తీలేర్ లిఫ్ట్ నుంచి లింక్ కె నాల్‌కు నీటిని విడుదల చే స్తే, పది గ్రామాల చెరువు లు నిండే అవకాశం ఉంది. చెరువులు నిండితే వ్యవసాయ బోరుబావుల్లో భూ గర్భజలమట్టం పెరుగుతుంది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. తాగునీటి అవసరాలనే చూడకుండా, రైతులను ఆదుకునే చర్యలు కూడా చేపట్టాలి.
– కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్, అప్పంపల్లి
అప్రోచ్ కెనాల్‌లో పేరుకుపొయిన పూడికను తీ యకపోవడంతోనే పర్దీపూర్ రిజర్వాయర్ నుంచి సరిపడా నీరు రావడం లేదు. తీలేర్ పంప్ హౌజ్ నుంచి ఒక మోటారుతో నీటిని ఎత్తిపోస్తే, కోయిల్‌సాగర్ నిండటానికి మూడు నెల ల సమయం పడుతోంది. చెరువులను కూడా నింపాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
– శ్రీనివాసులు, రైతు, తీలేర్
అప్రోచ్ కెనాల్‌లో అక్కడక్కడ పూడిక పేరుకుపోయింది. పూడికతీత పనులు చేపట్టి ఉంటే పర్దీపూర్ నుంచి తీలేర్ పంపుహౌజ్‌కు రెండు మోటార్లకు సరిపడా నీరు వచ్చేవి. మూడు రోజుల క్రితం రెండో మోటారును నడిపిస్తే నీరు ముందుకు పారక పైపు పగిలిపోయింది. మరమ్మతు చేయిస్తున్నాం. ప్రస్తుతం ఒక మోటారుతో కోయిల్‌సాగర్‌ను నింపుతున్నాం. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండితే ఆయకట్టుకు సాగునీరు విడుదల చేస్తాం.
– నయిమొద్దీన్, డీఈఈ
●


