అంగన్‌వాడీ ఆయాకు హైకోర్టులో ఊరట | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ ఆయాకు హైకోర్టులో ఊరట

Sep 22 2026 1:00 AM | Updated on Sep 22 2026 1:00 AM

తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశం

కొలిమిగుండ్ల: మండల పరిధిలోని అబ్దులాపురానికి చెందిన అంగన్‌వాడీ ఆయాగా పని చేసిన హుస్సేన్‌బీకి హైకోర్టులో ఊరట లభించింది. తిరిగి ఆమెను విధుల్లోకి తీసుకోవాలని సోమవారం హైకోర్టు సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ అధికారులకు ఆదేశాలిచ్చింది. ఆయా హుస్సేన్‌బీని ఉద్దేశపూర్వకంగానే తొలగించాలనే నెపంతో గ్రామంలో ఇటీవలనే ఐసీడీఎస్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జనవరి 21న బనగానపల్లె ప్రాజెక్ట్‌ సీడీపీఓ గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఆయాపై వచ్చిన ఆరోపణలు రుజువైనట్లు తేల్చారు. దీంతో ఆమెను విధుల నుంచి తొలగించారు. తర్వాత హుస్సేన్‌బీ తనను అన్యాయంగా తొలగించారని హైకోర్టును ఆశ్రయించారు. తక్షణమే ఆయాను విధుల్లోకి తీసుకుని బనగానపల్లె ప్రాజెక్ట్‌ అధికారి ఎదుట విధులకు హాజరుపరచాలని కోర్టు ఆదేశాలిచ్చింది.

పీజీఆర్‌ఎస్‌కు 105 ఫిర్యాదులు

బొమ్మలసత్రం: జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 105 ఫిర్యాదులు వచ్చాయి. అర్జీదారులతో ఎస్పీ సునీల్‌షొరాణ్‌ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నామన్నారు. చట్టపరిధిలో వాటికి పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఫిర్యాదులు పరిశీలించాలని సంబంధిత పోలీస్‌స్టేషన్‌ అధికారులకు సూచించారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన అర్జీలు తిరిగి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

రూ.2.50 లక్షల విరాళం

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల దేవస్ధానం నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి సోమవారం ఏలూరుకు చెందిన స్వయంప్రకాశం కార్తిక్‌ రూ.2,50,000 విరాళాన్ని దేవస్థాన ఏఈఓ ఫణిధర్‌ ప్రసాద్‌కి అందజేశారు. దాతకు దేవస్థానం తరపున స్వామి వారి శేష వస్త్రాన్ని, లడ్డూ ప్రసాదాలను, జ్ఞాపికను అందజేసి సత్కరించారు.

గ్రామ పంచాయతీల్లో బీసీ ఓటర్లు 9,05,611

కర్నూలు(అర్బన్‌): కర్నూలు జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో 9,05,611 మంది బీసీ ఓటర్లు ఉన్నారు. ఇటీవల క్షేత్ర స్థాయిలోని అధికారులు, సిబ్బంది అన్ని గ్రామ పంచాయతీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లను గుర్తించి జాబితాలను కూడా ప్రచురించారు. మొత్తం 12,50,166 మంది గ్రామీణ ఓటర్లు ఉండగా, వీరిలో బీసీ ఓటర్లు 9 లక్షలకు పైగా ఉండడం గమనార్హం. వీరిలో మహిళలు 4,56,520, పురుషులు 4,48,982, ఇతరులు 109 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీసీ ఓటర్లలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 7538 మంది అధికంగా ఉన్నారు. అలాగే మొత్తం ఎస్‌టీ ఓటర్లు 17,119 మంది, ఎస్సీ ఓటర్లు 2,33,881 మంది, ఇతర కులాలకు సంబంధించిన ఓటర్లు 93,555 మందిగా అధికారులు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement