గ్రెటా థన్‌బర్గ్‌కు ఘోర అవమానం.. గాజా దారిలో ఇజ్రాయెల్‌ అడ్డగింత | Israeli Commandos Intercept Greta Thunberg Ship | Sakshi
Sakshi News home page

గ్రెటా థన్‌బర్గ్‌కు ఘోర అవమానం.. గాజా దారిలో ఇజ్రాయెల్‌ అడ్డగింత

Jun 9 2025 10:10 AM | Updated on Jun 9 2025 10:57 AM

Israeli Commandos Intercept Greta Thunberg Ship

గాజా: యుద్ధంతో మరుభూమిగా మారుతున్న గాజాపై ఇజ్రాయెల్‌ మరోమారు తన ప్రతాపాన్ని చూపింది. స్వీడిష్ పర్యావరణ కార్యకర్త, ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ పేరుతో ఉద్యమాన్ని ఉద్యమాన్ని నడుపుతున్న గ్రెటా థన్‌బర్గ్‌తో పాటు పలువురిని గాజా స్ట్రిప్‌కు తీసుకువెళుతున్న మానవతా నౌక(హ్యూమానిటేరియన్‌ షిప్‌)ను ఇజ్రాయెల్ కమాండోలు అడ్డుకున్నారు.

ఈ నౌకలో పాలస్తీనా అనుకూల ఫ్రీడమ్ ఫ్లోటిల్లా కూటమి (ఎఫ్‌ఎప్‌సీ)కి  చెందిన కార్యకర్తలలో పాటు యూరోపియన్ పార్లమెంట్ (ఎంఈపీ) సభ్యురాలు రిమా హసన్ కూడా ఉన్నారు. తాజాగా లైఫ్ జాకెట్లు ధరించి, చేతులు పైకెత్తి కూర్చున్న కొందరి ఫోటోను ఇజ్రాయెట్‌ పోస్ట్‌ చేసింది. ఫ్రీడమ్ ఫ్లోటిల్లా సిబ్బందిని ఇజ్రాయెల్ సైన్యం అంతర్జాతీయ జలాల్లో తెల్లవారుజామున అరెస్టు చేసిందని ఇజ్రాయెల్‌ పేర్కొంది. మానవతావాద సమూహాల కూటమి(ఎఫ్‌ఎప్‌సీ)టెలిగ్రామ్ యాప్‌లో మాడ్లీన్‌తో సంబంధం కోల్పోయామని, ప్రయాణికులను ఇజ్రాయెల్ దళాలు కిడ్నాప్ చేశాయని పేర్కొంది.
 

శుక్రవారం సిసిలీ నుంచి బయలుదేరిన ఈ నౌక ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ముందు నుంచి గాజాపై ఇజ్రాయెల్ నావికా దిగ్బంధనను సవాలు చేస్తూ వస్తోంది. అలాగే బాధితులకు సహాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకుందని  ఎఫ్‌ఎప్‌సీ తెలిపింది.  తాజాగా ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ  ఈ నౌకను సెలబ్రిటీల సెల్ఫీ  నౌకగా పేర్కొంది. అది ఇజ్రాయెల్ తీరానికి సురక్షితంగా చేరుకుంటుందని,  ఓడలో ప్రయాణిస్తున్న కార్యకర్తలు ప్రచారం పొందడానికి, మీడియాను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని ఆరోపించింది.

గడచిన రెండు వారాల్లో 1,200కు పైగా సహాయ ట్రక్కులు ఇజ్రాయెల్ నుండి గాజాలోకి ప్రవేశించాయని, గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ గాజాలోని పౌరులకు దాదాపు 11 మిలియన్ల  ఆహారాన్ని పంపిణీ చేసిందని ఇజ్రాయెల్‌ ఒక పోస్టులో పేర్కొంది. మాడ్లీన్ గాజాకు చేరుకోకుండా, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్  ఆదేశించిన దరిమిలా ఈ ఓడను ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంది. గాజాలోని హమాస్ ఉగ్రవాదులకు ఆయుధాలు చేరకుండా నిరోధించడానికే ఇటువంటి చర్యలు చేపడుతున్నామని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇది సహాయం కాదని, ప్రచార స్టంట్ అని, వారి వద్ద 100 పౌండ్ల కంటే తక్కువ విలువచేసే సహాయక సామగ్రి ఉందని, ప్రతిరోజూ గాజాకు పంపిణీ  అవుతున్న దాని కన్నా ఇది చాలా తక్కువ మొత్తం అని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ ప్రతినిధి గై నిర్ మీడియాకు తెలిపారు.

అయితే ఇజ్రాయెల్ చేపట్టిన ఈ సముద్ర దిగ్బంధం చట్టవిరుద్ధమని ఎఫ్‌ఎప్‌సీ పేర్కొంది.గాజాకు చేరుకునేందుకు మేము చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకునే హక్కు ఇజ్రాయెల్‌కు లేదని ఒక ప్రకటనలో తెలిపింది. ఎఫ్‌ఎప్‌సీ నౌక కాన్సైన్స్ గత మేలో మొదటిసారి గాజాకు చేరుకోవడానికి ప్రయత్నించింది. అయితే మాల్టా తీరంలో అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ నౌకపై డ్రోన్ దాడి జరగడంతో ప్రయాణం రద్దయ్యింది.

ఇది కూడా చదవండి: హనీమూన్‌ జంట కేసులో బిగ్‌ ట్విస్ట్.. ప్లాన్‌ ప్రకారమే భార్య.. 

Advertisement
 
Advertisement
Advertisement