వైఎస్సార్‌సీపీ పాలనలో ఇలా..
పచ్చని పంటలతో కళకళలాడాల్సిన పొలాలు నేడు వెలవెలబోతున్నాయి. అవుకు రిజర్వాయర్‌లో నీళ్లు లేకపోవడంతో ఖరీఫ్‌లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈ సీజన్‌లో రిజర్వాయర్ పరిధిలో మూడు వేల ఎకరాల్లో వరి సాగు చేసుకుంటారు. సాధారణంగా రైతులు ఈపాటికి నారుమళ్లు పోసుకునేవారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రెండు పంటలు పండించారు. నేడు అవుకు రిజర్వాయర్‌లో వాటర్ డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో వరి మాగాణులు ప్రస్తుతం బీళ్లుగా మారాయి. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో కూడా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు


