హాలహర్వి: తుంగభద్ర జలాలు ఎట్టకేలకు హాలహర్వి మండల సరిహద్దుకు చేరుకున్నాయి. ఈనెల 16న తుంగభద్ర డ్యాం నంచి ఎల్లెల్సీకి విడుదల చేసిన నీరు ఆదివారం చింతకుంట 135వ కి.మీ. వద్దకు చేరుకున్నాయి. ఈ జలాలను చూసి సరిహద్దు గ్రామాల ప్రజలు, సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్లెల్సీకి విడుదల చేసిన నీరు తాగునీటి అవసరాలకే వినియోగించాలని, ఎవరూ పొలాలకు వినియోగించరాదని డ్యాం అధికారులు తెలిపారు.
నేడు షైనింగ్ అవార్డుల ప్రదానం
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్, పది పరీక్షల ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నేడు(సోమవారం)నగర శివారులోని పెద్దపాడు దగ్గర ఉన్న ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాలులో షైనింగ్‌స్టార్ పేరుతో అవార్డులను ఇవ్వనున్నారు. పది పరీక్షల్లో ప్రతిభ చూపిన పిల్లలకు 159 మంది, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ప్రతిభ చూపిన పిల్లలకు 44 మందికి అవార్డులు ఇవ్వనున్నారు. రూ.20 వేల నగదుతో పాటు, మెమోంటో, మెడల్ ఇవ్వనున్నారు.


