ఇంకా రిపోర్టు రాలేదు..
ఆశన్‌పల్లిలో పట్టుబడిన 580 బస్తాల రేషన్ బియ్యంపై పలు అనుమానాలు
నారాయణపేట: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. మరికల్ సమీపంలోని శ్రీగణేశ్ రైస్‌మిల్ నుంచి వేయింగ్ చేసిన 580 బస్తాల బియ్యాన్ని చంద్రకల్ బఫర్ గోదాంకు తరలించాల్సి ఉండగా.. దామరగిద్ద మండలం ఆశన్‌పల్లి రైస్‌మిల్ వద్దకు చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. పోవాల్సిన గమ్యస్థానం ఒకటైతే.. లారీ చేరిన చోటు మరొకటి కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు సూత్రధారులెవరు?
చంద్రకల్ బఫర్ గోదాంకు వెళ్లాల్సిన బియ్యం లారీ ఆశన్‌పల్లి రైస్‌మిల్ వద్ద ఎందుకు ఆగింది..? అక్కడికి బియ్యం తరలించాల్సిన అవస రం ఏమొచ్చింది..? లారీకి మార్గమధ్యంలో దారి మళ్లి ంచారా..? లేక ముంద స్తు ప్రణాళికతోనే బి య్యాన్ని మిల్లుకు తరలించారా..? అనే ప్రశ్నలు సివిల్ సప్ల య్ అధికారుల్లోనే త లెత్తడం ఆశ్చర్యంగా ఉందని చెప్పవచ్చు. పట్టుబడిన లా రీ దామరగిద్ద మండలం అయ్యవారిపల్లికి చెందినదిగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. కాగా, రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కొన్నాళ్లుగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆశన్‌పల్లి ఘటనపై అధికారులు లోతు గా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. రేషన్ బియ్యాన్ని మిల్లింగ్ చేసి, తిరిగి వ్యవస్థలోకి చేర్చే రీసైక్లింగ్ దందా జరుగుతోందా.? ఇందులో రైస్‌మిల్లర్లు, డీలర్ల పాత్ర ఏమైనా ఉందా.? ప్రత్యేక వాహనాల ద్వారా బియ్యం మళ్లిస్తున్నారా.? అనే కోణాల్లో విచారణ జరపాల్సి ఉంది.
పంచనామా.. శాంపిల్స్ సేకరణ
లారీలోని బియ్యం బస్తాల లాట్ నంబర్లను అధికారులు పరిశీలించారు. పంచనామా నిర్వహించి.. బియ్యం నమూనాలను పరీక్షలకు పంపినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని చిన్నధర్‌పల్లి గోదాం వద్ద నమూనాలను పరిశీలించగా.. వచ్చిన ఫలితాల ఆధారంగా ఆ బియ్యం ఇటీవలే మిల్లింగ్ చేసినట్లు అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. దీంతో రేషన్ బియ్యం రీసైక్లింగ్ వ్యవహారంపై అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. అయితే దీనిపై అధికారికంగా తుది నిర్ధారణ కావాల్సి ఉంది.
అధికారుల తలోమాట..
రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బియ్యం నమూనా పరీక్షలకు సంబంధించిన రిపోర్టు నారాయణపేట సివిల్ సప్లయ్ టెక్నికల్ అధికారుల ద్వారా దామరగిద్ద పోలీస్‌స్టేషన్, సంబంధిత సివిల్ సప్లయ్ అధికారులకు చేరినట్లు సమాచారం. అయితే రిపోర్టు విషయమై అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా.. తలోమాట చెబుతుండటం దాగుడుమూతలను తలపిస్తోంది. రిపోర్టు తమకు వచ్చిందని దామరగిద్ద ఎస్‌ఐ నరేశ్ చెబుతుండగా.. తమకు ఇంకా అందలేదని డీటీఎఫ్ నాగరాజు, డీఎస్‌ఓ బాలరాజు పేర్కొన డం కొసమెరుపు. దీంతో అసలు రిపోర్టు ఎవరి వద్ద ఉంది.? ఎప్పుడు వచ్చింది.? ఎవరికి అందింది.? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మిల్లర్‌పై ఆరోపణలు..
పట్టుబడిన బియ్యం వ్యవహారంలో సంబంధిత రైస్‌మిల్లర్‌పై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నా యి. రేషన్ డీలర్లతో కుమ్మకై ్క బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై సమగ్ర విచారణ అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆశన్‌పల్లి రైస్‌మిల్‌పై గతంలో వచ్చిన ఆరోపణలు.. తాజాగా పట్టుబడిన 580 బస్తాల బియ్యం వ్యవహారాన్ని కలిపి అధికారులు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
లేబర్ కోడ్‌లను రద్దు చేసేదాక పోరాటం
డీలర్లు, మిల్లర్ కుమ్మక్కుపై ఆరోపణలు
శాంపిల్ రిపోర్టుపై అధికారుల
దాగుడుమూతలు?
సమగ్ర విచారణ జరిపితే
అసలు విషయాలు వెలుగులోకి
దామరగిద్ద మండలం ఆశన్‌పల్లి మిల్లు వద్ద పట్టుబడిన లారీలోని బియ్యం శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించాం. ఇంకా తమకు అధికారికంగా రిపోర్టు రాలేదు. సివిల్ సప్లయ్ ఉన్నతాధికారుల నుంచి నివేదిక రాగానే ఆ రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకుంటాం.
– బాల్‌రాజు, డీఎస్‌ఓ


