‘శోభా’యమానం.. ఆధ్యాత్మిక సాగరం! | - | Sakshi
Sakshi News home page

‘శోభా’యమానం.. ఆధ్యాత్మిక సాగరం!

Sep 23 2026 1:49 AM | Updated on Sep 23 2026 1:49 AM

కనుల పండువగా వినాయక నిమజ్జనోత్సవం

కర్నూలు కల్చరల్‌: గణేష్‌ ఉత్సవాలకు రాష్ట్రంలోనే పేరుగాంచిన కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనం కనుల పండువగా సాగింది. 45వ ఏడాది దాదాపు 1,500 విగ్రహాలతో నిర్వహించిన శోభాయాత్ర భక్తులకు ఆఽధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. కుల మతాలకు అతీతంగా వేడుకకు జనాలు తరలిరావడంతో సర్వమత సౌభ్రాతృత్వం వెల్లివిరిసింది. నిమజ్జనం అర్ధరాత్రి దాటినా కొనసాగింది. తొమ్మిది రోజుల పాటు భక్తులచే విశేష పూజలందుకున్న ప్రథమ పూజితుడైన గణనాఽథుడిని శోభాయాత్రగా వినాయక ఘాట్‌కు తీసుకొచ్చారు. ఓల్డ్‌సిటీలోని రాంబొట్ల ఆలయం వద్ద వివేకానంద యువజన సంఘం ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి నిమజ్జన శోభాయాత్ర పూజను మంత్రి టీజీ భరత్‌, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేష్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి నిర్వహించారు. వినాయక ఘాట్‌లో జ్యోతి ప్రజ్వలన, ధ్వజారోహణ, భరతమాత పూజ, వినాయక పూజలు చేసి కలెక్టరేట్‌ పరిపాలనా విగ్రహా నిమజ్జనాన్ని కర్నూలు పార్లమెంట్‌ సభ్యులు బస్తిపాటి నాగరాజు, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌, శ్రీ గణేశ్‌ మహోత్సవ కేంద్ర సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షులు, గోకరాజు గంగరాజు, రాష్ట్ర కార్యదర్శులు దుర్గా ప్రసాద్‌, గోరంట్ల రమణ, జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగఫణి శాస్త్రి, జిల్లా సంఘటనా కార్యదర్శి రాజేష్‌ ప్రారంభించారు. వినాయక ఘాట్‌తో పాటు నన్నూరు టోల్‌ గేట్‌ సమీపం, ఉల్లిందకొండ గ్రామం సమీపంలోని హెచ్‌ఎన్‌్‌ఎస్‌ఎస్‌ కాలువలో నిమజ్జనం చేపట్టారు.

కమనీయంగా శోభాయాత్ర

ఓల్డ్‌సిటీ రాంబొట్ల ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా నగరం నడి మధ్యన కేసీ కాల్వలో విఘ్నేశ్వరునికి ఘనంగా వీడ్కోలు పలికారు. కేసీ కెనాల్‌కు ఇరువైపుల ఏడు క్రేన్‌లతో నిమజ్జనం చేశారు. జిల్లా కలెక్టర్‌ సిరి మాట్లాడుతూ మనలోని చెడును అణచి వేసి మంచి ఆలోచనలు, మంచి పనులతో సమాజ శ్రేయస్సుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలన్నారు. వినాయక ఘాట్‌లో నిర్వహించిన గంగా హారతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

చిన్నారి సాంస్కృతిక ప్రదర్శన

కర్నూలు వినాయక ఘాట్‌ వద్ద

పండుగ వాతావరణం

వేలాదిగా తరలివచ్చిన భక్తులు

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement