గుడ్ల ఉత్పత్తి లేకనే.. | - | Sakshi
Sakshi News home page

గుడ్ల ఉత్పత్తి లేకనే..

Jul 21 2026 1:42 AM | Updated on Jul 21 2026 1:42 AM

గుడ్ల ధర వింటే కనుగుడ్లు తేలేసే పరిస్థితి. గుడ్ల దిగుమతికి తెలంగాణ ప్రధాన ఆధారం. గత వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల కోళ్లు భారీగా మరణించాయి. గుడ్లు ఉత్పత్తి చేసే కోళ్ల పెంపకం తగ్గిపోవడంతో మార్కెట్‌లో సరఫరా తగ్గిపోయింది. ప్రస్తుతం డజను గుడ్ల ధర రూ.96 నుంచి రూ.100 వరకు పలుకుతోంది. రీటైల్‌గా ఒక గుడ్డు రూ.10 ప్రకారం విక్రయిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 15 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 50 శాతం కుటుంబాలు రోజు గుడ్లు తింటారని అంచనా. ఒక్కో కుటుంబం సగటున రోజుకు 4 గుడ్లు తిన్నా 30 లక్షల గుడ్లు అవసరం. నేడు ఆ స్థాయిలో గుడ్ల ఉత్పత్తి లేకపోవడం వల్ల ధరలు పెరిగిపోతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement