ఆత్మకూరు: వ్యవసాయానికి పగలే 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి టి.వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం ఏడీ ఆఫీసు ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే నెలలో కురిసిన వర్షాల వల్ల ముందస్తు వ్యవసాయం చేసి మొక్కజొన్న, పత్తి, వరి, మిర్చి కూరగాయల పంటలు సాగు చేశారని, జూన్, జులై నెలల్లో వర్షాలు కురవకపోవడంతో పైర్లు ఎండిపోతున్నాయన్నారు. బోరుబావుల ద్వారా పంటలను కాపాడుకుందామనుకుంటే విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండటం లేదన్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి పగటిపూటే 9 గంటల విద్యుత్‌ను అందించాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి యం.వీరన్న, పండ్ల తోటల రైతు సంఘం అధ్యక్షుడు ఎం.మహబూబ్‌బాషా, బాలయేసు, అంబయ్య, జమాల్‌ఖాన్, రాజమ్మద్, రబ్బాని, బి.హిదయతుల్లా, ఏసన్న, రంగస్వామి, దేవకుమార్ పాల్గొన్నారు.


