Sakshi News home page

2024 Lok Sabha Polls: దేశంలో ఓటర్ల సంఖ్య @96 కోట్లు

Published Sat, Jan 27 2024 9:29 AM

2024 Lok Sabha Polls 96 Crore Citizens In India - Sakshi

సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలో ఓటర్లకు సంబంధించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 96 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులని పేర్కొంది. 2019 నాటికి ఈ సంఖ్య 91.20 కోట్లుగా ఉన్నట్టు ఈసీ వివరాల్లో తెలిపింది. 

కాగా, దేశంలో ఓటర్లకు సంబంధించి ఈసీ వివరాలను వెల్లడించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 96 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులని తెలిపింది. వీరిలో మహిళలు 47 కోట్ల మంది ఉన్నారని ఈసీ స్పష్టంచేసింది. అదేవిధంగా మొత్తం ఓటర్లలో 1.73 కోట్ల మందికి పైగా 18-19 ఏండ్ల వయసు ఉన్నవారేనని తెలిపింది. 

ఇక, ఎన్నికల నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా 12 లక్షల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, దాదాపు 1.5 కోట్ల మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించనున్నట్లు ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం పంపిన ఓ లేఖ ప్రకారం.. దేశంలో 1951లో 17.32 కోట్ల మంది నమోదిత ఓటర్లు ఉండగా.. 2019 నాటికి ఈ సంఖ్య 91.20 కోట్లకు చేరింది. తొలి లోక్‌సభ ఎన్నికల్లో 45 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. గత పార్లమెంటు ఎన్నికల్లో 67 శాతంగా ఉంది.

Advertisement

What’s your opinion

Advertisement