చీనాబ్ వంతెనపై ‘అమూల్‌’ కన్ను .. శభాష్‌ అన్న రైల్వే మంత్రి | Amul Celebrates Worlds Highest Railway Chenab Bridge with New ad | Sakshi
Sakshi News home page

చీనాబ్ వంతెనపై ‘అమూల్‌’ కన్ను .. శభాష్‌ అన్న రైల్వే మంత్రి

Jun 9 2025 11:49 AM | Updated on Jun 9 2025 1:47 PM

Amul Celebrates Worlds Highest Railway Chenab Bridge with New ad

న్యూఢిల్లీ: ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌ సమయోచిత ప్రకటనల రూపకల్పనలో ముందుంటుందనే పేరు సంపాదించింది. కాలంతో పాటు చోటుచేసుకుంటున్న పరిస్థితులు, పరిణామాలను తన ప్రకటనల్లో ‘అమూల్‌’ ఎప్పటికప్పుడు జొప్పిస్తుంటుంది. తాజాగా అమూల్‌ ఇటీవలే ప్రధాని ప్రారంభించిన జమ్ముకశ్మీర్‌లోని చీనాబ్‌ వంతెనపై కన్నేసింది. ఇప్పుడు తన కొత్త ప్రకటనకు చీనాబ్‌ వంతెన బ్యాక్‌గ్రౌండ్‌ను వాడేసుకుంది.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన అయిన చీనాబ్ వంతెన ప్రారంభోత్సవ సమయాన అమూల్‌ కంపెనీ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటనలో ‘రైల్’,‘రియలైజ్డ్’ అనే పదాలను కలిపి ‘ఎ డ్రీమ్ రైలైజ్డ్’ అనే చమత్కారమైన పదజాలాన్ని తయారు చేసింది. ప్రకటనలో ట్యాగ్‌లైన్‌గా ‘అముల్, టికెట్ టు గ్రేట్ టేస్ట్’ అని రాసింది.
 

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రకటనను సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు. అలాగే ‘ధన్యవాదాలు అమూల్‌’ అని రాశారు. ఈ  పోస్ట్‌ 408.9కేను మించిన వీక్షణలను దక్కించుకుంది. చీనాబ్ వంతెనను అద్భుతమైన ఇంజనీరింగ్  పనితనంగా పరిగణిస్తున్నారు. దీనిని జూన్ 6న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. చీనాబ్ నదికి 359 మీటర్ల ఎత్తులో ఉన్న 1,315 మీటర్ల పొడవైన ఈ ఉక్కు వంతెనే తీవ్ర భూకంప కార్యకలాపాలను,  అధిక గాలి వేగాన్ని తట్టుకునేలా నిర్మించారు. 

ఇది కూడా చదవండి: గ్రెటా థన్‌బర్గ్‌కు ఘోర అవమానం.. గాజా దారిలో ఇజ్రాయెల్‌ అడ్డగింత

Advertisement
 
Advertisement
Advertisement