కాశ్మీర్ : గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారితో కలిసి 20,000 మంది యువత మాదకద్రవ్య రహిత భవిష్యత్తు కోసం ప్రతిజ్ఞ చేశారు "కాశ్మీర్ యువత ప్రేమతో నిండిన హృదయాలను కలిగిన వారు. వారు చైతన్యవంతులు, కేంద్రీకృతమైన వారు, పూర్తి సామర్థ్యం కలిగిన వారు" అని ఏడు సంవత్సరాల తర్వాత కాశ్మీర్ పర్యటించిన సందర్భంగా గురుదేవ్ అన్నారు.
శ్రీనగర్, 11 నవంబర్ 2025: ఏడు సంవత్సరాల తర్వాత, ప్రపంచ మానవతావాది మరియు ఆధ్యాత్మిక గురువు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారు కాశ్మీరుకు విచ్చేశారు. శాంతి, మత సామరస్యం, ఒత్తిడి లేని, హింస లేని మరియు మాదకద్రవ్య రహిత కాశ్మీర్ కు సందేశాన్నిచ్చారు. వేలాది మంది ఈ చారిత్రాత్మక సందర్శన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. గురుదేవ్‌ను జమ్మూ & కాశ్మీర్ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీ శాంత్మనును, IAS స్వాగతించారు.

కాశ్మీర్ యువత ఎదుర్కొంటున్న అత్యవసర సవాళ్లలో ఒకటిగా మాదకద్రవ్యాల దుర్వినియోగం ఉద్భవిస్తున్న తరుణంలో, బక్షి స్టేడియంలో ఆశాజనక మరియు సంకల్పంతో కూడుకొన్న శక్తివంతమైన ప్రతి -ప్రవాహం రూపుదిద్దుకుంది. 50 కళాశాలలు మరియు నాలుగు విశ్వవిద్యాలయాల నుండి 20,000 మందికి పైగా విద్యార్థులు గురుదేవ్ సమక్షంలో ఎడ్యూ యూత్ సమావేశానికి సమావేశమయ్యారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాదకద్రవ్యాల రహిత కాశ్మీర్‌ను సృష్టిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

విద్యార్థులు, సిబ్బంది మరియు ప్రముఖ విద్యావేత్తలను ఉద్దేశించి గురుదేవ్ ఇలా అన్నారు, "కాశ్మీర్ మాదకద్రవ్యాల నుండి విముక్తి పొందేలా మనం చూద్దాము. హింస లేని సమాజం, వ్యాధి లేని శరీరం, గందరగోళం లేని మనస్సు, నిరోధం లేని తెలివితేటలు మరియు దుఃఖం లేని ఆత్మ నా కల. ఇది ప్రతి ఒక్కరి జన్మహక్కు. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వును, మీ నుండి ఎవరూ తీసివేయలేని చిరునవ్వును నేను చూడాలనుకుంటున్నాను. ఇది విద్య యొక్క సంకేతం."
మాదకద్రవ్యాల సమస్యకు శక్తివంతమైన పరిష్కారాన్ని వెల్లడిస్తూ గురుదేవ్ అన్నారు, "దీనికి రహస్యం శ్వాసలో ఉంది. శ్వాసలోని శక్తిని ఉపయోగించడం ద్వారా, ధ్యానం మరియు కొన్ని వ్యాయామాల ద్వారా, మాదకద్రవ్య వ్యసనం నుండి సులభంగా బయటపడవచ్చు."
కాశ్మీర్‌ను ప్రాచీన జ్ఞాన భూమిగా పేర్కొంటూ, గురుదేవ్ ఆధునిక క్వాంటం భౌతిక శాస్త్రం మరియు కాశ్మీర్ శైవ మతంలోని పురాతన గ్రంథం స్పందకారిక మధ్య ఒక ఆకర్షణీయమైన సమాంతరాన్ని గీసారు.“ధ్యానం కాశ్మీర్‌కు పరాయిది కాదు” అని ఆయన అన్నారు. “ఇది కాశ్మీర్ వారసత్వం. ఈ నేల ప్రపంచానికి ధ్యానాన్ని ఇచ్చింది మరియు దీనికి ఏ మత విశ్వాసంతో సంబంధం లేదు. ధ్యానం బుద్దిని చురుకుగా మరియు మనస్సును ఆనందంగా ఉంచుతుంది.”

ఏకత్వం మరియు ఆత్మీయ భావనను ప్రేరేపిస్తూ గురుదేవ్ ఇలా పంచుకున్నారు, "హై ఏక్ నూర్ ఉసి నూర్ కే హై హమ్ సబ్. ఉస్ నూర్ సే జుడ్ గయే తో కోయి పరాయ నహి లగ్తా. సబ్ అప్నే లగ్తే హై. ఇసి కో హమ్ కెహ్తే హై జీవన్ జినే కి కాళా."("మనం ఆ ఒకే వెలుగుకు చెందినవాళ్ళం. మీరు ఆ వెలుగుతో అనుసంధానించబడినప్పుడు, ఎవరూ అపరిచితులు కారు. అందరూ మీకు చెందినవారు. అదే ది ఆర్ట్ ఆఫ్ లివింగ్. )ఆయన ఇంకా ఇలా అన్నాడు, "కాశ్మీరీ యువత మత సామరస్యాన్ని కోరుకుంటుంది. జీవితం చాలా చిన్నది. మొహొబ్బత్ కర్నే కె లియే సమయ్ కుమ్ హై, హమ్ ఝాగ్రే ఝంఝత్ మే క్యోం పడే."ముందుగా, గురుదేవ్ కాశ్మీర్ విశ్వవిద్యాలయం, సెంట్రల్ విశ్వవిద్యాలయం, ఇస్లామిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం మరియు షేర్ - ఇ - కాశ్మీర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల నుండి 7 మంది వైస్ ఛాన్సలర్లను; మరియు కాశ్మీర్‌లోని 30 ప్రముఖ కళాశాలల గౌరవ ప్రిన్సిపాల్‌లను ఉద్దేశించి ప్రసంగించారు. సామాజిక కార్యక్రమాలు మరియు రాష్ట్రంలోని యువత భవిష్యత్తు గురించి చర్చించడానికి ఆయన ప్రముఖ పౌరులను కూడా కలిశారు.
గత కొన్ని నెలలుగా, కాశ్మీర్‌లోని వివిధ కళాశాలల నుండి విద్యార్థులు క్యాంపస్ లో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ యొక్క హ్యాపీనెస్ ప్రోగ్రామ్‌కు హాజరయ్యారు. అక్కడ వారు తమ మనస్సు మరియు భావోద్వేగాలను సంబహభాళించుకోవడానికి ప్రక్రియలను, శ్వాసను ఉపయోగించే శక్తివంతమైన ఒత్తిడి నుండి ఉపశమనాన్నిచ్చే సుదర్శనక్రియను, జీవితంలో సమతుల్యత, శాంతి మరియు ఆనందాన్ని తీసుకువచ్చే సరళమైన కానీ జీవితాన్ని మార్చే జ్ఞానాన్ని నేర్చుకున్నారు. ఇది పూర్తి సామర్థ్యంతో జీవించడానికి వీలు కల్పిస్తుంది.
గురుదేవ్ జమ్మూ కాశ్మీర్ గౌరవనీయ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హాతో సమావేశంతో రోజును ముగించారు. నవంబర్ 12న, గురుదేవ్ శ్రీనగర్ సెంట్రల్ జైలును సందర్శించనున్నారు. అక్కడ ఖైదీలు ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ జైలు కార్యక్రమాలు హాజరవుతున్నారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ జైలు కార్యక్రమం ఖైదీలలో లోతుగా పాతుకుపోయిన ఒత్తిడి, కోపం మరియు అపరాధ భావనను విడుదల చేయడానికి, భావోద్వేగ స్థిరత్వం మరియు సానుకూల ప్రవర్తనను పెంపొందించడానికి సహాయపడుతుంది. చాలా మంది పాల్గొన్నవారు లోతైన అంతర్గత శాంతి, కోపం తగ్గడం మరియు జీవితంపై కొత్త ఆశను నివేదించారు. వ్యక్తిగత పరివర్తనతో పాటు, ఈ చొరవ జైళ్లలో హింసను తగ్గించడంలో మరియు సమాజంలో సజావుగా తిరిగి కలిసిపోవడాన్ని ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది.


