కొరాపుట్: కొత్త కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టకముందే ఐఏఎస్ అధికారి అన్యదాస్ బదిలీ కావడం ఒడిశాలో చర్చనీయాంశంగా మారింది. నబరంగ్‌పూర్ జిల్లా కలెక్టర్‌గా ఆమెను నియమిస్తూ ప్రభుత్వం తొలుత ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆమె కుర్చీలో కూర్చోకముందే మరో జిల్లాకు బదిలీ అయ్యారు. అర్ధరాత్రి చోటుచేసుకున్న హైడ్రామా చోటుచేసుకోవడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. దీని వెనుక అధికార పార్టీ నాయకుల ఒత్తిడి ఉందన్న ప్రచారం చర్చకు దారితీసింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న అన్యదాస్‌ను నబరంగ్‌పూర్ జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం తొలుత నియమించింది. ఈ మేరకు ఒడిశా ప్రభుత్వం అక్టోబర్ 7, 2026న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, గతంలో ఆమె నబరంగ్‌పూర్ డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో బీజేపీ నాయకులతో వివాదం తలెత్తింది. అప్పట్లో ఆమెకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు జిల్లా బంద్ కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో అన్యదాస్‌ను తిరిగి అదే జిల్లాకు కలెక్టర్‌గా నియమించడంపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో వారి ఒత్తిడి నేపథ్యంలో ప్రభుత్వం ఆమెను నువాపడా జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, నబరంగ్‌పూర్ జిల్లా కలెక్టర్‌గా మధుస్మితను నియమించారు. అసలు అన్యదాస్ నియామకంపై అభ్యంతరాలు ఎందుకు వ్యక్తమయ్యాయి? బాధ్యతలు చేపట్టకముందే బదిలీ చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Bhubaneswar: Odisha Government transfers seven IAS officers. Nabarangpur Collector Dr Maheswar Swain appointed Additional Secretary to CM, while Nuapada Collector Madhusudan Dash is posted as Additional Secretary, GA & PG Department. Anya Das and Madhumita are appointed Collectors of Nabarangpur and Nuapada, respectively. #Odisha #IAS #IASTransfers #Bhubaneswar
— Argus News (@ArgusNews_in) October 7, 2026
ఇది చదవండి: కర్ణాటకలో బిగ్ ట్విస్ట్.. డీకే సంచలన వ్యాఖ్యలు


