జిల్లాలో రూ. 50 లక్షలకు పైగా దోపిడీ | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో రూ. 50 లక్షలకు పైగా దోపిడీ

Sep 22 2026 1:00 AM | Updated on Sep 22 2026 1:00 AM

సర్దుకుపోవాల్సిందే అంటున్నారు

జిల్లా వ్యాప్తంగా ఆరు ప్రాజెక్ట్‌ల పరిధిలో 1,663 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 1,660 మంది కార్యకర్తలు, 1,611 మంది ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం 3,271 మందికి ఒక్కక్కరికి రెండు చీరల చొప్పున 6,542 చీరలు రూ. 500 లెక్కన పంపిణీ చేశారు. ఈ లెక్కన ఒక్కో చీరకు రూ. 400 మిగిలినా రూ. 26 లక్షల వరకు కాంట్రాక్టర్‌, అధికారులు పంచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిరుద్యోగులకు ఇచ్చే దుస్తుల్లోనూ కక్కుర్తి పడుతున్న ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

యూనిఫాం పేరుతో చీరల పంపిణీ

కాంట్రాక్టర్లు, అధికారుల కుమ్మక్కు

అరకొర నాణ్యత..పక్కన పడేసిన వైనం

ఆళ్లగడ్డ: పేదలకు, చిరు ఉద్యోగులకు పలు పథకాలను అమలు చేయడం.. అందినకాడికి దండుకోవడం..టీడీపీ నేతలు లక్ష్యంగా పెట్టకున్నారు. యూనిఫాం పేరుతో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు పంపిణీ చేస్తున్న చీరలనే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. నంద్యాల జిల్లాలో 6,500 చీరలు పంపిణీ చేయగా అవి నాసిరకంగా ఉన్నాయి. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మకై ్క మార్కెట్‌లో రూ. 100 విలువ కూడా చేయని చీరను రూ. 500 చొప్పున కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రశ్నిస్తే బెదిరింపులు!

చీరల నాణ్యతపై అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు నిరసన తెలిపారు. స్థానిక అధికారులపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి అదే అధికారుల ద్వారా యూనియన్‌ లీడర్లను బెదిరించారు. ఎలాంటి గొడవ చేయకుండా, ఎక్కడా నోరు మెదపకుండా ఆ చీరలనే ధరించాలని అందరికీ చెప్పాలని హుకుం జారీ చేశారు. ఉద్యోగాల పేరుతో బెదిరిస్తుండటంపై మహిళలు నుంచి, ఉద్యోగవర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

చీర రంగు, నాణ్యత బాగోలేదు. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అధికారులు చీరలు కట్టుకోకుండా వెనక్కు ఇచ్చేయండి అని చెప్పారు. ఇప్పుడేమో ఎలా ఉన్నా కట్టుకోవాల్సిందేనని చెబుతున్నారు. వెనక్కిస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని సర్దుకుపోవాల్సిందే అని బెదిరిస్తున్నారు.

– అంగన్‌వాడీ కార్యకర్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement