కరోనా భారత్: 50 లక్షలు దాటిన కేసులు | 50 Lakhs Coronavirus Cases Mark Crosses In India | Sakshi
Sakshi News home page

కరోనా భారత్: 50 లక్షలు దాటిన కేసులు

Sep 16 2020 9:38 AM | Updated on Sep 16 2020 3:34 PM

50 Lakhs Coronavirus Cases Mark Crosses In India - Sakshi

రోజూ 90 వేలకు పైగా కేసులు నమోదవడంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. అయితే, ఇతర దేశాలతో పోల్చుకుంటే బాధితుల రికవరీ రేటు మెరుగ్గా ఉండటం సానుకూల పరిణామం.

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో రెండో స్థానంలో కొనసాగుతున్న భారత్‌లో వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టడం లేదు. రోజూ 90 వేలకు పైగా కేసులు నమోదవడంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. అయితే, ఇతర దేశాలతో పోల్చుకుంటే బాధితుల రికవరీ రేటు మెరుగ్గా ఉండటం సానుకూల పరిణామం. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 90,123  కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 50,20,360 కు చేరింది. కోవిడ్‌ బాధితుల్లో తాజాగా 1290 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 82,961 కు చేరింది.
(చదవండి: గ్యాంగ్‌స్టర్ దూబే ఆత్మ : ప్రతీకారం తప్పదు)

వైరస్‌ బాధితుల్లో సోమవారం ఒక్కరోజే 82,961 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 39,42,360. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,95,933. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. భారత్‌లో కరోనా రోగుల రికవరీ రేటు 78.53 శాతంగా ఉందని తెలిపింది. మరణాల రేటు 1.63 శాతంగా ఉందని వెల్లడించింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో యాక్టివ్‌ కేసుల రేటు 19.84 శాతంగా ఉందని పేర్కొంది. ఇక గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,16,842 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 5,94,29,115 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని పేర్కొంది.
(చదవండి: హీరో విశాల్ తండ్రి ఫిట్‌నెస్‌ చూస్తే షాకే!)

Advertisement
 
Advertisement
Advertisement