నేతల దోపిడీకి ప్రజలను బలి చేస్తారా? | - | Sakshi
Sakshi News home page

నేతల దోపిడీకి ప్రజలను బలి చేస్తారా?

Sep 23 2026 1:49 AM | Updated on Sep 23 2026 1:49 AM

పాణ్యం: నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నా చుక్క నీరివ్వని అధికారులు.. చేపలు పట్టేందుకు అనామకులు రిజర్వాయర్‌ గేట్లు ఎత్తుతుంటే ఏమి చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు అక్రమార్జన కోసం చేపలు పట్టుకునేందుకు దొంగదారిన నీటిని విడుదల చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే ఏమి చేస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నేతల దోపిడీకి ప్రజలను బలి చేయాలనుకుంటున్నారా? అని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరుకల్లు ఘటన తెలుసుకున్న కాటసాని ఉదయం గ్రామానికి చేరుకున్నారు. వీధుల్లో తిరుగుతూ ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేవుడి దయతో ఆస్తి నష్టం తప్ప ప్రాణ నష్టం జరగలేదన్నారు. గోరుకల్లు జలాశయానికి ఆరుగురు లస్కర్లు ఉన్నా ఎవ్వరు రావడం లేదని, వీరంతా కలసి ఓ ప్రయివేట్‌ వ్యక్తిని ఏర్పాటు చేశారని, పని చేయని వారిపై ఎందుకు చర్యలు తీసుకోరని అధికారులను ప్రశ్నించారు. కనీసం ఉన్నతాధికారులు డ్యామ్‌ను విజిట్‌ చేసే ఓపిక లేదా.. అని విమర్శించారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు ముప్పు ఏర్పడిందన్నారు.

నష్టపోయిన ప్రతి ఒక్కరికీ

న్యాయం చేయాలి..

అధికారులు నిర్లక్ష్యం కారణంగా గ్రామంలోకి నీరు చేరడంతో ప్రజలకు నష్టం వాటిల్లిందని, అలాంటి వారికి న్యాయం చేయాలని కలెక్టర్‌ రాజకుమారికి విన్నవించినట్లు కాటసాని తెలిపారు. ప్రధానంగా వరి పొలాల్లోకి నీరు చేరి పంటలు మొత్తం ధ్వంసం అయ్యాయన్నారు. అలాగే ఇళ్లలోకి నీరు చేరి ధాన్యం పూర్తిగా తడిసిపోయిందన్నారు. తక్షణమే వారికి బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు ఇచ్చి ఆదుకోవాలన్నారు. అలాగే పంట నష్టం జరిగిన రైతులకు పరిహారం అందించాలన్నారు. అనధికారింగా గేటు ఎత్తిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరానన్నారు. కాటసాని వెంట వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ సెక్రటరీ సద్దల సూర్యనారాయణరెడ్డి, నాయకులు జింకల సుబ్బారెడ్డి, లక్ష్మీ మద్దయ్య, బాబు, వడ్డుగండ్ల రాముడు, రామలక్ష్మయ్య, సత్యాలు తదితరులు ఉన్నారు.

సీఈ.. మా ఫోన్లను

బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టారు..

గ్రామంలోకి నీళ్లు వస్తున్నాయని సమాచారం అందితే వెంటనే సీఈ కబీర్‌బాషాకు ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోగా మా నంబర్లు బాక్ల్‌ లిస్ట్‌లో పెట్టడం దారుణమని కాటసాని అన్నారు. ఓ జిల్లా అధికారే స్పందించకుంటే ప్రజలకు ఏమి సమాధానం చెబుతారన్నారు. అధికార పార్టీ నాయకుల పంచన చేరిన ఇంటివంటి అధికారులు త్వరలోనే ప్రజల ముందు నిలబడాల్సి వస్తుందన్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి తీరు ఇది కాదన్నారు. సీఈకే తెలిసే రిజర్వాయర్‌ గేట్లు ఎత్తారేమోననే అనుమానం వస్తుందన్నారు. అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదని, అధికారులు తీరు మార్చుకోవాలన్నారు.

చేపల కోసం రిజర్వాయర్‌ గేట్లు

ఎత్తుతారా?

గోరుకల్లు జలాశయం నిర్వహణలో

అధికారుల తీరు దారుణం

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

కాటసాని రాంభూపాల్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement