అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం.. రూ.50000 కోట్ల వ్యాపారం!

Ayodhya Ram Mandir Generate Worth Rs 50000 Crore in 2024 January - Sakshi

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభం 2024 జనవరి 22న జరగనున్నట్లు ఇదివరకే అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ద్వారా ఏకంగా రూ. 50000 కోట్ల వ్యాపారం జరగనున్నట్లు సీఏఐటీ (CAIT) అంచనా వేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

జనవరి 22న శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి అతిరథ మహారధులు, అశేష భక్త జనం వెల్లువెత్తుతారు. దీంతో తప్పకుండా రూ. వేల కోట్ల బిజినెస్ జరుగుతుందని 'ట్రేడ్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్' (సీఏఐటీ) భావిస్తోంది. అయోధ్య రాముడు కొలువుదీరిన రోజున.. వ్యాపారులు మాత్రమే కాకుండా కళాకారుకులు కూడా భారీగా లాభపడే అవకాశం ఉందని CAIT సెక్రటరీ జనరల్ 'ప్రవీణ్ ఖండేల్వాల్' వెల్లడించారు.

ఇదీ చదవండి: అయోధ్య ఎయిర్‌పోర్టుకి ఎవరి పేరు పెడుతున్నారో తెలుసా?

విశ్వహిందూ పరిషత్ పిలుపు మేరకు జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా శ్రీరామ మందిర ప్రారంభోత్సవం వరకు ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ప్రత్యేక వస్త్ర ఉత్పత్తులు, లాకెట్లు, కీ చైన్లు, రామ దర్బార్ చిత్రాలు, రామ మందిరం నమూనాలు, శ్రీరామ ధ్వజ, శ్రీరామ అంగవస్త్రం మొదలైనవి అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.

శ్రీరామ మందిర నమూనాలకు డిమాండ్
ఇందులో ముఖ్యంగా శ్రీరామ మందిర నమూనాలకు అధిక డిమాండ్ ఉందని.. దీనిని దృష్టిలో ఉంచుకుని కొందరు వీటిని హార్డ్‌బోర్డ్, పైన్‌వుడ్, కలప మొదలైన వాటితో విభిన్న సైజుల్లో తయారు చేశారు. ఈ మోడల్‌లను తయారు చేయడంలో పెద్ద సంఖ్యలో మహిళలు ఉపాధి పొందుతున్నారని వాణిజ్య సంఘం నాయకులు వెల్లడించారు.

పెద్ద ఎత్తున అయోధ్యకు తరలి వచ్చే భక్తులు ప్రత్యేక వస్త్రాలు ధరించడానికి ఆసక్తి చూపుతారనే ఆలోచనతో కుర్తాలు, టీ-షర్టులను అందుబాటులో ఉంచనున్నారు. వీటిపైన శ్రీరామ మందిర నమూనాలు ముద్రించి ఉంటారని తెలుస్తోంది.

జనవరి 22న దేశవ్యాప్తంగా దీపాలు వెలిగించాలని ఇప్పటికే పిలుపునివ్వడంతో మట్టి దీపాలకు, రంగోలిలో ఉపయోగించే వివిధ రంగులకు, అలంకరణ పూలు, ఎలక్ట్రికల్ దీపాల వంటి వస్తువులకు విపరీతమైన గిరాకీ ఉంటుందని వాణిజ్య సంఘం సీనియర్ సభ్యులు తెలిపారు. ఇవి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా హోర్డింగ్‌లు, పోస్టర్‌లు, బ్యానర్‌లు, కరపత్రాలు, స్టిక్కర్‌లు మొదలైన ప్రచార సామగ్రి తయారీదారులు కూడా గణనీయమైన లాభాలను పొందనున్నారు.

ఇదీ చదవండి: పనిచేయకుండా రూ.830 కోట్ల సంపాదిస్తున్నాడు - ఎలా అంటే?

వస్తువులు, కరపత్రాల బిజినెల్ పక్కన పెడితే.. రామ మందిర ప్రారంభోత్సవ సమయంలో దేశవ్యాప్తంగా శ్రీరామ మందిరానికి సంబంధించిన పాటలు పెద్ద సంఖ్యలో కంపోజ్ చేస్తారు. దీని వల్ల కంపోజర్స్, సింగర్స్ మాత్రమే కాకుండా ఆర్కెస్ట్రా పార్టీలు కూడా శ్రీరామ ఆలయానికి సంబంధించిన కార్యక్రమాలకు నిర్వహించి పెద్ద ఎత్తున లాభపడే లాభపడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top