చొరబాటుకు యత్నించిన ముగ్గురు పాక్ తీవ్రవాదులు హతం

3 Terrorists Shot Dead In Uri Sector Firing By Pak Post  - Sakshi

శ్రీనగర్: బారాముల్లా ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ సమీపంలో ముగ్గురు పాక్ తీవ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత భూభాగమైన యూరిలోకి చొరబడేందుకు ప్రయత్నించగా భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు, గూఢచారి ఏజెన్సీలు చేసిన జాయింట్ ఆపరేషన్‌లో ముగ్గురూ మృతి చెందినట్లు చినార్ కార్ప్స్  ఇండియన్ ఆర్మీ ఎక్స్(ట్విట్టర్) ద్వారా వెల్లడించింది.

ఇండియన్ ఆర్మీ తెలిపిన వివరాల ప్రకారం బారాముల్లా వద్ద పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ముగ్గురు తీవ్రవాదులు వాస్తవాధీన రేఖను దాటుకుని యురి వైపుగా వస్తుండటాన్ని గమనించి సైనికులు అప్రమత్తమై కాల్పులు జరిపారని దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోగా ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పాకిస్తాన్ దళాలు మాపై కాల్పులు జరపడంతో మరో మృతదేహాన్ని క్యాప్చర్ చేయడం సాధ్యపడలేదని తెలిపారు. 

మూడో మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్తుండగా పాక్ దళాలు కాల్పులు జరపడం 2021లో వాస్తవాధీన రేఖ వద్ద కాల్పులు విరమణకు చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. యురి సెక్టార్‌లో ఇప్పటికీ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. 

ఇది కూడా చదవండి: మాటలు జాగ్రత్త.. విద్వేషాలను రెచ్చగొట్టకూడదు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top