ఎల్‌నినో ప్రభావం అంచనా | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో ప్రభావం అంచనా

Jul 18 2026 9:27 AM | Updated on Jul 18 2026 9:27 AM

పంటలను పరిశీలించిన

శాస్త్రవేత్తల బృందం

డోన్‌ రూరల్‌: జిల్లాలో ఎల్‌నినో ప్రభావం అంచనా వేయడానికి ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ సత్యనారాయణ, విస్తరణ సంచాలకులు రామచంద్రరావు ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. బేతంచెర్ల, డోన్‌, ప్యాపిలి మండలాల్లోని రంగాపురం, ఆర్‌ కొత్తపల్లె, ఎద్దుపెంట, చనుగొండ్ల, పెద్దపొదిళ్ల, చిన్నపొదిళ్ల గ్రామాల్లో పంటల సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు స్థానిక రైతులు, వ్యవసాయ సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. వారి వెంట జిల్లా వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు గంగాధర్‌, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అసోసియేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ జయలక్ష్మి, శాస్త్రవేత్తలు మల్లేశ్వరరెడ్డి, అశోక్‌కుమార్‌, రామకృష్ణ, నజరుద్దీన్‌, ధనలక్ష్మి, బాలరాజు, సుధాకర్‌, డోన్‌ ఏడీఏ సునీత, మండలాల వ్యవసాయ అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement