● ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి
నంద్యాల(వ్యవసాయం): న్యాయ శాఖ మంత్రి ఫరూక్ నియోజకవర్గంలోనే న్యాయవాదులు రోడ్డెక్కి ఆందోళన చేయడం దారుణమని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో న్యాయవాదులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నంద్యాలలలో వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్ జిల్లా అధ్యక్షుడు రామసుబ్బయ్య, ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. దీక్షకు ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మద్దతు తెలిపి మాట్లాడారు. తమ ప్రభుత్వంలో జూనియర్ న్యాయవాదులకు ప్రోత్సాహకంగా రూ.5 వేల స్టయిఫండ్‌ను ఐదేళ్లపాటు ఇచ్చామన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రూ.10వేలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పారని వారు మండిపడ్డారు.
న్యాయవాదుల తరఫున
వైఎస్సార్‌సీపీ పోరాటం
తమ ప్రభుత్వం రాయలసీమకు ప్రాధాన్యత ఇస్తూ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే చంద్రబాబు ప్రభుత్వం దాన్ని కూడా నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే విద్యార్థులు, మెడికోలపై కేసులు నమోదు చేయడాన్కిన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. హామీలను నెరవేర్చే వరకు న్యాయవాదుల తరఫున వైఎస్సార్‌సీపీ పోరాడుతుందన్నారు. భవిష్యత్తులో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకొని వస్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే న్యాయవాదులకు బకాయిలతో సహా గౌరవ వేతనం విడుదల చేయాలన్నారు. న్యాయవాదుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
లీగల్ కియోస్క్ ఏర్పాటు చేయాలి
వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్ జిల్లా అధ్యక్షుడు రామసుబ్బయ్య, ప్రతాపరెడ్డి మాట్లాడుతూ న్యాయస్థానాల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలన్నారు.ఉచిత న్యాయ సేవల కోసం ప్రతి కోర్టులో లీగల్ కియోస్క్ ఏర్పాటు చేయాలన్నారు. న్యాయవాదుల నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ట్రైనింగ్ అకాడమీ నెలకొల్పాలని తెలిపారు. అర్హులైన ప్రతి న్యాయవాదికి ఉచిత ఇంటి స్థలాన్ని కేటాయించాలన్నారు. వైఎస్సార్‌సీపీ నంద్యాల అసెంబ్లీ పరిశీలకులు సద్దల సూర్యనారాయణరెడ్డి, డోన్ అసెంబ్లీ పరిశీలకులు దేశం సుధాకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పెద్ది శ్రీనివాసులు, అఫీషియల్ స్టేట్ స్పోక్ పర్సన్ తిమ్మారెడ్డి, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ నాయకులు విజయశేఖర్‌రెడ్డి, వివేకానందరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, సుబ్బయ్య, అశోక్‌కుమార్‌రెడ్డి, వీవీ కృష్ణారెడ్డి, ఓబుల్‌రెడ్డి, బీవీ కృష్ణారెడ్డి, చింతలయ్య, దత్తాశరత్, పునీత్, సోహెల్‌రాణా, బొల్లెద్దుల రవి, రామాంజనేయులు, శ్రీనివాసరెడ్డి, రామచంద్రారెడ్డి, గోపాలకృష్ణారెడ్డి, చంద్రశేఖర్, సాయిరాంరెడ్డి పాల్గొన్నారు.


