కర్ణాటకలో విషవాయువు లీకేజీ... ఐదుగురి దుర్మరణం | 5 Workers Die Of Asphyxiation At Fish Processing Unit In Karnataka | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో విషవాయువు లీకేజీ... ఐదుగురి దుర్మరణం

Apr 19 2022 6:18 AM | Updated on Apr 19 2022 9:18 AM

5 Workers Die Of Asphyxiation At Fish Processing Unit In Karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో చేపల ప్రాసెసింగ్‌ పరిశ్రమలో విషవాయువు లీకై ఐదుగురు కార్మికులు మరణించారు. శ్రీ ఉల్కా మత్స్య సంస్కరణ కర్మాగారంలో ఈ ప్రమాదం జరిగింది. 20 అడుగుల లోతున్న ట్యాంకు నుంచి చేపలను బయటకు తీసేందుకు ఆదివారం రాత్రి 8 మంది కార్మికులు దిగారు. చేపల వ్యర్థాలను తొలగించేందుకు వాడే విష వాయువు లీకవడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement