భక్తిశ్రద్ధలతో ఆరుద్ర పూజలు | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో ఆరుద్ర పూజలు

Aug 11 2026 1:48 AM | Updated on Aug 11 2026 1:48 AM

కొత్తకోట రూరల్‌: మండలంలోని కానాయపల్లి స్టేజీ వద్దనున్న శ్రీకోటిలింగేశ్వరదత్త దేవస్థానంలో సోమ వారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తులు స్వయంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆరుద్ర పూజల సందర్భంగా ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement