బొలేరో వాహనంలో పైన, కింద కూర్చొని.. ట్రాక్టర్‌లో ఇలా.
వర్షాలు లేవు.. వ్యవసాయ పనులు కరువయ్యాయి. కూలీలు ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబాలు గడవడం కష్టమవుతోంది. జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనడంతో కూలీలకు ఎక్కడా పనులు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామంలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న అరకొర వానలకు భూమిలో తేమ లేనప్పటికీ ఉల్లి సాగుకు అదును మించిపోతుందంటూ వందలాది ఎకరాల్లో ఉల్లి నాట్లకు రైతులు సిద్ధమయ్యారు. ఉల్లి నాట్లు వేసేందుకు చార్జీలతో కలిసి రోజుకు రూ.350 నుంచి రూ.400 వరకు రైతులు చెల్లిస్తున్నారు. దీంతో కోడుమూరుతో పాటు, గోనెగండ్ల, దేవనకొండ, గూడూరు, వెల్దుర్తి మండలాల నుంచి రోజుకు 2 – 3 వేల మంది వరకు కూలీలు వెంకటగిరి గ్రామానికి ఉల్లి నాట్లు వేసేందుకు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కూలీలు ఇలా బొలే రో, ఆటోలు, ట్రాక్టర్లలో పదుల సంఖ్యలో ఎక్కి ప్రమాదకర రీతిలో ప్రయాణాలు చేస్తున్నారు.
– కోడుమూరు రూరల్


