
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణ అంచనాలను తగ్గించిన రిజర్వ్ బ్యాంక్, భవిష్యత్తులో పాలసీ రేట్లను మరింత తగ్గించేందుకు అవకాశాలను తెరిచి ఉంచిందని క్రిసిల్ ఇంటెలిజెన్స్ ఒక నివేదికలో తెలిపింది. అమెరికా టారిఫ్‌లపరమైన అనిశి్చతుల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) ద్వితీయార్థంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి తిరోగమించే రిస్కులు ఉన్నట్లు మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) కూడా పేర్కొందని గుర్తు చేసింది. అయితే, ఇటీవల జీఎస్‌టీ రేట్లను క్రమబదీ్ధకరించడం వల్ల టారిఫ్‌లపరమైన ప్రతికూల ప్రభావం కొంత తగ్గొచ్చని క్రిసిల్ ఇంటెలిజెన్స్ తెలిపింది.
కారి్మక శక్తి అధికంగా ఉండే నిర్దిష్ట రంగాలపై టారిఫ్‌ల ఎఫెక్ట్ గణనీయంగా ఉంటుందని, వాటికి పాలసీపరమైన మద్దతును అందించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణంపరమైన ఆందోళన కొంత తగ్గే అవకాశం ఉందని, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల తగ్గింపు ప్రభావంతో ఆర్‌బీఐ కూడా పాలసీ రేట్లను తగ్గించడానికి కాస్త ఆస్కారం ఉంటుందని వివరించింది. 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను 100 బేసిస్ పాయింట్లు (1%) తగ్గించింది. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నందున, ఎంపీసీ సిఫార్సుల మేరకు, పాలసీ రేట్లను ఆర్‌బీఐ ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్లు, ఏప్రిల్‌లో మరో 25 బేసిస్ పాయింట్లు, జూన్‌లో 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఇది ప్రస్తుతం 5.5 శాతానికి చేరింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న 4 శాతం లోపే కొనసాగుతోంది.