తాత్కాలిక జెడ్పీ కార్యాలయ ఏర్పాటుకు కసరత్తు | - | Sakshi
Sakshi News home page

తాత్కాలిక జెడ్పీ కార్యాలయ ఏర్పాటుకు కసరత్తు

Sep 22 2026 1:00 AM | Updated on Sep 22 2026 1:00 AM

నంద్యాల(అర్బన్‌): తాత్కాలిక జెడ్పీ కార్యాలయ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుత జెడ్పీ పాలకవర్గం పదవీకాలం సెప్టెంబరు 24తో ముగియనుండగా, సెప్టెంబరు 25 నుంచి జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. జెడ్పీ కార్యకలాపాలను నంద్యాల నుంచే సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. తాత్కాలికంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు నంద్యాలలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలు, వసతులను సోమవారం పరిశీలించారు. ఎంపీడీఓ కార్యాలయం, ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీరాజ్‌ ఆడిట్‌ కార్యాలయ ప్రాంగణాల్లో అందుబాటులో ఉన్న గదులను చూశారు. సెప్టెంబరు 25 నుంచి ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో జెడ్పీ కార్యకలాపాలు కొనసాగనున్న నేపథ్యంలో డిప్యూటీ సీఈఓ, అకౌంట్స్‌ ఆఫీసర్‌, సుమారు 50 మంది సిబ్బంది కర్నూలు నుంచి నంద్యాలకు రానున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. వారికి అవసరమైన కార్యాలయ గదులు, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలను సమకూర్చేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement