కర్నూలు (టౌన్): బాలల సంక్షేమం కోసం, వారికి న్యాయ సహాయం కోసం లీగల్ సర్వీసెస్ కృషి చేస్తోందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి అన్నారు. కర్నూలు శివారులోని పెద్దపాడులోని దామోదరం సంజీవయ్య బాలసదన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. బాలసదన్‌లో పిల్లలకు అందిస్తున్న ఆహారం, సంరక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికై నా న్యాయ సహాయం కావాలంటే లీగల్ సర్వీసెస్ హెల్ప్‌లైన్ నంబర్ 15100కు కాల్ చేసి ఉచితంగా పొందవచ్చన్నారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివరామచంద్ర పాల్గొన్నారు.


