతున్నట్లు గుర్తించామని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ తెలిపారు. ప్రజలు ఈ మోసానికి గురికావద్దని కోరారు. "మీకు చేతనైనంత విరాళం ఇవ్వండి. డైరీలో మీ పేరు, నంబర్ నమోదు చేయబడుతుంది. ఆలయం పూర్తయిన తర్వాత, మీ అందరినీ అయోధ్యకు ఆహ్వానిస్తారు. నేను ఉన్నాను. అయోధ్యలోనే ఉన్నాను." అని రామాలయం పేరుతో విరాళాలు కోరిన వ్యక్తి కోరాడు. దీనిపై స్పందించిన వీహెచ్‌పీ.. ఇలాంటి మోసాల్లో బాధితులు కావద్దని ప్రజలకు తెలిపారు. ఇదీ చదవండి: Ayodhya Airport: అయోధ్య విమానాశ్రయం విశేషాలివే -
రాముడే బీజేపీ ఎన్నికల అభ్యర్థి!: రౌత్
ముంబై: అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవాన్ని బీజేపీ పూర్తిగా రాజకీయమయం చేస్తోందని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ఆలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఆహా్వనంపై రౌత్ స్పందించారు. ‘‘ శ్రీరాముని పేరును బీజేపీ తన రాజకీయాలకు విపరీతంగా వాడేసుకుంది. అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్నీ బీజేపీ ఎంతో రాజకీయ చేసింది. తమ ఎన్నికల అభ్యర్థి శ్రీరామచంద్రుడే అని బీజేపీ ప్రకటించడం ఒక్కటే మిగిలిపోయింది. జనవరి 22న జరిగేది బీజేపీ కార్యక్రమం. ఆ రోజు జరిగేది ఎలా చూసినా జాతీయ కార్యక్రమం కాబోదు. రాజకీయాలతో బీజేపీ రాముడిని కిడ్నాప్ చేసింది’’ అని వ్యాఖ్యానించారు. మరి శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే ఆ కార్యక్రమానికి వెళ్తారుగా అని మీడియా ప్రశ్నించగా ‘‘అవును. కానీ బీజేపీ ఆధ్వర్యంలో జరిగే తతంగం అంతా ముగిశాక అసలు కార్యక్రమంలో ఉద్ధవ్ పాల్గొంటారు’’ అని బదులిచ్చారు. -
ముగ్గురు రాముళ్లు... ఒకరికి ప్రాణ ప్రతిష్ట... ఎంపిక నేడు!
లక్నో: అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించే రాముని విగ్రహాన్ని నేడు ఎంపిక చేయనున్నారు. విగ్రహాన్ని ఎంపిక చేయడానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సమావేశంలో నేడు ఓటింగ్ జరుగుతుంది. ప్రత్యేక శిల్పులు రూపొందించిన మూడు నమూనాల్లో ఒక విగ్రహాన్ని ఎంపిక చేయనున్నారు. ఎక్కువ ఓట్లు పొందిన అత్యుత్తమ విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. నేడు జరగనున్న ఓటింగ్‌లో బాలరాముని మూడు విగ్రహాలను సమర్పిస్తారు. ఇందుకు 51 అంగుళాలు ఉన్న ఐదేళ్ల రాముని విగ్రహాలను శిల్పులు రూపొందించినట్లు ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. బాల రాముని దైవత్వం కళ్లకు కట్టినట్లు కనిపించే విగ్రహాన్ని ఎంపిక చేస్తామని ఆయన అన్నారు. జనవరి 22న జరగనున్న పట్టాభిషేక మహోత్సవానికి తేదీ సమీపిస్తున్న తరుణంలో రామజన్మభూమి మార్గం, ఆలయ సముదాయంలో జరుగుతున్న నిర్మాణ పనులను శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా పరిశీలించారు. నిర్మాణం వేగంగా పూర్తి చేయడానికి కంటే కూడా నాణ్యతపైనే దృష్టి పెట్టామని మిశ్రా తెలిపారు. ఏడు రోజుల పాటు జరిగే పవిత్రోత్సవం జనవరి 16న ప్రాయశ్చిత్త కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. ఈ వేడుకలో బాలరాముని విగ్రహం ఊరేగింపు ఉంటుంది. ఆచార స్నానాలు, పూజలు, అగ్ని ఆచారాలు వరుసగా ఉంటాయి. జనవరి 22న, ఉదయం పూజ తరువాత మధ్యాహ్నం పవిత్రమైన మృగశిర నక్షత్రాన బాల రాముడు మందిరంలో కొలువు దీరనున్నాడు. ఇదీ చదవండి: సీఐఎస్ఎఫ్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా నీనా సింగ్ -
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం.. రూ.50000 కోట్ల వ్యాపారం!
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభం 2024 జనవరి 22న జరగనున్నట్లు ఇదివరకే అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ద్వారా ఏకంగా రూ. 50000 కోట్ల వ్యాపారం జరగనున్నట్లు సీఏఐటీ (CAIT) అంచనా వేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జనవరి 22న శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి అతిరథ మహారధులు, అశేష భక్త జనం వెల్లువెత్తుతారు. దీంతో తప్పకుండా రూ. వేల కోట్ల బిజినెస్ జరుగుతుందని 'ట్రేడ్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్' (సీఏఐటీ) భావిస్తోంది. అయోధ్య రాముడు కొలువుదీరిన రోజున.. వ్యాపారులు మాత్రమే కాకుండా కళాకారుకులు కూడా భారీగా లాభపడే అవకాశం ఉందని CAIT సెక్రటరీ జనరల్ 'ప్రవీణ్ ఖండేల్వాల్' వెల్లడించారు. ఇదీ చదవండి: అయోధ్య ఎయిర్‌పోర్టుకి ఎవరి పేరు పెడుతున్నారో తెలుసా? విశ్వహిందూ పరిషత్ పిలుపు మేరకు జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా శ్రీరామ మందిర ప్రారంభోత్సవం వరకు ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ప్రత్యేక వస్త్ర ఉత్పత్తులు, లాకెట్లు, కీ చైన్లు, రామ దర్బార్ చిత్రాలు, రామ మందిరం నమూనాలు, శ్రీరామ ధ్వజ, శ్రీరామ అంగవస్త్రం మొదలైనవి అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. శ్రీరామ మందిర నమూనాలకు డిమాండ్ ఇందులో ముఖ్యంగా శ్రీరామ మందిర నమూనాలకు అధిక డిమాండ్ ఉందని.. దీనిని దృష్టిలో ఉంచుకుని కొందరు వీటిని హార్డ్‌బోర్డ్, పైన్‌వుడ్, కలప మొదలైన వాటితో విభిన్న సైజుల్లో తయారు చేశారు. ఈ మోడల్లను తయారు చేయడంలో పెద్ద సంఖ్యలో మహిళలు ఉపాధి పొందుతున్నారని వాణిజ్య సంఘం నాయకులు వెల్లడించారు. పెద్ద ఎత్తున అయోధ్యకు తరలి వచ్చే భక్తులు ప్రత్యేక వస్త్రాలు ధరించడానికి ఆసక్తి చూపుతారనే ఆలోచనతో కుర్తాలు, టీ-షర్టులను అందుబాటులో ఉంచనున్నారు. వీటిపైన శ్రీరామ మందిర నమూనాలు ముద్రించి ఉంటారని తెలుస్తోంది. జనవరి 22న దేశవ్యాప్తంగా దీపాలు వెలిగించాలని ఇప్పటికే పిలుపునివ్వడంతో మట్టి దీపాలకు, రంగోలిలో ఉపయోగించే వివిధ రంగులకు, అలంకరణ పూలు, ఎలక్ట్రికల్ దీపాల వంటి వస్తువులకు విపరీతమైన గిరాకీ ఉంటుందని వాణిజ్య సంఘం సీనియర్ సభ్యులు తెలిపారు. ఇవి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా హోర్డింగ్‌లు, పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలు, స్టిక్కర్లు మొదలైన ప్రచార సామగ్రి తయారీదారులు కూడా గణనీయమైన లాభాలను పొందనున్నారు. ఇదీ చదవండి: పనిచేయకుండా రూ.830 కోట్ల సంపాదిస్తున్నాడు - ఎలా అంటే? వస్తువులు, కరపత్రాల బిజినెల్ పక్కన పెడితే.. రామ మందిర ప్రారంభోత్సవ సమయంలో దేశవ్యాప్తంగా శ్రీరామ మందిరానికి సంబంధించిన పాటలు పెద్ద సంఖ్యలో కంపోజ్ చేస్తారు. దీని వల్ల కంపోజర్స్, సింగర్స్ మాత్రమే కాకుండా ఆర్కెస్ట్రా పార్టీలు కూడా శ్రీరామ ఆలయానికి సంబంధించిన కార్యక్రమాలకు నిర్వహించి పెద్ద ఎత్తున లాభపడే లాభపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
‘దేవాలయాలు.. ప్రభుత్వ విధి కాదు’ కాంగ్రెస్ ఎంపీ విమర్శలు
అయోధ్యలో జనవరి 22న ఘనంగా జరగనున్న రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వేల మంది ప్రజలు, రాజకీయ, సినీ ప్రముఖలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ క్రమంలో రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ మందిర ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందలేని తెలిపారు. మతం అనేది వ్యక్తిగతమైన విశ్వాసమని, దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని అన్నారు. అయితే రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి మీడియా విపరీతమైన ప్రచారం కల్పించడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల నుంచి పక్కదారి పడతాయని తెలిపారు. Was interrogated by the waiting press, wanting to know if I would be going to Ayodhya on January 22. I told them I hadn’t been invited but I saw religion as a personal attribute and not one for political (mis)use. I also pointed out that by making such a major news story of the… pic.twitter.com/LQpybKbT3t — Shashi Tharoor (@ShashiTharoor) December 27, 2023 దేవాలయాలను పర్యవేక్షించడం ప్రభుత్వం విధి కాదని అన్నారు. నిరుద్యోగం, ధర పెరుగదల, ప్రజల సంక్షేమం, దేశ భద్రత మొదలైన వాటిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని తెలిపారు. అయితే మీడియా రామ మందిర ప్రారంభోత్సవం మీద దృష్టి పెట్టడంతో.. దేశంల్లో ఉన్న పలు సమస్యలు పక్కదారి పడతాయని ‘బీజేపీ’ పేరు ఎత్తకుండానే ‘ఎక్స్’ ట్వీటర్ వేదికగా శశి థరూర్ విమర్శలు గుప్పించడం గమనార్హం. చదవండి: ‘పార్లమెంట్ చీకటి గదిలా మారింది’ -
రామ మందిర వేడుకకు మమతా బెనర్జీ దూరం?
కోల్‌కతా: అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రారంభోత్సవానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దూరంగా ఉండనున్నట్లు సమచారం. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి ప్రతినిధిని పంపే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2024లో లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు బీజేపీ ఇప్పటికే ఆహ్వానాలను పంపించింది. దేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో సహా దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేతలకు కేంద్రం ఆహ్వానాలు పంపించింది. ఈ క్రమంలో రామమందిర కార్యక్రమాన్ని లోక్‌సభ ఎన్నికల ప్రచారంగా బీజేపీ వాడుకోనుందని టీఎంసీ ఆరోపిస్తోంది. అటు.. రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని సీతారాం ఏచూరి తిరస్కరించారు. జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ లు హాజరు కానున్నారు. వీరితో పాటు దాదాపు 6,000 మందికిపైగా హాజరయ్యే అవకాశం ఉంది. ఇదీ చదవండి: మోదీ యూట్యూబ్ సబ్స్రైబర్లు 2 కోట్లు -
అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి ప్రపంచంలోనే అతిపెద్ద తాళం!
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాకు చెందిన సత్యప్రకాశ్ అనే తాళాలు తయారు చేసే వ్యక్తి, అతని భార్య కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద తాళాన్ని తయారు చేశారు. అంతేకాదు ఆ తాళం 30 కిలోల బరువున్న తాళం చెవితో తెరుచుకుంటుంది. పైగా సుమారు రూ. 2 లక్షలు ఖరీదు చేసే ఈ తాళం పై రాముడి చిత్రం ఉంటుందని అంటున్నారు. అయితే దీన్ని వాళ్లు అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరానికి అంకితం చేయనున్నారు. (చదవండి: 60 మిలియన్లకు కోవిడ్ కేసులు..మృతుల సంఖ్య 8 లక్షలకుపైనే!) ఈ మేరకు ఆ వ్యక్తి 10 అడుగుల పొడవు 400 కిలోల బరువు ఉండే ఆ తాళాన్ని తయారు చేయడానికి ఆరు నెలలు పట్టిందన్నాడు. అంతేకాదు తాళం తుప్పు పట్టకుండా ఉండేందుకు స్టీల్ స్క్రాప్ సీటు కూడా ఉంటుందని తెలిపాడు. అయితే ఈ లాక్‌ని క్షేత్ర స్థాయిలో పూర్తి చేయడానికి ఇంకా కొంత నిధులు అవసరం అవుతాయని, పైగా ఆర్థిక సాయం నిమిత్తం ప్రజలను అభ్యర్థించినట్లు కూడా వెల్లడించాడు. అంతేకాదు ఈ కళను ప్రోత్సహించడానికి ప్రభుత్వ సహకారం అవసరం అంటున్నాడు. తాను ఈ తాళాన్ని అప్పు చేసి మరీ తయారు చేశానని చెప్పాడు. అంతేకాదు సత్యప్రకాశ్ గతేడాది ప్రారంభంలో 300 కిలోల తాళాన్ని తయారు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాను తయారు చేసిన తాళాలను రిపబ్లిక్ పరేడ్‌లో చేర్చాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. అంతేకాదు తాను తయారు చేసిన తాళానికి గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. (చదవండి: అక్కడ ప్రజలు టీతోపాటు టీ కప్పులను కూడా తినేస్తారట!) -
నా ఇంటికొచ్చి నన్నే బెదిరిస్తారా? మాజీ సీఎం
బెంగళూరు: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సేకరిస్తున్న విరాళాలు వివాదాస్పదమవుతున్నాయి. శాంతియుతంగా సేకరించాల్సిన విరాళాలను బెదిరింపులకు పాల్పడుతూ.. ఇవ్వని వారిపై దాడి చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. అలాంటి పరిస్థితి తాను ఎదుర్కొన్నట్లు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు. తన ఇంటికి వచ్చి తననే బెదిరించారని తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. రామ మందిరం పేరుతో కొందరు బెదిరించి విరాళాలు వసూలు చేస్తున్నారని కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ఆరోపణలు చేశారు. తాను కూడా ఒక బాధితుడినేనని తెలిపారు. ఓ మహిళతోపాటు మరో ఇద్దరు తన ఇంటికి వచ్చారని చెప్పారు. తాను విరాళం ఎందుకు ఇవ్వడం లేదని బెదిరించారని వాపోయారు. అసలు ఆమె ఎవరు..? మా ఇంటికి వచ్చి నన్ను అడిగే అధికారం ఆమెకు ఎవరు ఇచ్చారు..? అని ప్రశ్నించారు. ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతూ విరాళాలు సేకరించడం సరికాదని పేర్కొన్నారు. రామమందిర నిర్మాణానికి విరాళాలు సేకరించడంపై మాత్రం తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కుమారస్వామి స్పష్టం చేశారు. తాను కూడా విరాళం ఇస్తాను. మా పార్టీ నాయకులు చాలా మంది ఇచ్చారు. అయితే విరాళాల వసూళ్లలో పారదర్శకత ఎక్కడ ఉంది? అని కుమారస్వామి ప్రశ్నించారు. ఇంటింటికొచ్చి అడిగే అనుమతి ఎవరిచ్చారని నిలదీశారు. ‘రామ మందిరం హిందువుల భక్తిమనోభావాలకు సంబంధించిన అంశం. అయితే దాని పేరుతో కొనసాగుతున్న విభజనపై నేను వ్యతిరేకం’’ అని కుమారుస్వామి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ వారిని నాజీలుగా పేర్కొన్నారు. జర్మనీలో హిట్లర్ చేసిన మాదిరి దేశంలో ఆర్ఎస్ఎస్ చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వానికి బాధ్యత ఉండదా అని ప్రశ్నించారు. విశ్వ హిందూ పరిషత్‌ను ఒక్కటే కోరుతున్నా.. డొనేషన్స్ వసూలు చేసే వాళ్లు నిజాయితీగా ఉండేలా చూడండి అని కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. -
జన భాగస్వామ్యంతో అయోధ్య మందిరం
అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం ఎట్టకేలకు సాకారం కాబో తోంది. ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. అత్యంత ఉన్నతమైన నిర్మాణ విలువలతో మరో రెండేళ్లలో ఈ ఆలయ నిర్మాణం పూర్తి కానుంది. శ్రీరాముడు వనవాసం చేసింది 14 సంవత్సరాలైతే.. అయో ధ్యలోని రామ్ లల్లా 28 ఏళ్లకుపైగా గుడార వాసం చేశారు. శ్రీరాముడి కోసం నిర్మిస్తున్న ఈ ఆలయం అఖండ భారతదేశంలోని హిందువుల చైతన్యానికి, స్వాభిమానానికి కూడా ప్రతీకగా నిలిచిపోనుంది. ఈ ఆలయ నిర్మాణానికి వెయ్యి కోట్ల రూపాయలకుపైగా ఖర్చు కానుంది. దేశంలోని ప్రతి ఒక్క హిందువుకూ ఈ ఆలయ నిర్మాణంలో భాగం అయ్యే హక్కును దృష్టిలో ఉంచుకుని విరా ళాలు సేకరించే కార్యక్రమం మొదలైంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విశ్వహిందూ పరిషత్ పూర్తి చేయనుంది. విరాళాలు స్వీకరించేందుకు వీహెచ్‌పీ కార్య కర్తలు ఇంటింటికీ వెళ్లనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 15 నుంచి 31 వరకు ఈ విరాళాల స్వీకరణ జరుగుతుంది. హిందు వులందరూ ఆలయ నిర్మాణంలో భాగం అయ్యేలా కనీస విరాళం 10 రూపాయలుగా నిర్ణయించారు. ప్రజలు ఇచ్చే విరా ళాలను అత్యంత పారదర్శకంగా ట్రస్టుకు జమ చేస్తారు. రాముడు పుట్టింది అయోధ్యలోనే. రాముడు అవతారం చాలించిన తర్వాత హిందూరాజులు ఈ ప్రదేశాన్ని పాలిం చారు. తదనంతర కాలంలో ముస్లింలు ఈ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి దండయాత్రలు చేశారు. అయోధ్యలోని రాముని ఆలయాన్ని ధ్వంసం చేస్తే హిందువుల మనోబలం దెబ్బతీసినట్లేనని భావించిన బాబర్ సైన్యాధిపతి మీర్ బాకీ 1528లో అక్కడ ఉన్న ఆలయాన్ని కూల్చి ఆ శిథిలాలపైనే మూడు గుమ్మటాలు నిర్మించాడు. ఇది ఉన్న కొండపేరు రామ్ కోట్. దీనిని బట్టే ఇది శ్రీరాముడి జన్మస్థానం అని స్పష్టమవు తోంది. ఆ తర్వాత మూడు గుమ్మటాల కూల్చివేత, ఆలయ నిర్మాణం కోసం విశ్వ హిందూ పరిషత్ చేసిన, చేస్తున్న అలు పెరుగని పోరాటం అంతా ఒక అద్భుత చరిత్ర. 1990లో మొదటి కరసేవ జరిగినప్పుడు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 11 వేల మంది కరసేవకులు ఆ కార్య క్రమంలో పాల్గొనగా, వీరిలో 2 వేల మంది మహిళలు. చాలా మంది వెయ్యి కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి అయోధ్య చేరుకున్నారు. ఎల్కే అడ్వాణీ, అశోక్ సింఘాల్ వంటి ఎందరో ప్రముఖులు రాముని ఆలయం కోసం దేశవ్యాప్తంగా తిరిగి ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు. భారతదేశానికి అతిపెద్ద సమస్య అయోధ్య రామ మందిర నిర్మాణమేనని దశాబ్దాలుగా ఎంతో మంది అభివర్ణిస్తూ వచ్చారు. హిందువులు రాత్రికి రాత్రే గుడి కట్టేస్తారని కూడా కొందరు ప్రచారం చేశారు. అలా చేస్తే ప్రపంచ దేశాల ముందు భారత్ పరువుపోతుందంటూ ఇంకొందరు చర్చలు లేవనె త్తారు. అయితే రాముని మందిర నిర్మాణం ఎటువంటి వివా దాలకు, భవిష్యత్ లిటిగేషన్లకు తావులేకుండా వైభవోపేతంగా జరుగుతుందని అయోధ్యలో ఎన్నో ఏళ్లుగా రాతి శిలలు చెక్కు తున్న వారి దగ్గరి నుంచి సాధువులు, సంతుల వరకు అంతా విశ్వసించారు. వారు నమ్మినట్లుగానే ఈ వ్యవహారం 492 ఏళ్ల తర్వాత వివాదాలకు తావివ్వకుండా పరిష్కారం అయ్యింది. ఎటువంటి హింస, రక్తపాతాలు లేకుండానే తుది నిర్ణయం వెలువడింది. ఆ తర్వాత కూడా దేశంలో ఎటువంటి ఘర్షణలు చోటుచేసుకోలేదు. శాంతియుత వాతావరణంలో ఆలయ నిర్మాణం గురించి దేశం చర్చించుకుంటోంది. ఒకప్పుడు ఈ సమస్య పరిష్కారం గురించి ఆలోచించిన చాలామంది.. నిజమైన పరిష్కారం లభించిన రోజు దేశవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసు కుంటుందని, హింసకూ ఆస్కారం ఉంటుందని భావించారు. కానీ, అందుకు భిన్నమైన వాతావరణం ఈ రోజు ఉంది. ఇన్నేళ్ల పాటు ఇంతటి ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలోను, ఇప్పుడు దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించి ఆలయ నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్లడంలోనూ వీహెచ్‌పీ పోషించిన పాత్ర చిరస్మరణీయం. బలమైన నాయకత్వంతో పాటు విలువలతో కూడిన ఆలోచనలు, వాటికి తగ్గ ఆచరణ, దేశవ్యాప్తంగా అంద రినీ కదిలించగలిగేంత సమర్థత ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యమ వుతాయి. వీహెచ్‌పీ సంస్థ పరంగానూ, కరసేవకుల పరం గానూ మెచ్చుకోదగ్గ రీతిలో వ్యవహరించిందని చెప్పాలి. అయోధ్యలో నిర్మించేది కేవలం ఆలయం మాత్రమే కాదు. అది రాముడికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం, న్యాయం చేయడం. దాదాపు మూడు దశాబ్దాలుగా గుడారానికే పరిమి తమైన రాముడికి సముచిత గౌరవం ఇవ్వడం. హిందువుల మనోబలాన్ని దెబ్బతీయాలని ఆనాడు ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారు. ఆ భావన తప్పు అని రుజువు చేయడం. నిజాన్ని పూడ్చిపెట్టినా అది ఎప్పుడో ఒకప్పుడు బయట పడుతుందని చాటి చెప్పడం. అఖండ భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా హిందువుల్లో చైతన్యం, స్ఫూర్తి నింపడం. -పురిఘళ్ల రఘురామ్ వ్యాసకర్త బీజేపీ సీనియర్ నాయకులు, ఢిల్లీ -
అయోధ్యకు వెళ్తా.. అక్కడికి మాత్రం వెళ్లను
న్యూఢిల్లీ: ఆగస్టు 5న అయోధ్యలో జరిగే రామ మందిర పునాది కార్యక్రమానికి వచ్చే ఆహ్వానితుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతి అయోధ్యకు చెందిన రామ్ జన్మభూమి న్యాస్, ప్రధాని కార్యాలయం (పీఎంఓ) ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. 'కరోనా వైరస్ మహమ్మారి మధ్య అయోధ్యలో జరిగే కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోడీ, ఇతరుల ఆరోగ్యం గురించి తాను ఆందోళన చెందుతున్నానంటూ' ఉమాభారతి ట్వీట్ చేశారు. (150 నదుల జలాలతో అయోధ్యకు..) కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీకి చెందిన మరికొందరు ముఖ్యనేతలకు కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిన వార్తలు విన్న తర్వాత ఆమె ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. అయితే భోపాల్ నుంచి యూపీకి రైళ్లో వెళ్తానని అనేక మంది ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని సరయూ నది తీరంలోనే ఉంటానని.. భూమిపూజ జరిగిన చోటు నుంచి అందరూ వెళ్లిపోయిన తర్వాత భూమిపూజ స్థలానికి వెళ్తానని ఆమె స్పష్టం చేశారు. -
రాంమందిర నిర్మాణంపై శివసేన కీలక వ్యాఖ్యలు
ముంబై : అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని బీజేపీ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటోందని శివసేన ఆరోపించింది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో రామ మందిర నిర్మాణానికి భూమిపూజ చేపడుతున్నారని దుయ్యబట్టింది. కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న సమయంలో రానున్న మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే భూమిపూజ నిర్వహిస్తున్నారని ఆరోపించింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మందిర నిర్మాణంతో పాటు అభివృద్ది పనులను హడావిడిగా చేపట్టారని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం ఆరోపించింది. ఆగస్ట్ 5న అయోధ్యలో నిర్వహించే భూమిపూజకు మందిర నిర్మాణ ఉద్యమంతో మమేకమైన కీలక వ్యక్తులను ఆహ్వానించాలని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే ఈ కార్యక్రమానికి కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా కేవలం 200 మందినే అనుతిస్తారు. చదవండి : టార్గెట్ మహారాష్ట్ర : ప్లాన్ అమలు చేయండి -
అయోధ్యలో తొలిసారిగా మోదీ..
అయోధ్య: రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదానికి కేంద్రబిందువైన అయోధ్యలో నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టాక తొలిసారి పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అయోధ్యలో జరిగిన మెగార్యాలీలో ప్రసంగిస్తూ.. ప్రజల విశ్వాసానికి ఉగ్రవాదం నుంచి ముప్పు పొంచి ఉందని, మన ప్రజల విశ్వాసాన్ని తాను కాపాడుతానని ప్రతిన బూనారు. ‘ఇది శ్రీరాముడి నేల. ఇది ఆత్మగౌరవానికి ప్రతీక అయిన నేల. గత ఐదేళ్లలో ఇక్కడి ఆత్మవిశ్వాసమే దేశమంతా విస్తరించింది. మేం 130 కోట్ల ప్రజల చేతులను ఏకం చేశాం. ఆ శక్తితో నవభారత స్వప్నం సాకారం చేసే దిశగా వడివడిగా సాగుతున్నాం’ అని పేర్కొన్నారు. ‘అది ఎస్పీ అయినా, బీఎస్పీ అయినా, కాంగ్రెస్ అయినా వాటి స్వభావం ఒక్కటే. బెహెన్జీ (బీఎస్పీ అధినేత్రి మాయావతి) అంబేద్కర్ సిద్ధాంతాలు ప్రవచిస్తారు. కానీ, అందుకు పూర్తి విరుద్ధంగా పనిచేస్తారు. ఎస్పీ కూడా లోహియా సిద్ధాంతాలను ప్రవచిస్తుంది. కానీ తన హయాంలో యూపీలో శాంతిభద్రతలను ధ్వంసం చేసింది’ అని మోదీ అన్నారు. అయితే, ప్రధానిగా అయోధ్య పర్యటనకు తొలిసారి వస్తున్నప్పికీ.. ఇక్కడి తాత్కాలిక రామమందిరాన్ని కానీ, హనుమాన్ గార్హి ఆలయాన్ని కానీ ఆయన సందర్శించే అవకాశం కనిపించడం లేదు. -
మందిర నిర్మాణానికి ఆర్డినెన్స్ అప్పుడే..
-
మందిర నిర్మాణానికి ఆర్డినెన్స్ అప్పుడే..
న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణంపై న్యాయ ప్రక్రియ పూర్తయిన అనంతరమే ఎన్డీఏ ప్రభుత్వం ఈ దిశగా ఆర్డినెన్స్ తీసుకువస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నూతన సంవత్సరం తొలిరోజున ప్రధాని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ వ్యవహారంపై న్యాయ ప్రక్రియ నెమ్మదించేలా కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ పరిధిలో ఈ అంశానికి పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశాన్ని నాలుగు తరాల పాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ పలు కుంభకోణాల్లో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. ఆర్థిక అవకతవకలతో బెయిల్ మీద ఆ పార్టీ అగ్రనేతలున్నారని ఎద్దేవా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఊర్జిత్ నిష్ర్కమణ ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారని చెప్పారు. గత ఆరేడు నెలలుగా ఆయన తనను రిలీవ్ చేయాలని కోరుతున్నారని, చివరికి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసుకున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఊర్జిత్ రాజీనామా వ్యవహారంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, ఆర్బీఐ గవర్నర్‌గా ఆయన తన విధులను సమర్ధంగా నిర్వహించారని ప్రశంసించారు. కూటమి వర్సెస్ ప్రజలు 2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలు తమకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలు మహాకూటమికి, ప్రజలకు మధ్య జరుగుతున్న పోరుగా మోదీ అభివర్ణించారు. ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలే తనకు కొండంత అండగా నిలుస్తాయన్నారు. మెరుపు దాడులపై ఉత్తర్వులు.. పాక్ భూభాగంలో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసేందుకు నిర్వహించిన మెరుపు దాడులకు తాను స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశానని చెప్పుకొచ్చారు. దాడులు చేపట్టే క్రమంలో మీరు విజయవంతమైనా, విఫలమైనా దాని గురించి ఆలోచించకుండా సూర్యోదయం అయ్యే సమయానికి తిరిగి చేరుకోవాలని సైన్యానికి సూచించానన్నారు. ఆపరేషన్‌ను అతితక్కువ సమయంలో పూర్తిచేయాలని, దాన్ని ఎక్కువసేపు కొనసాగించరాదని చెప్పానన్నారు. ఈ ఆపరేషన్ గురించి వివరించే క్రమంలో మోదీ కొంత భావోద్వేగానికి లోనైనట్టు కనిపించారు. ట్రిపుల్ తలాక్‌పై నిషేధం ఎందుకంటే.. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌ను తమ ప్రభుత్వం తీసుకువచ్చిందని, రాజ్యాంగ పరిధిలో ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపుతామని బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచామని ప్రధాని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్‌ను పెద్దసంఖ్యలో ముస్లిం దేశాలు నిషేధించాయని చెప్పారు. పాకిస్తాన్లో సైతం ట్రిపుల్ తలాక్‌ను నిషేధించారన్నారు. ఇది ఎలాంటి మతానికి, విశ్వాసానికి సంబంధించిన అంశం కాదని, కేవలం లింగ సమానత్వం, సామాజిక న్యాయంతో ముడిపడిన వ్యవహారమని చెప్పారు. శబరిమలపై విస్తృత చర్చ.. దేశంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలన్నది భారత్ అభిమతం..దేశంలో కొన్ని దేవాలయాలకు ప్రత్యేక సంప్రదాయాలున్నాయని శబరిమల ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని పేర్కొన్నారు. కొన్ని ఆలయాల్లో పురుషులకు ప్రవేశం లేదని గుర్తుచేశారు. శబరిమల విషయంలో సుప్రీం కోర్టులో మహిళా న్యాయమూర్తి కొన్ని వ్యాఖ్యలు చేశారని చెబుతూ, ఆయా అభిప్రాయాలను వ్యక్తం చేసే వారికి రాజకీయ కోణాలతో ముడిపెట్టరాదన్నారు. ఓ మహిళగా ఆమె చేసిన సూచనలపైనా చర్చ జరగాలన్నారు. -
అవును.. బాబ్రీ మసీదును నేనే కూల్చమన్నా
బాబ్రీ మసీదును కూల్చేందుకు కరసేవకులను ప్రేరేపించినది తానేనని బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి మరోసారి స్పష్టం చేశారు. తనతో పాటు లక్షలాది మంది కరసేవకులు బాబ్రీ మసీదు నిర్మాణాన్ని కూల్చారన్నారు. రాముడి కోసం తాను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని, ఉరిశిక్ష అనుభవించడానికి కూడా సిద్ధమని, కానీ అబద్ధాలు మాత్రం చెప్పబోనని అన్నారు. రామ మందిరం నిర్మాణం కోసం పోరాడుతూనే ఉంటానని చెప్పారు. అక్కడ మసీదు ఎప్పుడూ లేదని, కేవలం శిథిల స్థితిలో ఓ నిర్మాణం మాత్రమే ఉండేదని.. దాన్ని మాత్రమే తాము కూల్చామని ఆయన తెలిపారు. 1992లో భారీసంఖ్యలో వచ్చిన కరసేవకులు బాబ్రీమసీదును కూల్చిన ఘటనతో బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీకి ఎలాంటి సంబంధం లేదని శుక్రవారం నాడు రామ్ విలాస్ వేదాంతి చెప్పిన సంగతి తెలిసిందే. అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో వేదాంతి సహా మరో 12 మంది నిందితులుగా ఉన్నారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, రాజమాత విజయరాజె సింధియాల మీద మోపిన ఆరోపణలన్నీ అవాస్తవమని వేదాంతి చెబుతున్నారు. అద్వానీ, జోషి, ఉమాభారతి లాంటివాళ్లంతా నిర్దోషులని, కూల్చివేత వెనుక కుట్ర అంటూ ఏమీ లేదని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి కూడా అన్నారు. ఇక సుప్రీంకోర్టులో కేసు ఒక సర్వసాధారణ తతంగం మాత్రమేనని, విచారణ పూర్తయిన తర్వాత బీజేపీ అగ్రనాయకులంతా నిర్దోషులుగా బయటపడటం ఖాయమని చెప్పారు. తమమీద పన్నిన కుట్రలన్నీ విఫలమయ్యాయని ఆరోజు వారు గర్వంగా చెప్పుకొంటారని ధీమా వ్యక్తం చేశారు.


