అటవీ హక్కుల పరిరక్షణ కమిటీల ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

అటవీ హక్కుల పరిరక్షణ కమిటీల ఏర్పాటు

Jul 22 2026 1:59 AM | Updated on Jul 22 2026 1:59 AM

కొత్తపల్లి: గిరిజనులకు అటవీహక్కుల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేశామని ఐటీడీఏ ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ ఇన్‌చార్జ్‌ శేఖర్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని శివపురం గూడెంలో డిప్యూటీ తహసీల్దార్‌ అరుణ ఆధ్వర్యంలో గిరిజనులకు గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలను ఇంతకు మునుపు కుటుంబ పెద్దలకు ఇచ్చామని, వారు మరణించడంతో వారసులకు తర్జుమా చేసి 5 మందికి పట్టాలు పంపిణీ చేశామన్నారు. అదేవిధంగా అటవీ హక్కులను కాపాడు కొనేందుకు అటవీ హక్కుల పరిరక్షణ కమిటీల ను రెండింటిని ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ సభ్యు లు అటవీ భూములను కాపాడడం, గిరిజనులకు జవీవనాధార పనులు కల్పించడం, అటవీ భూములు కబ్జాలకు గురికాకుండా చూసుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఎన్‌యూ ఏపీఐఓలు కమురుద్ధీన్‌, ఎస్‌.ఎం భాషా, అటవీశాఖ ఎఫ్‌ఎస్‌ఓ రాంబాబు, గిరిజన సమాఖ్య మహిళా మండలి సీసీ యూసుఫ్‌, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement