అయోధ్యకు వెళ్తా.. అక్కడికి మాత్రం వెళ్లను | Concerned about PM Modi's Health: Uma Bharti | Sakshi
Sakshi News home page

అయోధ్యకు వెళ్తా.. అక్కడికి మాత్రం వెళ్లను

Aug 3 2020 10:43 AM | Updated on Aug 3 2020 6:10 PM

Concerned about PM Modi's Health: Uma Bharti - Sakshi

న్యూఢిల్లీ: ఆగస్టు 5న అయోధ్యలో జరిగే రామ మందిర పునాది కార్యక్రమానికి వచ్చే ఆహ్వానితుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతి అయోధ్యకు చెందిన రామ్ జన్మభూమి న్యాస్, ప్రధాని కార్యాలయం (పీఎంఓ) ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. 'కరోనా వైరస్ మహమ్మారి మధ్య అయోధ్యలో జరిగే కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోడీ, ఇతరుల ఆరోగ్యం గురించి తాను ఆందోళన చెందుతున్నానంటూ' ఉమాభారతి ట్వీట్‌ చేశారు. (150 నదుల జలాలతో అయోధ్యకు..)

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీకి చెందిన మరికొందరు ముఖ్యనేతలకు కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిన వార్తలు విన్న తర్వాత ఆమె ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. అయితే భోపాల్ నుంచి యూపీకి రైళ్లో వెళ్తానని అనేక మంది ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని సరయూ నది తీరంలోనే ఉంటానని.. భూమిపూజ జరిగిన చోటు నుంచి అందరూ వెళ్లిపోయిన తర్వాత భూమిపూజ స్థలానికి వెళ్తానని ఆమె స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement