ప్రాణ ప్రతిష్టలో ఉపయోగించిన టన్నుల కొద్ది పువ్వులను ఏం చేస్తున్నారో తెలుసా! | Ram Mandir Pran Pratishtha: Civic Body Producing Incense Sticks From Flower offerings | Sakshi
Sakshi News home page

ప్రాణ ప్రతిష్టలో ఉపయోగించిన టన్నుల కొద్ది పువ్వులను ఏం చేస్తున్నారో తెలుసా!

Published Tue, Jan 23 2024 4:41 PM | Last Updated on Tue, Jan 23 2024 4:45 PM

Ram Mandir Pran Pratishtha: Civic Body Producing Incense Sticks From Flower offerings - Sakshi

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే అందుకోసం అయోధ్య ఎంతో సుందరంగా ముస్తాబయ్యింది. ముఖ్యంగా పూలతో చేసిన అలంకరణ చూస్తే రెండు కళ్లు చాలవు అన్నంత మనోహరంగా ఉంది. భవ్య రామాలయ ప్రారంభోత్సవం కోసం టన్నుల కొద్ది పుష్పలను వివిధ రాష్ట్రాలను తెప్పించి మరీ ఉపయోగించారు. అయితే ప్రాణ ప్రతిష్ట మహోత్సవం పూర్తైన తర్వాత ఆ పూలు వృధాగా అయ్యే పోకూడదని అయోధ్య మున్సిపాలిటీ అధికారులు నిర్ణయించారు. అందుకోసం వారు ఏంచేస్తున్నారో తెలుసా!

బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుక  కోసం ఉత్తరప్రదేశ్‌ నుంచి సుమారు పది టన్నుల పూజలు తెప్పించారు. ముఖ్యంగా బాలరాముడి గర్భలయాన్ని అలకరించేందుకే చెన్నై నుంచి ఏకంగా 20 రకాల పూలను మూడువేల కిలోలు తెప్పించారు. ఈ భవ్య రామాలయాన్ని క్రిస్తానియం, గెర్బెరా, ఆర్కడ్లు, ప్రోమేథియం, బర్డ్‌ ఆఫ్‌ ప్యారడైజ్‌ తదితర పూలతో ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. అలాగే బెంగళూరు, పూణే, లక్నో, ఢిల్లీ వంటి ఇతర నగరాల నుంచి కూడా ఈ కత్రువు కోసం పలు రకాల పూలను తెప్పించారు.

ఈ ప్రాణప్రతిష్ట క్రతవు ముగిసిన తదనంతరం అయోధ్య ధామ్‌లో అన్ని దేవాలయాలల్లోని సుమారు 9 మెట్రిక్‌ టన్నుల పుష్పల వ్యర్థాలు వచ్చాయి. అయితే వీటన్నింటిని ఈ రీసైకిల్‌ చేయాలని భావిస్తున్నారు అధికారులు. ఈ పుష్పాలను రీసైకిల్‌ చేసి అగరుబత్తీలను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రతను కాపాడుకునేలా ఇలా వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది అయోధ్య మున్సిపల్‌ కార్పొరేషన్‌. అందులో భాగంగానే అయోధ్యధామ్‌లోని అన్ని దేవాలయాల్లో వినియోగించిన పువ్వలన్నింటిని ఇలా ప్రాసెంసింగ్‌ చేసి ధూప్‌ స్టిక్‌లు ఉత్పత్తి చేసే ఓ ప్రాజెక్టును కూడా ప్రారంభించింది అయోధ్య మున్సిపల్‌ కార్పోరేషన్‌.

ఇక అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట క్రతువు కూడా ముగిసింది. ఇక ఆ తతంగంలో వినియోగించిన పువ్వలన్నింటితో కలిపి ఆ ప్రక్రియ కాస్త కంగా 2.3 మెట్రిక టన్నులకు పెరిగింది. ప్రసతుతం మున్సిపాలటీ సిబ్బంది ఆ పువ్వలన్నింటిని ప్రాసెస్‌ చేస్‌ ధూప్‌ కర్రలను తయారు చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు మున్సిపాలిటీ అధికారులు వెల్లడించారు.  

(చదవండి:  అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట: అసలేంటీ ప్రాణ ప్రతిష్ట? ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement