నేటి నుంచి ఏరో ఇండియా | Aero India 2025 at Yelahanka Air Force Station in Bengaluru on February 10, 2025 | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఏరో ఇండియా

Feb 10 2025 6:19 AM | Updated on Feb 10 2025 6:19 AM

Aero India 2025 at Yelahanka Air Force Station in Bengaluru on February 10, 2025

మొదటిసారిగా ఎస్‌యూ–57, ఎఫ్‌–35ల విన్యాసాలు 

న్యూఢిల్లీ: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌ షో ‘ఏరో ఇండియా’15వ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు బెంగళూరు సమీప యలహంకలోని ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌ ఇందుకు వేదిక కానుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ప్రారంభించే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఐదో తరం యుద్ధ విమానం రష్యా తయారీ ఎస్‌యూ–57, అమెరికాకు చెందిన ఎఫ్‌–35 లైట్నింగ్‌ 2 ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

 ఈ వివరాలను ఆదివారం రక్షణ శాఖ వెల్లడించింది. మొత్తం 42 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 150 విదేశీ కంపెనీలు సహా మొత్తం 900 ఎగ్జిబిటర్లతో అతిపెద్ద ఏరో ఇండియా కార్యక్రమంగా నిలవనుంది. ఈ ఎడిషన్‌ను ‘ది రన్‌ వే టు ఎ బిలియన్‌ అపార్చునిటీస్‌’అనే ఇతివృత్తంతో చేపట్టినట్లు రక్షణ శాఖ తెలిపింది . ఇందులో 90 వరకు దేశాలు ప్రాతినిథ్యం వహిస్తున్నాయని వివరించింది. సుమారు 30 దేశాల రక్షణ మంత్రులు, వారి ప్రతినిధులతో పాటు మరో 43 దేశాల నుంచి వైమానిక దళాధిపతులు, కార్యదర్శులు హాజరవుతున్నారని తెలిపింది.  

Advertisement
 
Advertisement
Advertisement