అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకి జనవరి 22 ముహూర్తం..? | Ayodhya: Grand Ram Temple Set For Inauguration On January 22 | Sakshi
Sakshi News home page

అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకి జనవరి 22 ముహూర్తం..?

Published Wed, Sep 27 2023 8:21 AM | Last Updated on Wed, Sep 27 2023 8:31 AM

Ayodhya: Grand Ram Temple Set For Inauguration On January 22 - Sakshi

న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం వచ్చే ఏడాది జనవరి 20–24 మధ్య ఉంటుందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా చెప్పారు. మూడంతస్తుల్లో నిర్మాణం జరుపుకుంటున్న రామాలయంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌ డిసెంబర్‌ చివరి నాటికి సిద్ధమైపోతుందని వెల్లడించారు. జనవరి 22న ఆలయంలో శ్రీరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ట జరిపే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని చెప్పారు.  జనవరి 20–24 మధ్య ఆలయ ప్రారంభోత్సవానికి ముహూర్తాలు దివ్యంగా ఉన్నాయని ప్రధాని రావడానికి ఏ రోజు వీలవుతుందో అదే రోజు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఆ తేదీని పీఎంఒ కార్యాలయం ఖరారు చేయాల్సి ఉంటుందని తెలిపారు. మంగళవారం ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇచ్చారు. అందులో ఆయన పలు విషయాలు వెల్లడించారు.  
చదవండి: మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement