ప్రజలు కష్టంలో ఉన్నారని, అధికారంలోకి వచ్చిన తరువాత సమస్యలన్నీ తొలగిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, సంక్షేమ పథకాలు విస్తృతంగా అమలు చేస్తామని ప్రతీ సమావేశంలో వాగ్దానం చేశారు. గ్రామాలను పట్టణాలకు | - | Sakshi
Sakshi News home page

ప్రజలు కష్టంలో ఉన్నారని, అధికారంలోకి వచ్చిన తరువాత సమస్యలన్నీ తొలగిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, సంక్షేమ పథకాలు విస్తృతంగా అమలు చేస్తామని ప్రతీ సమావేశంలో వాగ్దానం చేశారు. గ్రామాలను పట్టణాలకు

Jul 25 2026 12:29 AM | Updated on Jul 25 2026 12:29 AM

ఏర్పాటు కాని జింకల పార్కు

కలగా మారిన టమాట జ్యూస్‌ ఫ్యాక్టరీ

చెరువులకు అందని హంద్రీ–నీవా నీరు

అందుబాటులోకి రాని

నగరడోణ రిజర్వాయర్‌

గ్రామాలకు 20 రోజులకోసారి

తాగునీటి సరఫరా

నేడు ఆస్పరి మండలంలో

సీఎం చంద్రబాబు పర్యటన

ఎన్నికల సమయంలో

ఆలూరులో ప్రజలకు

హామీలు ఇస్తున్న

చంద్రబాబు(ఫైల్‌)

జింకల పార్కు ఎప్పుడో?

రైతుల వినతి మేరకు హొళగుంద మండలంలోని దేవరగట్టులో జింకల పార్కు ఏర్పాటు చేస్తానని 2013లో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతుల పంటల పొలాల రక్షించుకునేందుకు కంచె ఏర్పాటు చేసుకోవాడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుదని చెప్పారు. అలాగే ఆలూరులో టెక్స్‌టైల్‌ పరిశ్రమ, ఆస్పరి మండలంలో టమాటా జూస్‌ ఫ్యాక్టరీ వంటి హామీలు ఇప్పటికీ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. 2016లో రైతులకు స్ప్రింకర్లు అందించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి హోదాలో ఆలూరు మండలం అరికెర గ్రామ సమీపంలో ప్రారంభోత్సవ సభకు వచ్చిన చంద్రబాబు నియోజకవర్గంలోని చెరువులకు హంద్రీ–నీవా నుంచి ఎత్తిపోతల ద్వారా నీరు నిల్వ చేస్తానని రైతులకు గట్టిగా హామీ ఇచ్చారు. గత ఐదేళ్ల కాలంలో నీటిని ఎత్తింది లేదు.. పోసింది లేదని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. ఆలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు, భూ కబ్జాలు, ఇసుక, ఎర్రమట్టి దోపిడీ, వీధికో బెల్టు షాపులు పెట్టి లక్షలు గడిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు.

పొలాల్లో సంచరిస్తున్న జింకలు

ఐనేకల్లు గ్రామంలో తాగునీటి కోసం నిరీక్షణ

ఆలూరు రూరల్‌: ఎన్నికల సమయంలో అమలు కాని హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక వాటిని మరచిపోవడం సీఎం చంద్రబాబుకు అలవాటేనని ఆలూరు నియోజకవర్గ ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 2024లో ఇచ్చిన హామీలను గుర్తు చేసుకుంటున్నారు. ఆస్పరి మండలంలో శనివారం సంజీవని కార్యక్రమం ప్రారంభానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో నిలదీయడానికి ప్రజలు సిద్ధమయ్యారు.

పూర్తికాని నగరడోణ

చిప్పగిరి మండలంలో నగరడోణ రిజర్వాయర్‌ ఏర్పాటుకు 2007లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. అప్పట్లో రూ.18 కోట్లతో 0.104 టీఎంసీల నీటి సామర్థ్యంతో 14,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రిజర్వాయర్‌ నిర్మాణానికి పూనుకున్నారు. ప్రభుత్వ ధరతో భూములు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నగదును జమ చేశారు. వైఎస్సార్‌ మరణాంతరం ఆ పనులు నిలిచిపోయాయి. పాదయాత్రగా 2013లో చిప్పగిరి మండలానికి చంద్రబాబు వస్తే సమస్యను రైతులు విన్నవించారు. టీడీపీ అధికారంలో వచ్చిన వెంటనే రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తిచేస్తాని హామీ ఇచ్చారు. అధికారంలో వచ్చిన తర్వాత ఐదేళ్లు చేసిందేమి లేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2019లో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రీటెండరింగ్‌ ద్వారా రూ.56 కోట్లతో నగరడోణ రిజర్వాయర్‌ పనులు చేపట్టి 75 శాతం పూర్తి చేశారు. హంద్రీ–నీవా ద్వారా తూము ఏర్పాటు చేసి ఏబీసీ (ఆలూరుబ్రాంచ్‌ కెనాల్‌)కి సాగునీరు అందిస్తామ న్న హామీని చంద్రబాబు పదేళ్లుగా నెరవేర్చలేదు.

మాటలకే పరిమితం!

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రజాగళం పేరుతో ఆలూరులో ఏర్పాటు చేసిన ప్రచార సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. టమాటా జ్యూస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే వేదవతి, నగరడోణ రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తానని మాట ఇచ్చారు. హంద్రీ–నీవా కాలువ ద్వారా చెరువులకు నీటి నింపుతామని చెప్పారు. కేంద్రప్రభుత్వంతో మాట్లాడి హైవే 167 రహదారి నిర్మాణం పూర్తి చేయిస్తామన్నారు. దేవనకొండ మండలంలోని నల్లచెలిమల గ్రామంలోని పెద్ద చెరువు, చిన్న చెరువుకు, నల్లగుండ్ల గ్రామ చెరువులకు హంద్రీ–నీవా ద్వారా నీటిని నింపుతామని వాగ్దానం చేశారు. వేదవతి, నగరడోణ రిజర్వాయర్‌ల నిర్మాణం ఊసేలేకుండా పోయింది. అలాగే టమాటా జ్యూస్‌ ఫ్యాక్టరీ, జింకల పార్కు ఏర్పాటు.. తదితర హామీలు నీటి మూటలా మిగిలిపోయాయి.

ఆలూరు యోకవర్గంలోని ఆరు మండలాల పరిఽధిలో 3.50 లక్షల జనాభా ఉంది. కేవలం తొమ్మిది సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులతో ప్రజలకు తాగునీరు అందించలేకపోతున్నారు. తుంగభద్ర దిగువ కాలువ ద్వారా అన్ని స్టోరేజీలకు తాగునీరు పంప్‌ చేసి అక్కడ నుంచి ఆయా సంపుల ద్వారా ఓవర్‌ హెడ్‌ ట్యాంకులకు నింపి ఇంటింటికి సరఫరా చేస్తున్నారు. మండల కేంద్రాలకు 15 రోజుల ఒక సారి తాగునీరు సరఫరా అవుతోంది. గ్రామీణ ప్రాంతాలకు నెలకో సారి కూడా మంచినీరు సరఫరా కాని పరిస్థితి. ఈ ఏడాది ఎల్‌నీనో ప్రభావంతో వర్షాలు లేక నియోజకవర్గంలో తాగునీటి కష్టాల వేసవి కాలాన్ని తలపిస్తున్నాయి. ప్రజలు మంచినీటి కోసం కిలో మీటర్ల మేర వెళ్లి బోర్లను ఆశ్రయిస్తున్నారు. తాగునీటి కోసం ప్రజలు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాలు ముట్టడిస్తున్నా.. చంద్రబాబు ప్రభుత్వంలో, అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. కరువుకు కేరాఫ్‌గా ఉన్న జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆలూరు ఈ ఏడాది గుక్కెడు నీటి కోసం అల్లాడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement