Prana Pratishtha: అసలేంటీ ప్రాణ ప్రతిష్ట? | Ayodhya Ram Mandir Inauguration: What Is Pran Pratishtha, Do Know About Why And How They Do It - Sakshi
Sakshi News home page

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట: అసలేంటీ ప్రాణ ప్రతిష్ట? ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?

Published Mon, Jan 22 2024 12:56 PM

Ram Mandir In Ayodhya: What Is Pran Pratishtha - Sakshi

అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఈ నెల 16 నుంచే ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా రామ జన్మభూమి ట్రస్ట్‌ ప్రాయశ్చిత్తం, సరయూనది ఒడ్డున దశవిద్‌ స్నానం, విష్ణుపూజ, గోదాన్‌, రామ్‌ లల్లా విగ్రహంతో నగరమంతా ఊరేగింపు తదితార కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇవాళే మరికొద్దిసేపటిలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరగనుంది. పైగా కొన్ని రాష్ట్రాల్లో ఈ రోజు సెలవు రోజుగా ప్రకటించాయి కూడా. దేశమంతా ఈ వేడుక నేపథ్యంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇక ఈ మహోత్సవ కార్యక్రమాలు చివరి దశకు చేరుకోనున్నాయి కూడా. ఈ సందర్భంగా అస్సలు ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటీ? ఎందుకని చేస్తారు? ఎలా చేస్తారు తదితరాల గురించి తెలుసుకుందాం!

ప్రాణ ప్రతిష్ట అంటే..
ప్రాణ ప్రతిష్ట అంటే దేవాలంయలో పూజలు క్రతువు చేసేందుకు ముందుగా చేసే ఒక సంప్రదాయం. ప్రాణప్రతిష్ట అంటే అర్థం జీవం ఇవ్వడం. ప్రాణ్‌ అంటే ప్రాణ శక్తి, ప్రతిష్ట అంటే స్థాపన అని అర్థం. ఆ ఆచారంతో దైవాన్ని విగ్రహంలోకి ఆవాహనం చేయడం. ఈ క్రతువు దేవుని విగ్రహాన్ని సజీవంగా చేస్తుంది. ఏ దేవుడి విగ్రహ ప్రతిష్టాపన జరిగినా.. ఈ ఆచారం కచ్చితంగా నిర్వహిస్తారు. వేదాలు, పురాణాల ఆధారంగా చాలా శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ నేపథ్యంలోనే ఈ నెల 16 నుంచి అందుకు సంబంధించిన ప్రాయశ్చిత్తం దగ్గర నుంచి రామ్‌లాల్‌ విగ్రహాన్ని ఊరేగించడం వరకు అన్ని కార్యక్రమాలను రామ జన్మభూమి ట్రస్ట్‌ నిర్వహించింది.

ఆ తరువాత ఆలయ గర్భగుడిని సరయు నది పవిత్ర జలంతో శుద్ధి చేస్తారు. ఆ తర్వాత రాముడి విగ్రహాన్ని ఆలయంలో ఉంచారు. ఈ పూజ ప్రధాన ఉద్దేశ్యం దేవుడిని విగ్రహంలోకి ఆవాహనం చేసి ప్రాణం పోయడం. ఈ తతంగాలతో విగ్రహం లోపల శాశ్వతంగా దేవుని ఉనికి ఉండేలా చేస్తారు. దీంతో ఆ తర్వాత ఆలయంలో జరిగే పూజలు, వ్రతాలు ఆ దేవుడు స్వీకరిస్తాడని నమ్ముతారు. అలాగే ఆయన తమ గోడు విని కోరికలు తీరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేగాదు ప్రజలు విగ్రహాన్ని కేవలం ఓ వస్తువు లేదా రాయిగా చూడరు సాక్షాత్తు ఆ జగదభి రాముడు తమ కోసం ఇక్కడ కొలువుదీరి తమ పూజలు, అర్చనలు స్వీకరిస్తాడని భక్తు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అదీగాక ఇవాళ జరుగుతున్న ఈ వేడకను తిలకించేందుకు సెలబ్రెటీలు, ప్రముఖులే గాక దేశం నలుమూలల నుంచి అయోధ్యకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. 

అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎలా జరుగుతుందంటే..
ముందుగా విగ్రహాన్ని కనీసం ఐదు పవిత్ర నదిజలాలతో స్నానం చేయిస్తారు. ఆ తర్వాత నీరు ధాన్యంతో నిమజ్జనం చేస్తారు. దీంతో విగ్రహంలో పవిత్రత వస్తుందని పురాణ వచనం. ఆ తర్వాత ఆవుపాలతో స్నానం చేసి శుభ్రమైన గుడ్డతో తుడుస్తారు. ఆ తర్వాత కొత్త బట్టలు ధరింపచేస్తారు. ఆచారంలో భాగంగా చందనం అద్దుతారు. ఇక విగ్రహాన్ని వాస్తు ప్రకారం సరైన దిశలో పెట్టడం జరగుతుంది. సాధారణంగా సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కున పెట్టడం జరుగుతుంది. వేదాలు, పూర్ణాహుతి శ్లోకాలతో పుష్పాలు, ధూపం, నైవేధ్యం వంటివి దేవుడికి సమర్పించడం జరగుతుంది. అయితే ఈ వేడుక మాత్రం 84 సెకన్లు మాత్రమే ఉంటుంది. ఈ ఘట్టం మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగుతుంది. ముందుగా ఆయన విగ్రహం కళ్లకు గంతలు తొలగించి, చిన్న బంగారు కర్రతో కాజల్‌ని బాలారాముని పూయడం జరుగుతుంది. ఆ తర్వాత అద్దంలో రాముడికి ముఖాన్ని చూపుతారు. చివరిగా 108 దీపాలతో మహా ఆరతి ఇచ్చి ఈ పవిత్రోత్సవాన్ని ముగించడం జరగుతుంది. 

గుడ్డతో ఎందుకు కప్పి ఉంచుతారంటే..
ప్రాణ ప్రతిష్టకు ముందు విగ్రహ స్వచ్ఛతను కాపాడుకునేందుకు ముఖాన్ని కప్పి ఉంచడం జరుగుతుంది. శాస్త్రోక్తంగా ప్రాణ ప్రతిష్ట పూజ కార్యక్రమాలు జరిపేంత వరకు అలా గుడ్డతో కప్పి ఉంచుతారు. ఇలా దేవి నవరాత్రలప్పుడూ, గణపతి నవరాత్రుల్లో కూడా చేయడం మనం గమనించే ఉంటాం. అందులోనూ 500 నిరీక్షణ తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఈ పవిత్రోత్సవాన్ని మరింత కట్టుదిట్టమైన ఆచార వ్యవహారాలతో వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా కన్నుల పండగగా జరుపుతోంది రామజన్మభూమి ట్రస్ట్‌. దీన్ని పురుస్కరించుకుని రాష్ట్రాలలోని ప్రతి రామాలయంలో ఘనంగా పూజలు, అన్నదానాలు నిర్వహిస్తున్నారు. దేశమంతటా ఎటూ చూసిన రామనామ స్మరణతో మారుమ్రోగిపోతోంది. 

(చదవండి: బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకను ఓ కళాకారుడి ఆర్ట్‌లో ఇలా చూడండి!)

Advertisement
 
Advertisement
 
Advertisement